తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Movie: విక్రమ్‌ సక్సెస్‌ క్రెడిట్‌ నితిన్‌ తండ్రిదే అంటున్న కమల్‌ హాసన్‌

Vikram Movie: విక్రమ్‌ సక్సెస్‌ క్రెడిట్‌ నితిన్‌ తండ్రిదే అంటున్న కమల్‌ హాసన్‌

HT Telugu Desk HT Telugu

12 June 2022, 9:04 IST

google News
    • కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ కొట్టేసింది. ముఖ్యంగా తమిళంతోపాటు తెలుగులో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడులో మూడేళ్ల తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన తొలి మూవీ ఇదే కావడం విశేషం.
హైదరాబాద్ లో జరిగిన విక్రమ్ సక్సెస్ మీట్
హైదరాబాద్ లో జరిగిన విక్రమ్ సక్సెస్ మీట్ (Twitter)

హైదరాబాద్ లో జరిగిన విక్రమ్ సక్సెస్ మీట్

విక్రమ్ మూవీ సక్సెస్‌ మీట్‌ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దీనికోసం ఈ మూవీ హీరో కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చారు. తన లేటెస్ట్ మూవీ విరాట పర్వం రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న రానా ఈ సక్సెస్‌ మీట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చాడు. విక్రమ్‌ ఊహించని రేంజ్‌లో సక్సెస్‌ సాధించడంతో కమల్‌ హాసన్‌ చాలా సంతోషంగా ఉన్నాడు.

ఇప్పటికే డైరెక్టర్‌తోపాటు సినిమాలో నటించిన వాళ్లందరికీ కమల్‌ ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఈ సినిమా హిట్‌ అవడానికి కారణంగా నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డే అని సక్సెస్‌ మీట్‌ సందర్భంగా కమల్‌ హాసన్‌ అన్నాడు. "ఈ సినిమాను శ్రేష్ఠ్‌ మూవీస్‌కి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సుధాకర్‌రెడ్డి, నితిన్‌ వల్లే ఈ సినిమా ఇన్ని థియేటర్లలో రిలీజైంది. వాళ్లు లేకుండా ఈ సినిమాకు ఇన్ని థియేటర్లు, ఇంత పబ్లిసిటీ దక్కేది కాదు. వాళ్లే సినిమాను నిర్మించినట్లు ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ సైన్‌ చేసే సమయంలోనే మనం చరిత్ర సృష్టించాలని వాళ్లను చెప్పాను. వాళ్లు నా బేబీ (విక్రమ్‌)ని రికార్డు బ్రేకింగ్‌ చైల్డ్‌గా మలిచారు" అని కమల్‌ అనడం విశేషం.

ఇక డైరెక్టర్‌ లోకేష్‌పైనా కమల్‌ ప్రశంసలు కురిపించాడు. సినిమాకు భాష అడ్డు కాదని మరోసారి నిరూపితమైందని, మంచి సినిమాలను ఇలాగే ఆదరించాలని కోరాడు. మరోచరిత్ర తెలుగు సినిమా చెన్నైలో సబ్‌టైటిల్స్‌ లేకుండా రెండున్నరేళ్ల పాటు ఆడిందని ఈ సందర్భంగా కమల్‌ గుర్తు చేసుకున్నాడు. అటు డైరెక్టర్‌ లోకేష్‌ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇక్కడ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ తమను ఎంతగానో సంతోషానికి గురి చేసిందన్నాడు.

ఇక స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన రానా మాట్లాడుతూ.. తాను విక్రమ్ మూవీ తెలుగు, తమిళం వెర్షన్లు రెండింటినీ ఒకే రోజు చూసినట్లు చెప్పాడు. కమల్‌ సర్‌ను చాలా కూల్‌గా చూపించాడంటూ డైరెక్టర్‌ లోకేష్‌ను కొనియాడాడు. సినిమా అద్భుతంగా ఉందని అన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం