తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gang Leader Movie Re Release: చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Gang Leader Movie Re Release: చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

05 February 2023, 8:55 IST

  • Gang Leader Movie Re Release: చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ మ‌రోసారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ఇదే.

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Gang Leader Movie Re Release: చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఫిబ్ర‌వ‌రి 11న ఈ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే బుకింగ్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

Alia Bhatt Saree: ఆలియా భట్ మెట్ గాలా 2024 చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ

Brahmamudi May 7th Episode: తండ్రి త‌ప్పుకు రాజ్‌కు శిక్ష‌- దుగ్గిరాల ఇంటికి కావ్య దూరం - రాజ్ బిడ్డ‌కు తండ్రి ఎవ‌రంటే?

విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో 1991లో రూపొందిన గ్యాంగ్ లీడ‌ర్‌ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. చిరంజీవి హీరోయిజం, డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. చేయి చూశావా ఎంత ర‌ఫ్‌గా ఉందో రప్ఫాడించేస్తా అనే డైలాగ్ పాపుల‌ర్ అయ్యింది.

విజ‌య బాపినీడు క‌థ‌ను అందించిన ఈ సినిమాకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ రాశారు. విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, సుమ‌ల‌త, ముర‌ళీమోహ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇఫీతో పాటు ప‌లు ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శిత‌మైంది.

50కిపైగా థియేట‌ర్ల‌లో శ‌త‌దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న‌ది. ఈ సినిమాను హిందీలో ఆజ్ కా గూండా రాజ్ పేరుతో రీమేక్ చేశారు. హిందీ రీమేక్‌లో చిరంజీవి హీరోగా న‌టించాడు. బాలీవుడ్‌లో ఈ సినిమా 27 ల‌క్ష‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌తో చిరంజీవి జోరుమీదున్నాడు. ఆ స‌క్సెస్ క్రేజ్ గ్యాంగ్ లీడ‌ర్ రీ రిలీజ్‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.