తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 25th Episode: బ్రహ్మముడి.. అనామిక కంపెనీలో చేరిన కావ్య.. పుట్టింటి నుంచి వెళ్లిపోతానన్న కళావతి

Brahmamudi September 25th Episode: బ్రహ్మముడి.. అనామిక కంపెనీలో చేరిన కావ్య.. పుట్టింటి నుంచి వెళ్లిపోతానన్న కళావతి

Sanjiv Kumar HT Telugu

25 September 2024, 7:19 IST

google News
  • Brahmamudi Serial September 25th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన కనకంకను రుద్రాణి అవమానిస్తుంది. మరోవైపు అనామిక కంపెనీలో చేరుతుంది కావ్య. జాబ్‌లో జాయిన్ అయినట్లు తల్లిదండ్రులకు చెబుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి కనకం వస్తుంది. పిలవని పేరంటానికి వచ్చావ్. ఒక వంక దొరికిందా. ఈ సాకుతో కూతురుని అత్తారింటి పంపించి చేతులు దులుపేసుకుందామని వచ్చావా. మీకే తిండికి గతిలేదు. మీ కూతురుకు ఏం పెడతారు పాపం. అందుకని ఇక్కడికి మళ్లీ పంపించాలని చూస్తున్నావేమో. అది జన్మలో జరగదని మా రాజ్ ఎప్పుడో చెప్పాడు అని రుద్రాణి అంటుంది.

దానికి ఏం మాట్లాకుండా సైలెంట్‌గా అపర్ణ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం గురించి అడుగుతుంది కనకం. ఇప్పుడు పర్వాలేదని అపర్ణ అంటుంది. ఇంకా మొహంలో నీరసం కనిపిస్తుంది అని కనకం అంటుంది. మందులు వేసుకుంటుంది కదా. పూర్తిగా నయం అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది. అబ్బా.. ఏం అభిమానం. కూతురేమో ప్రాణాలు పోయేదాకా తెచ్చింది. తల్లేమో కుశలం కనుక్కోడానికి వచ్చింది. ఈ కుటుంబం నటనకు ప్రసిద్ధి గాంచింది అని రుద్రాణి అంటుంది.

అవమానించడం కరెక్ట్ కాదు

రుద్రాణి నాకు ఆవేశం తెప్పించకు అని అపర్ణ అంటుంది. పర్లేదు వదినా అననీయండి. మీ ఇంట్లో పూజ చేస్తున్నారు. నేను రావడం వల్ల ఎలాంటి గొడవ రాకూడదు. నేనైనా.. మీరైనా విని ఊరుకుందాం అని కనకం అంటుంది. అవునులే, ఏమైనా సిగ్గా శరమా అని రుద్రాణి అంటుంది. ఏదైనా జరిగితే నాకు కళావతికి జరిగింది. మధ్యలో ఆవిడ ఏం చేశారు. ఇంటికొచ్చిన మనిషిని ఇలా మాట్లాడి అవమానించడం కరెక్ట్ కాదు అని రాజ్ అంటాడు.

మా అమ్మ పూజ అని అనకుంటే.. కొబ్బరికాయకు బదులు ఇంకోటి పగిలేది. చెత్తనోరు వేసుకుని మా అమ్మను అవమానిస్తే ఊరుకోను అని స్వప్న అంటుంది. ఎందుకొచ్చావమ్మా అని స్వప్న అంటుంది. వదినగారిని పలకరిద్దామని వచ్చాను. హాస్పిటల్‌లో ఉన్నప్పుడే వద్దామనుకున్నాను. కానీ, ఈలోపే ఏవేవో జరిగిపోయాయి. మీరు ఎవరిని పట్టించుకోకండి. భగవంతుడు అందరిని కాపాడుతాడు అని కనకం అంటుంది.

ఇదేంటీ మంచిగా నటించి మార్కులు కొట్టేద్దామనుకుంటుందా. కావ్యను ఇంటికి పంపిద్దామనికుంటుందా. ఛాన్సే లేదు. ఎలాగైనా కనకంను రెచ్చగొట్టాలి. చెబుతా అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. అయినా, ఏం మొహం పెట్టుకుని వచ్చావ్. మా వదినా ఎలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసి వచ్చావ్. చూశావా. ఇన్నిరోజులు రానిది ఇప్పుడెందుకు వచ్చింది. మీరంతా వెళ్లి కాపురానికి తీసుకొస్తారని చూసింది. ఎవరు రాకపోయేసరికి తనే వచ్చింది అని రుద్రాణి అంటుంది.

రమ్మన్న రాదు

సుభాష్ వారించినా రుద్రాణి ఊరుకోదు. రుద్రాణి సరిగానే మాట్లాడింది కదా. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడెందుకు వచ్చింది. ఆ కూతురుని, ఈ కూతురిని అత్తారింటికి పంపించాలనే కదా తన ప్లాన్ అని ధాన్యలక్ష్మీ వత్తాసు పలుకుతుంది. ధాన్యలక్ష్మీ నువ్ అపార్థం చేసుకుంటున్నావ్. నేను ఉద్దేశంతో రాలేదు. నా చిన్న కూతురు నువ్ రమ్మన్న రాదు. నా పెద్ద కూతురు పొమ్మన్న పోదు. ఇక కావ్య అంటారా తనను ఆ విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు అని కనకం అంటుంది.

అంటే, ఇంకా నీ కూతురుని మా రాజ్ తీసుకొస్తాడని అనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. ఆశ కాదు. నమ్మకం. అది ఇక్కడికి వచ్చాకే ఇంకా బలపడింది. నా కూతురు, అల్లుడికి మధ్య ఇంకా బంధం తెగిపోలేదు అనడానికి అల్లుడు పక్కన ఉన్న నా కూతురు చీరే సాక్ష్యం. ఇంకొకటి నా కూతురు తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది. అది ఎవరు ప్లాన్ చేస్తే జరిగింది. నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికి వచ్చాడు. అలాంటిది నా కూతురు రాదా అని కనకం అంటుంది.

విఘ్నాలన్ని తొలగించి కచ్చితంగా నా కూతురు కాపురాన్ని నిలబెడతాడు. వస్తాను అని అందరికీ చెప్పి వెళ్లిపోతుంది కనకం. నువ్ పదివేలు పెట్టి కొన్న విగ్రహం కావ్య చేసింది. మీది బ్రహ్మ వేసిన ముడి. అది ఎప్పటికీ విడిపోదు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు ఆ కావ్య నేరుగా మనతో పని చేయదు. అందుకే మాకు బినామీగా నటించి తను వేసిన డిజైన్స్ మాకు ఇవ్వాలి. తనకు చిన్న డౌట్ కూడా రాకూడదు అని అనామిక చెబుతుంది.

సంబరపడిన అనామిక

ఇంతలో కావ్య వచ్చినట్లు ప్యూన్ వచ్చినట్లు చెబుతాడు. మేనేజర్‌కు కాల్ చేసి మీరు మాట్లాడిందంతా మేము వింటాం అని అనామిక చెబుతుంది. తర్వాత కావ్యను సందీప్ పరిచయం చేస్తాడు. మీరు స్వరాజ్ గ్రూప్‌కు డిజైన్స్ చేశారు కదా. మీ గురించి విన్నాను. కానీ, మీకు స్వరాజ్ గ్రూప్ ఇచ్చినంత సాలరీ ఇవ్వలేను అని మేనేజర్ చెబుతాడు. దానికి సరేనని కావ్య ఒప్పుకుంటుంది. దాంతో అనామిక సంబరపడుతుంది. కావ్య వాళ్లు వెళ్లిపోతారు.

తర్వాత సాలరీ అంటూ ఓవరాక్షన్ చేశావ్. అలా ఎప్పటికీ చేయకు. తన భర్తకు వ్యతిరేకంగా పని చేస్తుందని కావ్యకు తెలిస్తే వెంటనే మానేస్తుంది. తను వేసే డిజైన్స్ మనకు చాలా అవసరం అని అనామిక అంటుంది. అదంతా నేను చూసుకుంటాను కదా. డోంట్ వర్రీ అని సామంత్ అంటాడు. మరోవైపు తనకు జాబ్ వచ్చినట్లు కావ్య ఇంట్లో చెబుతుంది. కృష్ణమూర్తి సంతోషిస్తాడు. కనకం మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. ఏమైందమ్మా అలా ఉన్నావని కావ్య అడుగుతుంది.

ఇష్టం లేనట్లుగా మాట్లాడుతుంది కనకం. నేను తప్పు చేసి పుట్టింటికి రాలేదని కావ్య అంటే.. పుట్టింటికి రావడమే తప్పు అని కనకం అంటుంది. మరి ఆరోజు పర్మిషన్ అడిగితే గుండెల్లో దాచుకుంటానని అన్నావ్ అని కావ్య అడుగుతుంది. అప్పుడు ఏ తల్లి అయినా అలాగే అంటుంది. నీపై కోపం ఉంటే ఆయన ఎందుకొస్తాడు. తన తల్లికోసం అయితే తల్లినే పంపిస్తాడు. తనెందుకు వస్తాడు కనకం అంటుంది. మగాడికి అహంకారం ఉంటుంది. ఆడదానికి ఆత్మాభిమానం ఉంటుంది. కానీ, వారిద్దరి మధ్య బంధం ఉంటుందని కనకం అంటుంది.

ఆశ్రయం కోరాను

వ్యక్తిత్వం చచ్చిపోయింది. ఇన్నాళ్లు మాటలు పడుతూ ఉంది నువ్ చెబితేనే ఉన్నానా. నా భర్తే నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడితే ఎవరికోసం ఉండాలి. అది నా ఇల్లు ఎలా అవుతుంది. అందుకే వచ్చాను. నేను మీకు బారంగా అనిపిస్తే.. ఏ వర్కింగ్ వుమెన్ హాస్టల్‌కు వెళ్తాను. పెళ్లైన తర్వాత పుట్టిళ్లు కూడా పరాయి ఇల్లే అవుతుంది. అందుకే అనుమతి అడిగి ఆశ్రయం కోరాను. కానీ, అమ్మ సమాజానికి భయపడి కూతురు వ్యక్తిత్వాన్ని చంపుకోమంటుంది అని కావ్య అంటుంది.

క్షణం పాటి క్షమించమని చెబుతున్నానే. బాధలోను, ఆవేశంలోనూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పుడు జాబ్ చేస్తానంటున్నావ్. అంటే స్వతంత్రంగా బతకాలని అనుకుంటున్నావ్. దాంతో అత్తింటి అవసరం రాదు. భర్తకు దూరమైపోతావ్. ఆ ఇంట్లో ఒకరిద్దరు తప్పా అందరూ నువ్ రావాలని కోరుకుంటున్నారు అని కనకం అంటుంది. అందరూ కాదమ్మ. ఆయన రావాలని కోరుకుంటాడనే నమ్మకం కూడా నాకు లేదు. అలాంటప్పుడు నా బతుకు నేను బతకడంలో తప్పు లేదు కదా అని కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు దుగ్గిరాల ఇంటికి సీతారామయ్య ఫ్రెండ్ వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నా మనవడు శ్రీకాంత్ తెలుసు కదా అని సీతారామయ్య ఫ్రెండ్ అంటాడు. ఎందుకు తెలియదు. మీరు ఎలా బిజినెస్ చేశారో. నేను శ్రీకాంత్ కలిసి బిజినెస్ చేస్తున్నాం కదా అని రాజ్ అంటాడు. కానీ, ఆ బిజినెస్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మీ ప్రత్యర్థ కంపెనీ అయినా సామంత్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చాడు అని అతను అంటాడు.

తక్కువైంది మర్యాద

అదేంట్రా 50 ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నాం. ఏం తక్కువైందని ఇచ్చాడు అని సీతారామయ్య అంటాడు. తక్కువైంది డబ్బు కాదు. మర్యాద. నా మనవడు మీ కంపెనీకి వస్తే రాహుల్ అవమానించి పంపించాడట అని సీతారామయ్య ఫ్రెండ్ అంటాడు.

తదుపరి వ్యాసం