తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sindhooram Trailer: నక్సలైట్‌గా శివ బాలాజీ.. సింధూరం ట్రైలర్ విడుదల

Sindhooram Trailer: నక్సలైట్‌గా శివ బాలాజీ.. సింధూరం ట్రైలర్ విడుదల

19 January 2023, 18:08 IST

    • Sindhooram Trailer: టాలీవుడ్ ప్రముఖ నటుడు శివ బాలాజీ నటించిన తాజా చిత్రం సింధూరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుందీ సినిమా.
సింధూరం ట్రైలర్
సింధూరం ట్రైలర్

సింధూరం ట్రైలర్

Sindhooram Trailer: ప్రముఖ నటుడు శివ బాలాజీ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం సింధూరం. నక్సలైట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లు ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో శివ బాలాజీతో పాటు ధర్మ మహేష్, బ్రిగిడా సాగ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పోలీసులు, నక్సలైట్లకు మధ్య సాగే సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మధ్యలో ఈ కథాంశానికి లవ్ స్టోరీని కూడా జోడించారు. ట్రైలర్ వాస్తవికంగా ఉంది. చూసేందుకు చిన్న సినిమా మాదిరిగా అనిపిస్తున్నటప్పటికీ క్వాలిటీ పరంగా ఎలాంటి రాజీ లేకుండా తీసినట్లుతెలుస్తోంది.

ఇప్పటికే నక్సల్స్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ.. సింధూరం మాత్రం రియాల్టీగా దగ్గరగా తీసినట్లు తెలుస్తోంది. ఓ హై ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. చివర్లో యుద్ధం జరిగేటప్పుడు ఆపి గీత చెప్పడానికి నేను శ్రీ కృష్ణుడిని కాదు.. నువ్వు అర్జునుడివి కాదు అని శివ బాలాజీ చెప్పే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. లవ్ స్టోరీకి నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇందులో శివ బాలాజీ పాత్రల కీలకం కానున్నట్లు ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది.

తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడా సాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శివ బాలాజీ, ధర్మ మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు హరి గౌరవ సంగీతాన్ని సమకూర్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం