Prabhas Review On Gaami Teaser: అఘోరాగా విశ్వక్ సేన్.. గామి టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే!-prabhas reacts to gaami teaser and vishwak sen played aghora role in gaami movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Review On Gaami Teaser: అఘోరాగా విశ్వక్ సేన్.. గామి టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే!

Prabhas Review On Gaami Teaser: అఘోరాగా విశ్వక్ సేన్.. గామి టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Feb 18, 2024 05:01 PM IST

Prabhas About Gaami Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ఇటీవల గామి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తాజాగా గామి టీజర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా టీజర్‌ను ఇన్ స్టా స్టోరీలో షేర్ కూడా చేశాడు.

అఘోరాగా విశ్వక్ సేన్.. గామి టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే!
అఘోరాగా విశ్వక్ సేన్.. గామి టీజర్‌పై ప్రభాస్ రియాక్షన్ ఇదే!

Prabhas Reacts To Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా విభిన్న చిత్రాలు రూపొందిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదే కాకుండా మరో డిఫరెంట్ రోల్‌తో విభిన్న జోనర్‌లో మూవీ చేస్తున్నాడు విశ్వక్ సేన్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ ఏర్పడింది.

మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ నటిస్తున్నాడు. ఈ ఐడియానే గామిపై క్యురియాసిటీని పెంచింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ అడ్వెంచర్ డ్రామాకి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే గామి ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేకెత్తించాయి.

ఇటీవల గామి ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు. విశ్వక్ సేన్ తన సమస్యకు నివారణను చెప్పే వాయిస్‌ ఓవర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. ఎంజీ అభినయ, చాందిని చౌదరి ఇతర ముఖ్యమైన పాత్రలు ఒకదాని తర్వాత మరొకటి పరిచయం చేశారు. చివరగా, విశ్వక్ శంకర్ అనే అఘోరాగా పరిచయం అయ్యారు. "ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా ?" అని విశ్వక్ చెప్పడం ఆసక్తిగా కలిగించింది.

చివరి విజువల్స్‌లో విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు చూపించారు. గామి టీజర్‌లోని పాత్రలు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాయి. టీజర్ ద్వారా అనౌన్స్ చేసినట్లు ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అయితే గామి టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా గామి టీజర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించాడు. అంతేకాకుండా గామి టీజర్‌ను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో షేర్ కూడా చేశాడు.

"గామి టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రభాస్ తన రియాక్షన్ తెలిపాడు. ఇదిలా ఉంటే గామి సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రానుంది. నిజానికి విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మార్చి 8న రిలీజ్ కావాల్సింది. కానీ, ఆ స్థానంలో గామి విడుదల కానుంది. గామిలో విశ్వక్‌కు జోడీగా చాందినీ చౌదరి నటించింది. వీళ్లిద్దరితోపాటు సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గామి చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే నరేష్ కుమారన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. మరి విభిన్న ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో ఎలా ఆకట్టుకుంటాడో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ 2024