Brahmamudi September 11th Episode: బ్రహ్మముడి- బయటపడిన రాజ్ అసలు మనసు- బలవంతంగా కావ్యతో కాపురం- పంతం నెగ్గిన రుద్రాణి
Brahmamudi Serial September 11th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 11వ తేది ఎపిసోడ్‌లో కావ్యను నిందిస్తూనే ఉంటాడు రాజ్. దానికి రుద్రాణి ఆజ్యం పోస్తుంది. కావ్యతో బలవంతంగా కాపురం చేసినట్లు, ఇంట్లో వాళ్లు చెప్పడంతోనే దగ్గరకు రానిచ్చినట్లు రాజ్ చెబుతాడు. దాంతో కావ్య గుండె ముక్కలైపోతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో నేను నిన్ను క్షమించను. నమ్మకం పోయింది. ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించను అని కావ్యను రాజ్ అంటాడు. ఏదైనా జరిగిదేకా ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా. ఇంత జరిగినా నీ భార్యగా ఉండనిస్తావా. ఇంకా ఎన్ని అనర్థాలు జరగాలి, ఎన్ని అరిష్టాలు రావాలి. చాలు, గెంటి పారేసేయ్ రాజ్ అని రుద్రాణి అంటుంది.
పోతే కోట్లు పోతాయ్
రుద్రాణి ఏం మాట్లాడుతున్నావ్. తప్పు ఒప్పో ఏదో జరిగింది. వాడు ఏదో ఆవేశంలో ఉంటే నువ్ వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావేంటీ అని సుభాష్ ఫైర్ అవుతాడు. రాజ్ పెద్ద పొరపాటే జరిగింది. కానీ, సర్దుకుపోవాలి. రుద్రాణి మాటలు పట్టుకుంటే ఇంట్లో ఏ ఒక్కరి కాపురం నిలబడదు రాజ్ అని ఇందిరాదేవి అంటుంది. అంత సింపుల్‌గా ఎలా క్షమించను. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది. పోతే కోట్లు పోతాయ్. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుండాలి అని రాజ్ అంటాడు.
ఇదే మొదటి తప్పు అనుకుని కావ్యను క్షమించరా అని ఇందిరాదేవి అంటుంది. నువ్వైనా జరిగినదానికి క్షమాపణ అడగొచ్చు కదా అని కావ్యను అంటుంది ఇందిరాదేవి. నేను ఎందుకు అడగాలి అమ్మమ్మ అని కావ్య అంటే.. అంతా షాక్ అవుతారు. క్షమించమని నేనేందుకు అడగాలి. నేనేం తప్పు చేశాను. తాళి కట్టిన నా భర్త చేయని తప్పుకు ఇంతమంది ముందు దోషిని చేస్తే నా ఆత్మాభిమానం దెబ్బతిన్న నా నిజాయితీని తప్పు బట్టినా.. జీవితంలో క్షమించను అని చెబుతున్నా తలవంచుకుని అడగాలా. ఎందుకు అడగాలి అని కావ్య అంటుంది.
నేను ఏ తప్పు చేయలేదు, నేరం చేయలేదు. కాపురానికి నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో అవమానాలు, మాటలు పడ్డాను, సమస్యలు ఎదుర్కున్నాను. అన్నింట్లో నన్నే దోషిని చేశారు. అయినా సర్దుకుపోయాను. అన్నింటిని సహించి నా కాపురాన్ని నిలబెట్టుకున్నాను. ఈరోజు ఈ ఇంటి గౌరవం కోసం, ఇంటికి ఆధారమైన కంపెనీకి పరువు పోతుందని, అది కూడా అత్తయ్య పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నేనేందుకు చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని క్షమించమనాలి అని కావ్య అంటుంది.
అహంకారం ఉండకూడదు
నేను ఎన్నటికీ క్షమాపణ అడగను. ఒకవేళ క్షమించమని నేను అడిగానంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లే. నా ప్రాణం పోయినా ఆ పని చేయను, చేయలేను అని కావ్య అంటుంది. చూశావా అమ్మా.. ఇది నీ మనవరాలి అసలు స్వరూపం. ఇన్నాళ్లకు బయటపడింది. ఇవాళ మీ పెద్దరికాన్ని కూడా పూచికపుల్లలా తీసిపడేసింది. ఇలాంటి ఆడదాన్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తారు అని రుద్రాణి అంటుంది. అవును, ఆడదానికి ఇంత అహంకారం ఉండకూడదు. పుట్టింట్లో తినడానికి దిక్కుండదు కానీ, ఇక్కడ తల ఎగిరేసుకుని మాట్లాడుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది.
అక్కడ మా వదిన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎంత పొగరుగా మాట్లాడుతుంది. ఏం జరిగినా ఇంట్లోంచి గెంటేయరనే ధీమా ప్రదర్శిస్తోంది. తప్పే చేయలేదంటా.. ఇవాళ ఇది చేసింది. రేపు ఇంకోటి చేస్తుంది. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఇలాంటి ఆడది దుగ్గిరాల ఇంటి కోడలిగా పనికివస్తుందా. ఇప్పుడే ఈ క్షణమే నేను బయటకు గెంటేస్తాను అని చేయి పట్టుకుంటుంది రుద్రాణి. హేయ్.. నన్ను బయటకు వెళ్లమనడానికి నువ్వేవరు, నీకేం హక్కుంది. నీలాగే అందరూ మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉండాలా అని కావ్య అంటుంది.
ఇంతమంది పెద్దలు ఉన్నారు. అంతా వింటున్నారు. ఈ తల్లీ కొడుకులు ఎన్ని తప్పులు, పాపాలు చేశారు. ఎన్ని మోసాలు చేశారు. ఇలాంటి విశ్వాసం లేని మనుషులు నన్ను గెంటేస్తాను అంటే.. అంతా ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడతారా, ఎవరు ఏం అడగరు అని కావ్య నిలదీస్తుంది. అడగరు.. సిగ్గు లేకుండా అందరిని న్యాయం అడుగుతున్నావా. మర్యాదగా బయటకు నడువు అని రుద్రాణి అంటుంది. ఆ మాట మీరు చెప్పకూడదు. నా భర్త చెప్పాలి అని కావ్య అంటుంది.
భార్యగా ఉండాలా
నేను తప్పు చేశానని ఆయన నమ్మితే.. అదే న్యాయం అనుకుంటే.. అప్పుడు ఆలోచిస్తాను. ఏవండి వెళ్లిపోమంటారా అని కావ్య అడుగుతుంది. రాజ్ విన్నావా. నువ్ పొమ్మంటే కనీసం బతిమిలాడుకోవాలని కూడా లేదు. ఆలోచిస్తుందట. మీ అమ్మను చావుబతుకుల్లో పడుకోబెట్టి కూడా తప్పు చేయలేదని వాదిస్తుంది. క్షమాపణ కూడా చెప్పట్లేదు. ఇలాంటిది నీకు భార్యగా ఉండాలా. ఇంకా ఇంట్లో ఉండటం అవసరమా అని రుద్రాణి అంటుంది.
వాళ్ల మధ్య దూరి ఓవరాక్షన్ చేస్తున్నావేంటీ.. ఇన్నాళ్లు లేనిది అపర్ణ ఆంటీపై ప్రేమ పొంగిపోయినట్లు మాట్లాడుతున్నావ్ అని స్వప్న అంటుంది. రాజ్ చాలు కావ్య తప్పు చేసే మనిషి కాదు అని సుభాష్ అంటాడు. మావయ్య గారు మీరు ఉండండి.. ఇంట్లోంచి వెళ్లిపోమంటారా మీరు చెప్పండి అని కావ్య అంటుంది. అసలు ఏమనుకుంటున్నావ్ నువ్. నువ్ ఏ తప్పు చేయలేదా. క్షమాపణ అడగలేవా. ఇప్పుడు చెబుతున్నాను. నువ్ నా భార్యగా ఉండటానికే పనికిరావు. ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు అని రాజ్ అంటాడు.
నేను నిన్ను కోరుకుని పెళ్లి చేసుకోలేదు. దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడతావని తాతయ్య వాళ్లు అంటే.. ఇష్టం లేకపోయినా తాళి కట్టాను. తాళి కట్టాను కాబట్టి, భరించాను కాబట్టి ఇంట్లో ఉండనిచ్చాను. మా అమ్మ చెప్పడం వల్ల బలవంతంగా నీతో కాపురం చేశాను. ఇంత చేస్తే ఇవాళ నువ్ చాలా పెద్ద తప్పు చేసికూడా అహకారంగా మాట్లాడతావా. ఇంటికి అనర్థం తెచ్చిందే నువ్వు. మా అమ్మ ప్రాణం పోయే పరిస్థితి తెచ్చిందే నువ్వు. ఈ జీవితంలో నిన్ను క్షమించను. గుర్తు పెట్టుకో అని రాజ్ అంటాడు.
ఇదంతా నాకు తెలియదండీ
ఏమన్నారు.. ఇష్టం లేకపోయినా తాళి కట్టారా. పెద్దవాళ్ల మాట కోసం నాతో బలవంతంగా కాపురం చేశారా.. ఛ.. నేను ఇవన్ని విని కూడా ప్రాణాలతో ఎలా ఉన్నాను. మీరు మంచివారు అనుకున్నాను. మంచి మనసుతో నన్ను ఆదరించారు అనుకున్నాను. నా మనసు తెలుసుకుని మీ మనసు మార్చుకుని ఇష్టంతో నాతో కాపురం చేస్తున్నారు అని సంతోషపడ్డాను. ఇన్నాళ్ల నా ఎదురుచూపులు ఫలించాయని ఎంతో సంబరపడ్డాను. నా కాపురం నిలబడినట్లే అని పొంగిపోయాను. కానీ, ఇదంతా నాకు తెలియదండి అని కావ్య అంటుంది.
అసలు మీ మనసులో నాకంటూ ఓ స్థానం లేదని తెలుసుకోలేకపోయాను. పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని. నా భర్త నన్ను భార్యగా ఒప్పుకుని నాతో కాపురం చేస్తున్నారు అనుకున్నాను కానీ, ఇలా అయిష్టంగా, బలవంతంగా నాతో.. ఛీ.. నామీదే నాకు అసహ్యం వేస్తున్నాను. ఇప్పటిదాకా నేనంటే ప్రేమే లేని మనిషి ముందు నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటున్నాను అని గమనించలేకపోయాను. అలా అయితే, నేను అత్తగారింట్లో అక్కరకు లేని చుట్టంలా ఉన్నాను అన్నమాట అని కావ్య అంటుంది.
శతకోటి వందనాలు
భర్త మనసులో చోటు కోసం వెతుకున్నాను అన్నమాట. ఎవరి కోసమో నన్ను ఇంట్లో ఉండనిచ్చి.. నాకు అన్నం పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు మహాప్రభో. మీ మనసులో చోటు కోసం పిచ్చిగత్తేలా జీవితాంతం ఎదురుచూడలేను. నా అస్థిత్వం లేదు. నా ఉనికి లేదు. ఇంకా ఎందుకు ఈ ఇంట్లో నేను ఉండాలి అని కావ్య అంటుంది. అమ్మా కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య ఇంట్లోంచి వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్ ప్లాన్ సక్సెస్ అవుతుంది.