Saripodhaa Sanivaaram 2: సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్-nani clarity on saripodhaa sanivaaram 2 and says its depends on block buster saripodhaa sanivaaram sequel updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram 2: సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్

Saripodhaa Sanivaaram 2: సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 28, 2024 01:47 PM IST

Nani About Saripodhaa Sanivaaram Sequel: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు నాని చెప్పాడు. ఈ క్రమంలోనే సరిపోదా శనివారం సీక్వెల్‌పై నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్
సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్

Nani On Saripodhaa Sanivaaram 2: దసరా, హాయ్ నాన్న వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌లో

నానితోపాటు ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, మురళీ శర్మ, సాయి కుమార్, అలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సరిపోదా శనివారం ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో సరిపోదా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో సరిపోదా శనివారం 2పై క్లారిటీ ఇచ్చాడు నేచురల్ స్టార్.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి?

-'సరిపోదా శనివారం'చాలా రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా ఉంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. ఇలాంటి పరిగెడుతున్న సినిమాకి ఏం స్కోర్ చేస్తాడనే ఒక క్యురియాసిటీ ఉండేది. నిన్న వెళ్లి ఆర్ఆర్ చూశా. బేసిగ్‌గా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ ఉంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. అందులో బిట్స్‌ని ఆర్ఆర్‌గా పంప్ చేస్తుంటారు. కానీ జేక్స్.. మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్‌లా కొట్టాడు. తన మ్యాజిక్ 29న చూస్తారు.

అంటే సుందరానికీ విడుదల తర్వాత మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారని వివేక్ చెప్పారు?

- అంటే సుందరానికీ చాలా మందికి ఫేవరేట్ సినిమా. ఆ జోనర్‌ని ఇష్టపడే ఆడియన్స్‌కి అది అల్ టైం ఫేవరేట్‌లో ఒకటి. అయితే రిలీజైన రోజుల్లో ఆ సినిమా రన్ టైం, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అలాంటి సమయంలో 'నేను సరిగ్గానే చేశానా?' అనే డౌట్స్ తనలో ఉండేవి.

- భాద్యత తీసుకున్న వారికి ఇలాంటి డౌట్స్ ఉండటం సహజం. అలాంటి సమయంలో తన బలాన్ని గుర్తు చేస్తూ నేను తన పక్కన ఒక బ్రదర్‌లా ఉన్నాను. తను టెర్రిఫిక్ డైరెక్టర్. 'సరిపోదా శనివారం'కి రన్ టైం, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్. మేము అనుకున్న ఐడియా, సెటప్,పే అఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది. మేము ఎలా చేయాలని అనుకునన్నామో అలా చేశాం.

సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని నిర్మాత దానయ్య చెప్పారు?

-నా ప్రతి సినిమాకి ఇలానే చేస్తానండి. నా డైరెక్టర్‌కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌లా పని చేస్తాను. నా నిర్మాతలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిస్తేనే సక్సెస్ అని ఫీలౌతాను.

ఫ్రాంఛైజ్‌గా తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందా?

-సరిపోదా శనివారం సినిమాను ఫ్రాంఛైజ్‌గా (సీక్వెల్‌గా) తీసుకెళ్లే పాజిబులిటీ అయితే ఉంది. ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేస్తే ఆ పాజిబులిటీ ఉంది.