తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  City Of Dreams Season 3: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్ చేసిన హాట్‌స్టార్

City of Dreams season 3: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్ చేసిన హాట్‌స్టార్

Hari Prasad S HT Telugu

04 May 2023, 17:23 IST

    • City of Dreams season 3: సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ ట్రైలర్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. సీఎం కుర్చీ కోసం గైక్వాడ్ కుటుంబంలో సాగే డ్రామాను ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు చూపించింది.
సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది
సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది

సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 వచ్చేస్తోంది

City of Dreams season 3: సిటీ ఆఫ్ డ్రీమ్స్ వెబ్ సిరీస్ సీజన్ 3 త్వరలో రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూపొందించిన ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్లు తాజాగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. గురువారం (మే 4) ఈ కొత్త సీజన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

మహారాష్ట్ర సీఎం కుర్చీ కోసం గైక్వాడ్ కుటుంబంలో జరిగే ఫైట్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. దీనిని ఉద్దేశించి ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. "మహారాష్ట్రతో గైక్వాడ్ల బంధం ఇంకా ముగిసిపోలేదు. మీరు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలుసు. హాట్‌స్టార్ స్పెషల్స్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 త్వరలోనే రాబోతోంది" అనే క్యాప్షన్ ఉంచింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.

ఈ సిరీస్ కు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి, ప్రియా బాపట్, సచిన్ పిల్గావ్‌కర్, సుశాంత్ సింగ్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గైక్వాడ్ పై దాడి జరుగుతుంది. అయితే తన రాజకీయ వారసుడిగా తన కొడుకే ఉండాలి తప్ప కూతురు కాదని అతడు భావిస్తాడు.

రాజకీయ వారసత్వాన్ని అందుకోవడానికి కూతుళ్లు సరికాదని నమ్మే వ్యక్తి అతడు. కానీ అతని అభిప్రాయం తప్పని నిరూపించడానికి ఆ కూతురు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గైక్వాడ్ల కుటుంబంలో కలహాలు రేగుతాయి. తన తమ్ముడిని కూడా చంపి మరీ గైక్వాడ్ కూతురు సీఎం కుర్చీ ఎక్కుతుంది. తొలి రెండు సీజన్లలో స్టోరీ మొత్తం తండ్రీ కూతుళ్ల చుట్టే తిరుగుతుంది.

సిటీ ఆఫ్ డ్రీమ్స్ రెండు సీజన్లూ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక మూడో సీజన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని డైరెక్టర్ నగేష్ కుకునూర్ చెప్పాడు. "సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 1, 2లను ఆడియెన్స్ ఆదరించారు. సీజన్ 3పై ఇది అంచనాలను పెంచేసింది. క్లిష్టమైన పాత్రలు, వాళ్ల మధ్య సంబంధాలు, ట్విస్టులు ఈ సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3ని మరింత ఆసక్తిగా మారుస్తాయి" అని కుకునూర్ చెప్పాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.