తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Success Celebrations: భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్.. మెగాస్టార్ సందడి

Waltair Veerayya Success Celebrations: భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్.. మెగాస్టార్ సందడి

19 January 2023, 18:33 IST

    • Waltair Veerayya Success Celebrations: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను భోళా శంకర్ సెట్స్‌లో జరిపారు.
భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్
భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్

భోళా శంకర్ సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్

Waltair Veerayya Success Celebrations: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వరుస హిట్లను అందుకున్న మన మెగాస్టార్ తన తదుపరి ప్రాజెక్టుతో బిజీగా మారారు. గత అక్టోబరులో గాడ్‌ఫాదర్ సక్సెస్‌తో హిట్ అందుకున్న చిరు.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్‌ను సాధించారు. ఇదే సమయంలో తన తదుపరి ప్రాజెక్టుతో బిజీ అయిపోయారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో వాల్తేరు వీరయ్య సెలబ్రేషన్స్ జరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

8AM Metro OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న మల్లేశం మూవీ డైరెక్టర్ సినిమా '8ఏఎం మెట్రో'.. ఎక్కడ చూడొచ్చంటే..

Kamakshi Bhaskarla: నాగ‌చైత‌న్య‌తో వెబ్‌సిరీస్ చేయ‌నున్న పొలిమేర 2 హీరోయిన్ - దూత‌కు మించి థ్రిల్లింగ్‌!

The Boys 4 OTT: సూపర్ హీరోలపై సెటైరికల్‌, వయెలెంట్ సిరీస్- ఓటీటీలోకి ది బాయ్స్ 4- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ డిజాస్ట‌ర్...అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ - ఈ సారి మాస్ క‌థ‌

భోళా శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్ర సక్సెస్‌ను సెలబ్రేట్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు ఆయన కూడా ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా కేకు కట్ చేసి భోళా శంకర్ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్‌కు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీమ్‌కు బోళా శంకర్ చిత్రబృందం శుభాకాంక్షలు చెప్పింది.

వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న చిత్రం భోళా శంకర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా.. చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇందులో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. కీర్తి.. మెగాస్టార్‌కు సోదరి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరు కాకుండా మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెహర్ రమేష్ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.