తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan | విక్రమ్ సక్సెస్‌తో అసిస్టెంట్ డైరెక్టర్లకు గిఫ్ట్ ఇచ్చిన కమల్

Kamal Haasan | విక్రమ్ సక్సెస్‌తో అసిస్టెంట్ డైరెక్టర్లకు గిఫ్ట్ ఇచ్చిన కమల్

08 June 2022, 12:34 IST

    • విక్రమ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కమల్ హాసన్.. తన దర్శకుడితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లకు బహుమతులు ఇచ్చారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు ఖరీదైన కారు ఇవ్వగా.. అసిస్టెంట్ డైరెక్టర్లకు బైక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
కమల్ హాసన్
కమల్ హాసన్ (Twitter)

కమల్ హాసన్

కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత ఓ సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రమ్ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు కమల్. ఇప్పపటికే దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు ఖరీదైన కారును కూడాబహుకరించాడు. తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్లపై కూడా తన ప్రేమను చూపించారు మన లోకనాయకుడు. 13 మంది సహాయ దర్శకులకు బైక్స్‌ను కానుకగా ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

విక్రమ్ సినిమాకు అసిస్టెంట్ దర్శకులుగా పనిచేసిన 13 మంది సహాయ దర్శుకులకు అపాచీ ఆర్టీఆర్160 బైక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సినిమాకు రాత్రి, పగలు కష్టపడి ఔట్ పుట్ మంచిగా రావడంలో సహాయపడినందుకు గాను.. అసిస్టెంట్ డైరెక్టర్లకు ఈ మోటార్ సైకిళ్లను బహుకరించారు. అంతకుముందు విక్రమ్ సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. లెక్సస్ కంపెనీకి చెందిన లగ్జరీ వాహనాన్ని బహుకరించారు.

జూన్ 3న విడుదలైన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఐదో రోజుల్లోనే ఏకంగా రూ.175 కోట్లను రాబట్టింది. ఫలితంగా ఆనందంతో పరవశించినపోయిన కమల్.. తన క్రియేటివ్ టీమ్‌ను కానుకలతో ముంచెత్తుతున్నారు.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించగా.. సూర్య అతిథి పాత్రలో మెరిశారు. జూన్ 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు. తెలుగులో హీరో నితిన్ సొంత బ్యానరైన శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేసింది.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.