Heroine Murder: హీరోయిన్‌ను కుటుంబంతో సహా చంపేసిన సవతి తండ్రులు.. ఉగ్రవాదులతో సంబంధం!
Laila Khan Murdered By Step Father Parvez Iqbal Tak: బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్‌ను తన కుటుంబంతో సహా ఆరుగురిని కాల్చి చంపేశాడు ఆమె ఇద్దరు సవతి తండ్రులు పర్వేజ్ ఇక్బాల్ తక్, ఆసిఫే షేక్. లైలా ఖాన్ భర్త ఉగ్రవాద సంస్థకు చెందిన మాజీ సభ్యుడు కావండ కీలకంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Heroine Murder By Step Fathers: సినీ తారల జీవితాలు సినిమాల్లో కనిపించినంత కలర్‌ఫుల్‌గా సంతోషంగా కనిపించవు. వారి జీవితాల్లో అంతులేని విషాదం, చీకటి కోణాలు ఉంటాయి. ఊహించని సంఘటనలు బయటపడినప్పుడే వాటి లోతు తెలుస్తుంది. అందుకు ఉదాహరణే ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్ హత్య.
హత్య చేసినట్లు
1978లో జన్మించిన లైలా ఖాన్ అసలు పేరు రేష్మా పటేల్. లైలా ఖాన్‌ను తన సవతి తండ్రి పర్వేజ్ తక్ జనవరి 30, 2011న హత్య చేసినట్లు రుజువు అయింది. అందుకు గాను పర్వేజ్ తక్‌కు మరణ శిక్ష కూడా పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లైలా ఖాన్ 2008లో వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీ అనే మూవీతో బాలీవుడ్‌లో డెబ్యూ చేసింది.
ఇందులో రాజేష్ ఖన్నాతో కలిసి యాక్ట్ చేసింది లైలా ఖాన్. అనంతరం ఊహించనివిధంగా చిక్కుల్లో పడింది ఈ హీరోయిన్. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ గ్రూప్ నుంచి బహిష్కరించబడిన సభ్యుడు మునీర్ ఖాన్‌ను లైలా ఖాన్ వివాహం చేసుకుంది. దీంతో ఆమె అనేక వివాదాలు ఎదుర్కొంది.
తప్పిపోయినట్లు
అనంతరం జనవరి 30, 2011న మునీర్ ఖాన్ కుటుంబం, అతని భార్య లైలా ఖాన్, అత్తగారు, తోబుట్టువులు, బంధువులతో సహా ముంబై నుంచి తన సొంతిల్లు ఉన్న ఇగత్‌పురికి వెళ్లారు. అనంతరం లైలా ఖాన్‌తోపాటు కుటుంబం అంతా కనిపించకుండా పోయిందది. లైలా ఖాన్ తప్పిపోయినట్లు తన తండ్రి నాదిర్ షా పటేల్ కేసు పెట్టారు.
లైలా ఖాన్‌తో కలిసి పనిచేస్తున్న బాలీవుడ్ దర్శకుడు రాకేష్ సావంత్ కూడా ఆమె తప్పిపోయినట్లు నివేదించారు. 2012 జూలై 17న లైలా ఖాన్ తండ్రి నాదిర్ షా పటేల్ తన కుమార్తె కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి బదిలీ చేయాలని బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాల్చి చంపినట్లు
మరోవైపు లైలా ఖాన్ తల్లి అతియా పటేల్ రెండో భర్త ఆసిఫ్ షేక్, మూడో భర్త పర్వేజ్ ఇక్బాల్ తక్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన సభ్యులనే అనుమానంతో అరెస్ట్ అయ్యారు. మరో కేసుకు సంబంధించి పర్వేజ్ తక్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు 2012 జూన్ 21న అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో లైలా ఖాన్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులందరిని కాల్చి చంపినట్లు పర్వేజ్ ఇక్బాల్ తక్ ఒప్పుకున్నాడు.
అనంతరం వాళ్లంతా బతికే ఉన్నారని చెబుతూ అంతకుముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు పర్వేజ్ తక్. చివరికీ వ్యక్తిగత కారణాల వల్ల లైలా ఖాన్‌ను, ఆమె కుటుంబాన్ని చంపి ఇగత్‌పురిలో ఉన్న హీరోయిన్ బంగ్లా వెనుక పాతిపెట్టినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు పర్వేజ్ ఇక్బాల్ తక్.
డీఎన్‌ఏ టెస్ట్‌లో
ఈ విచారణలో భాగంగా బెంగళూరులో అరెస్ట్ అయిన లైలా ఖాన్ మరో సవతి తండ్రి ఆసిఫ్ షేక్ కూడా ఈ హత్యల్లో పాలుపంచుకున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం లైలా ఖాన్ బంగ్లా దగ్గరిలో ఆరు మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. అవి లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యులవేనని 2012 నవంబర్‌లో డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది. కాగా లైలా ఖాన్ భర్త మునీర్ ఖాన్ ఉగ్రవాద సంస్థ మాజీ సభ్యుడు కావడం వల్లే ఈ ఘటన జరిగిందనే అనుమానాలు రావడం గమనార్హం.