Brahmamudi September 14th Episode: బ్రహ్మముడి- ఉద్యోగ వేటలో కావ్య- కోడలితో ముడిపడిన అపర్ణ ప్రాణం- నిజం చెప్పిన రుద్రాణి
14 September 2024, 7:28 IST
Brahmamudi Serial September 14th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ కోమా నుంచి కోలుకుంటుంది. కావ్య ఉద్యోగం కోసం బయటకు వెళ్తుంది. రాజ్, కావ్య బంధంపైనే అపర్ణ ప్రాణాలు ముడిపడి ఉన్నాయని ఇందిరాదేవి చెబుతుంది. ఇంటికి వచ్చిన అపర్ణ కావ్య గురించి రాజ్‌ను నిలదీస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో నీ కోపాలు, తాపులు, తప్పులు కావ్య ఎన్నోసార్లు భరించింది. ఈ ఒక్కసారి కావ్యను క్షమించలేవా. వెళ్లగొట్టిన నీ భార్యను తీసుకురారా అని రాజ్‌ను ఇందిరాదేవి అడుగుతుంది. నేనేమైనా వెళ్లగొట్టానా.. తన నిర్లక్ష్యానికి మా అమ్మ బలైపోయింది. అందుకు నేను తప్పు బట్టాను. తన తప్పుకు నన్ను బాధ్యుడిని చేసింది. అందుకు నేను విమర్శించాను. అంతేకానీ నా నోటితో నేను వెళ్లిపోమ్మని అనలేదు. కాబట్టి తిరిగి రమ్మని నేను వెళ్లి అడగను. తిరిగి రావాలని నేను ఎప్పటికీ ఎదురుచూడను కూడా అని రాజ్ అంటాడు.
అంటే, భార్యాభర్తల మధ్య తగాదాలే రావా.. మనస్పర్థలు రావా.. భర్తలపై కేసులు పెట్టినవారున్నారు. వాళ్లంతా కలిసి బతకట్లేదా.. ఇలాగే విడిపోతున్నారా.. అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లది వేరు నాది వేరు. మాది ముడిపడిన బంధం కాదు. బలవంతంగా ముడిపెట్టిన బంధం. ఈ పరిస్థితి తీసుకొచ్చిన దాన్ని నేను జీవితంలో క్షమించలేను. కాబట్టిన తనను నేను తీసుకురాను. తనంతట తాను వచ్చిన నేను ఊరుకోను అని రాజ్ చెప్పేసి వెళ్లిపోతాడు.
కామెడీ చేస్తున్నాను
మరుసటి రోజు ఉదయం పుట్టింటి వాకిట్లో కావ్య దిగాలుగా కూర్చుని ఆలోచిస్తుంది. అక్కడికి అప్పు వస్తుంది. కావ్యను హగ్ చేసుకుంటుంది. ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావ్. నువ్ ఏడవడం మొదటిసారి చూస్తున్నా. నీకు ఏడవడం సూట్ కాదు అని కావ్య అడుగుతుంది. నేను సీరియస్‌గా అడుగుతుంటే నీకు కామెడీగా ఉందా అని అప్పు అంటుంది. జీవితం ఒక నాటకరంగం. ఎవరికీ తోచిన పాత్ర వాళ్లు పోషిస్తుంటారని ఓ మహాకవి చెప్పారుగా. అందుకే నువ్ ఏడుస్తున్నావని కామెడీ పాత్ర చేస్తున్నాను అని కావ్య అంటుంది.
ఎప్పుడు ఎదుటివాళ్ల గురించేనా.. నీ గురించి ఆలోచించవా అని అప్పు అడుగుతుంది. ఎంత పరిగెత్తిన తిరిగి మొదలుపెట్టిన చోటుకే వస్తున్నప్పుడు పరుగెత్తి లాభం ఏంటీ.. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంటే ప్రశ్నించడం వృథా. అన్నింటికి ప్రయత్నించాను. కానీ, అలసిపోయాను అని కావ్య అంటుంది. ఇదంతా నావల్లే. మా పెళ్లి వల్లే జరిగిందని అప్పు అంటుంది. ఇందుకు కారణం ఎవరు కాదు. మా ఆయన ఆలోచన. పెళ్లికి ముందు ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోవచ్చు. కానీ, పెళ్లై కొన్నాళ్లు జీవించాక కూడా ప్రేమ లేకపోతే లాభం ఏంటీ అని కావ్య అంటుంది.
ఆయనకు నాపై ప్రేమే లేదు. ఆయన మనసులో నాకు చోటు లేనప్పుడు నేను అక్కడ ఉండి లాభమేంటీ. నేను చేసిన తప్పేంటీ.. నా ప్రేమలో లోపం ఏంటో తెలియడం లేదు. అందుకే నాకు నేనుగా శిక్ష వేసుకున్నాను. ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నా అని కావ్య అంటుంది. దాంతో మళ్లీ కావ్యను హగ్ చేసుకుంటుంది అప్పు. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు అపర్ణ దగ్గర సుభాష్ ఉంటాడు. నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్ ఇలా ఉండటంతో ఇంట్లో పరిస్థితులు మారాయి. కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది అని సుభాష్ అంటాడు.
మృత్యువునే జయించావ్
నువ్ తిరిగి మాములు మనిషి అయితేనే ఇంట్లో పరిస్థితులు చక్కపడతాయి. ఆరోజు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు అని సుభాష్ అంటాడు. ఇంతలో అపర్ణ కదిలినట్లు అనిపించి డాక్టర్‌ను పిలుస్తాడు సుభాష్. కట్ చేస్తే అపర్ణ చుట్టూ అంతా ఉంటారు. అపర్ణ కోమా నుంచి బయటకు వచ్చి కళ్లు తెరుస్తుంది. అందరిని చూస్తుంది. ఆ దేవుడే నిన్ను మాకు తిరిగి అప్పజెప్పాడు. నువ్ మృత్యువునే జయించావ్. నీకు ఇక ఎలాంటి కీడు జరగదు అని ఇందిరాదేవి అంటుంది. కావ్య కోసం చూస్తుంది అపర్ణ.
త్వరగా కోలుకుని ఇంటికి వచ్చేయ్ వదినా అని ప్రకాశం అంటే.. అపర్ణ డ్రామా ఆడుతుంది. ఈ బిస్కెట్లు ఎందుకులే ఆపు అని స్వప్న కౌంటర్ వేస్తుంది. నువ్ నాపై ఎంత కోప్పడినా నాకు స్వంత అక్కలాగే అనిపిస్తుంది అక్క. త్వరగా కోలుకుని ఇంటికి రా అని దాన్యలక్ష్మీ అంటుంది. రాజ్ సంతోషంగా ఉంటాడు. అపర్ణ అదోలా ఉండటంతో ఏంటీ మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. రాజ్.. కావ్య ఎక్కడ.. నా కోడలు ఎక్కడ అని అడుగుతుంది.
ఇంతలో నర్స్ వచ్చి.. ఇప్పుడేగా ఆమెకు స్పృహ వచ్చింది. ఇంతమంది ఉంటే ఎలా అని అందరినీ బయటకు పంపిస్తుంది. రాజ్ వెళ్లబోతుంటే చేయి పట్టుకుని ఆపి కావ్య ఏదిరా అని అడుగుతుంది. నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కుంటాను అని తప్పించుకుని వెళ్లిపోతాడు. ఆవిడను సేవ్ చేయగలిగాం. నా కష్టం ఎంతుందే మీ అదృష్టం కూడా ఉంది. మీ సంతోషం ఇలాగే కొనసాగాలంటే ఆవిడను చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అని డాక్టర్ అంటుంది.
షాకింగ్ న్యూస్ చెప్పకూడదు
బ్రెయిన్‌లో జరిగిన డ్యామెజ్‌ను సర్జరీ చేయకుండా మెడిసిన్ ద్వారా క్యూర్ చేయగలిగాం. కానీ, డ్యామేజ్ అయిన నరాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎప్పుడు ఆవిడ బీపీ నార్మల్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే షాకింగ్ న్యూస్‌లు ఏవి ఆమెతో చెప్పకూడదు. ఏదైనా జరిగితే మాత్రం మళ్లీ ఆవిడ కోమాలోకి వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత నేనే కాదు ఎవరు ఏమి చేయలేరు. జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ కచ్చితంగా టైమ్‌కు వేసుకోవాలి అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతుంది.
ఏం చేద్దాం అని రాజ్‌ను ఇందిరాదేవి అడిగితే.. చూసుకుందాం. అందరం ఉన్నాం కదా అని రాజ్ అంటాడు. మీ అమ్మ కావ్యను అడుగుతుంది. దాని మాటేంటీ. ఏం చెబుతావ్. ఇది నీ కాపురానికి సంబంధించి కాదు. మీ అమ్మ ప్రాణాలకు సంబంధించి కూడా. ఏం చేద్దాం అని ఇందిరాదేవి అంటుంది. నాకు తెలీదు నానమ్మ. నిజంగా నాకు తెలియదు అని వెళ్లిపోతాడు రాజ్. అపర్ణ వాళ్లిద్దరిని కలుపుతుందని ఆశ కలుగుతుందమ్మా అని సుభాష్ అంటాడు.
ఆ ఇద్దరు కలవకపోతే అపర్ణ బతుకుతుందన్న ఆశ వదులుకోవాలి సుభాష్ అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత స్వప్నకు కావ్య కాల్ చేసి అపర్ణ గురించి అడుగుతుంది. కోమాలోకి వచ్చిందని చెబుతుంది. దాంతో కావ్య సంతోషిస్తుంది. కోలుకుని ఇంటికి వచ్చి నీ గురించి తెలిస్తే ఒక్కొక్కరిని ఒక ఆట ఆడుకుటుందని స్వప్న అంటుంది. సరే అని కాల్ కట్ చేసిన కావ్య అపర్ణ గురించి తల్లిదండ్రులకు చెబుతుంది. కనకం సంతోషిస్తుంది.
నేనుగా బతకడం కోసం
నీ మీద పడ్డ నింద నిజం కాకుండా దేవుడు కాపాడాడు. ఆవిడకు ఏదైనా అయితే నిన్నే అనేవారు అని కనకం అంటుంది. చూడటానికి వెళ్తున్నావా అని కృష్ణమూర్తి అంటాడు. లేదు కాల్ చేసి తెలుసుకున్నాను. తృప్తిగా ఉన్నాను. ఆ విషయంలో నా డ్యూటీ అయిపోయింది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలి కదా నాన్న అని కనకం అంటుంది. ఈ తండ్రికి కూతురు బారం అవుతుందనుకున్నావా అమ్మా అని కృష్ణమూర్తి అంటాడు. లేదు నాన్న. ఈ ఉద్యోగం నాకోసం. నేను నేనుగా బతకడం కోసం. నా ఉనికిని నేను బతికించుకోవాలి అని కావ్య అంటుంది.
బొమ్మలకు రంగులు వేసిన కాలక్షేపం అవుతుందిగా అని కనకం అంటుంది. అది కాలక్షేపం కోసం చేస్తాననడం లేదు. తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంటుంది. వెళ్లని అని కృష్ణమూర్తి అంటాడు. కావ్య ఉద్యోగం కోసం వెళ్తుంది. అది ఉద్యోగం చేసుకుంటూ శాశ్వతంగా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావా. ఉద్యోగం ఉంటే ఆ ధైర్యమే వేరేగా ఉంటుంది. అప్పుడు అత్తిల్లు గుర్తు రాకపోతే. ఇక్కడే ఉండిపోతే. నువ్ ఎందుకు మాట్లాడలేదు. నన్ను మాట్లాడనివ్వలేదు అని కృష్ణమూర్తిని అడుగుతుంది కనకం.
కాలమే మాట్లాడుతుంది కనకం. కావ్య ఆ ఇంట్లో ఏడాది ఉండి వచ్చింది. జ్ఞాపకాలు అంత తొందరగా మాసిపోతాయా. కాలం వాటికి సమాధానం చెప్పాల్సింది. కావ్య అంటే కచ్చితంగా ఆ ఇంట్లో పూర్తిగా తెలిసే తీరుతుంది. అందాక ఓపిక పడుతుంది. అప్పటివరకు కావ్య తీసుకునే ఏ నిర్ణయాలకు అడ్డుచెప్పకు అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు అపర్ణను ఇంటికి తీసుకెళ్తారు. స్వప్న ఎదురొచ్చి హారతి ఇస్తుంది. పెద్ద గండం నుంచి బయటపడ్డారు కదా. మీ మీద పడ్డ చెడు దృష్టి మొత్తం పోయి తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలి అని స్వప్న అంటుంది.
నువ్వేం చేస్తున్నావ్
స్వప్న హారతి ఇస్తుంటే ఆగమ్మా అని అపర్ణ అంటుంది. ఎందుకు ఆపావ్. దిష్టి తీస్తే మంచిదే కదా అని ఇందిరాదేవి అంటుంది. మంచిదే. కానీ, ఇవన్ని నా కోడలే కదా చేసేది. తను రాకుండా స్వప్న వచ్చిందేంటీ. కావ్య ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. కట్ చేస్తే.. నేను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగింది. కావ్య ఇప్పటివరకు ఎందుకు రాలేదు. రాకపోతే నువ్వేం చేస్తున్నావు. ఎందుకు పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి అని అపర్ణ రాజ్‌ను కోపంగా అడుగుతుంది.
టాపిక్