తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Says Proud Moment For Indian Cinema Amid Ram Charan Participated In Us Tv Show

Chiranjeevi Proud on Ram Charan: పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. భారతీయ సినిమాకు గర్వకారణమని వ్యాఖ్య

23 February 2023, 16:25 IST

    • Chiranjeevi Proud on Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాపులర్ యూఎస్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో పాల్గొన్న నేపథ్యంలో తండ్రి చిరంజీవి తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇది తెలుగు, భారతీయ సినిమా గర్వించదగ్గ క్షణమని ఆయన అన్నారు.
అమెరికన్ టీవీ షోలో పాల్గొన్న చిరంజీవి
అమెరికన్ టీవీ షోలో పాల్గొన్న చిరంజీవి

అమెరికన్ టీవీ షోలో పాల్గొన్న చిరంజీవి

Chiranjeevi Proud on Ram Charan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అమెరికన్ పాపులర్ టీవీ షోలో రామ్ చరణ్ పాల్గొనడంతో ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా అనే యూఎస్ టెలివిజన్ షోలో చరణ్ పాల్గొనడంతో మెగాస్టార్ తన ట్విటర్ వేదికగా పోస్టును షేర్ చేశారు. తెలుగు, భారతీయ సినిమాకు ఇది గర్వపడే క్షణమంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

"ఇది తెలుగు, ఇండియన్ సినిమాకు గర్వించగిన క్షణం. రామ్ చరణ్ పాపులర్ టీవీ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా 'లో పాల్గొన్నాడు. ఉద్వేగభరితమైన ఆలోచన శక్తి విజనరీ రాజమౌళి మెదడులో ఎలా పుట్టిందో అది అద్భుతం. ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ఇంక ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు.

వచ్చే నెలలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చరణ్ అమెరికా వెళ్లారు. అక్కడ గుడ్ మార్నింగ్ అమెరికా అనే టీవీ షోలో పాల్గొన్న రామ్ చరణ్.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ స్పీల్ బర్గ్ అంటూ పొగిడారు. అంతేకాకుండా రాజమౌళి త్వరలో గ్లోబల్ సినిమాతో ముందుకు వస్తారని స్పష్టం చేశారు. ఆయన తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీస్తున్నారని తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తి స్నేహం గురించి, ఇద్దరి మధ్య సోదరభావం, సంబంధంపై ఉంటుందని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ అందుకుంది. ఇప్పటికే ఈ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కూడా ఈ సినిమా అందుకుంది. ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చి 3న రీ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.