తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: చిరంజీవి ఇంటికి కమల్‌ హాసన్‌, సల్మాన్‌ ఖాన్‌.. ఫొటోలు వైరల్‌

Chiranjeevi: చిరంజీవి ఇంటికి కమల్‌ హాసన్‌, సల్మాన్‌ ఖాన్‌.. ఫొటోలు వైరల్‌

Hari Prasad S HT Telugu

12 June 2022, 10:19 IST

    • మూడు సినీ ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు లెజెండరీ నటులు ఒక్కచోట చేరారు. తమిళ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌లకు ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఆ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు.
చిరంజీవి ఇంట్లో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్
చిరంజీవి ఇంట్లో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ (Twitter)

చిరంజీవి ఇంట్లో సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఓ మెగాస్టార్‌. ఇక తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూపర్‌స్టార కమల్‌హాసన్‌. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అందరికీ సుపరిచితమైన పేరు సల్మాన్‌ ఖాన్‌. ఈ ముగ్గురూ ఒక్కచోట కలిశారు. కమల్‌ లేటెస్ట్‌ మూవీ విక్రమ్‌ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస మీట్‌ కోసం శనివారం హైదరాబాద్‌ వచ్చిన కమల్‌ హాసన్‌.. రాత్రి చిరంజీవి ఇంటికి వెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

Vijay Deverakonda Birthday: విజయ్ దేవరకొండ పుట్టిన రోజున మూడు సినిమాల నుంచి అప్‍డేట్స్: వివరాలివే

అటు గాడ్‌ఫాదర్‌ మూవీలో చిరంజీవితో కలిసి నటిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కూడా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మెగాస్టార్‌ ఆతిథ్యం స్వీకరించాడు. కమల్‌ హాసన్‌, చిరంజీవి సుమారు నాలుగు దశాబ్దాలుగా మిత్రులు. దీంతో చాలా రోజుల తర్వాత నగరానికి వచ్చిన కమల్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు చిరంజీవి. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి విక్రమ్‌ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఈ ఫొటోను ఆదివారం ఉదయం చిరంజీవి తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశాడు. "నా చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను అతని విక్రమ్‌ సక్సెస్‌ సందర్భంగా గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సల్లూ భాయ్‌, లోకేష కనగరాజ్‌ & టీమ్‌కు కూడా గత రాత్రి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. విక్రమ్‌ మూవీ చాలా థ్రిల్లింగా ఉంది. నా ఫ్రెండ్‌కు శుభాకాంక్షలు" అని చిరంజీవి అన్నాడు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ను, సల్మాన్‌ఖాన్‌ను సన్మానించాడు.

ఈ నెల 3న రిలీజైన విక్రమ్‌ మూవీ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఒక్క తమిళంలోనే రూ.100 కోట్లు దాటాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.