Brahmamudi September 9th Episode: కోమాలోకి వెళ్లిన అపర్ణ- కావ్యపై విరుచుకుపడిన రాజ్- ఇంట్లోంచి గెంటేయమన్న రుద్రాణి
Brahmamudi Serial September 9th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్‌లో రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్న అపర్ణ కుప్పకూలిపోతుంది. రాజ్ వాళ్లు వచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అపర్ణ కోమాలోకి వెళ్లిందని, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని డాక్టర్ చెబుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అపర్ణ భోజనం చేసి టీవీ చూస్తుంటుంది. మరోవైపు ఆఫీస్‌లోని స్టోరేజ్ రూమ్ అతని దగ్గరికి వెళ్తుంది. మీరేనా నాకు కాల్ చేసింది అని కావ్య అడుగుతుంది. లేదని, నేను ఎలా డైరెక్ట్ మీకు కాల్ చేయగలను అని అతను అంటాడు. ఇవాళ ఏదో ఫ్రాడ్ జరుగుతుందట కదా, దొంగ బంగారం కొనడానికి అగ్రిమెంట్ కోసం ఎవరో వస్తున్నారట కదా అని కావ్య అడుగుతుంది.
అలాంటిదేం లేదని అతను అంటాడు. రాహుల్ ఆఫీస్‌కు వచ్చాడా అని కావ్య అడుగుతుంది. లేదు, ఇవాళ రానన్నారు అని మేనేజర్ చెప్పాడని అతను అంటాడు. మరోవైపు రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్‌ను అపర్ణ వేసుకుంటుంది. తనకు కాల్ వచ్చిన నెంబర్‌కు కావ్య కాల్ చేసి చూస్తుంది. కానీ, అది పనిచేయదు. అది ప్రాంక్ కాల్ అనుకుంటా అని స్టోర్ మేనేజర్ అంటాడు. దాంతో ఆలోచించిన కావ్య పక్కనే ఉన్న ఫైల్స్ చెక్ చేస్తుంది.
నిల్చోలేకపోతున్నాను
ఒకసారి నాతో రండి. ఆఫీస్‌లో చెక్ చేద్దాం అని మొబైల్ అక్కడే పెట్టి అతన్ని తీసుకెళ్తుంది కావ్య. మరోవైపు అపర్ణకు అస్వస్థతగా ఉంటుంది. కిందపడిపోతుంది. అతి కష్టంగా కావ్యకు కాల్ చేస్తుంది. కానీ, కావ్య లిఫ్ట్ చేయదు. రాజ్‌కు కాల్ చేస్తుంది అపర్ణ. అమ్మ కాల్ చేస్తుందేంటీ అని కాల్ లిఫ్ట్ చేస్తాడు రాజ్. నాకు ఏదోలా అయిపోతుంది. నిల్చోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. త్వరగా రండి అని అపర్ణ చెబుతుంటే.. ఏమైందని రాజ్ కంగారుపడతాడు.
రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. అపర్ణ నీకు కాల్ చేయడం ఏంటీ. కావ్య ఉందిగా అని ఇందిరాదేవి అంటుంది. ఏమో తెలియదు. చూస్తుంటే అమ్మకు బీపీ ఎక్కువైనట్లుంది అని రాజ్ అంటాడు. రాహుల్, రుద్రాణి దొంగప్రేమ నటిస్తారు. నువ్ నోరు మూసుకో, భయపడకు అంటూనే ఇంకా భయపెడుతున్నావ్ అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. దాంతో అంతా ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు కల్యాణ్ తనకోసం ధాన్యలక్ష్మీ అన్నదానం చేయడంతో సంతోషంగా ఉంటాడు కల్యాణ్.
నీవల్లే గుడికి వెళ్లాం అని అప్పుకు థ్యాంక్స్ చెబుతాడు. మరోవైపు అంతా పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. అపర్ణ పడిపోయి ఉంటుంది. అంతా ఏమైందని కంగారుపడతారు. మమ్మీ ప్లాన్ సక్సెస్ అని రాహుల్ సంతోషంగా అంటాడు.. సక్సెస్ అయిందో తెలియాలంటే వదినా చచ్చిందో లేదో తెలియాలి కదా అని రుద్రాణి అంటుంది. కారులో అపర్ణను తీసుకెళ్తుంటారు. అప్పుడే ఇంటికి వస్తున్న కావ్య అది చూసి కారును ఫాలో అవుతుంది.
కోప్పడిన రాజ్
అపర్ణకు హాస్పిటల్‌లో చెక్ చేస్తుంటారు. ఏం కాదని రాజ్‌కు సుభాష్ ధైర్యం చెబుతాడు. అంతా బాగానే ఉందిగా, ధైర్యంగా ఉందిగా.. ఇంతలోనే ఇలా ఎందుకు సీరియస్ అయిందని ఇందిరాదేవి అంటుంది. వదినకు ఇంత ప్రమాదంగా ఉంటే.. కావ్య ఎందుకు పక్కన లేదు. అసలు ఎక్కడికి వెళ్లింది అని ప్రకాశం అంటాడు. ఇంతలో వచ్చిన కావ్య.. అక్క ఏమైంది. అత్తయ్యకు ఏమైందని అడుగుతుంది. ఏయ్.. ఎక్కడికి వెళ్లావ్, ఎక్కడికి వెళ్లావ్ అని కోప్పడతాడు రాజ్.
కారణాలు ఏవైనా తర్వాత మాట్లాడుకుందాం. కావ్య అంత బాధ్యత లేని మనిషి కాదు అని సుభాష్ అడ్డుపడతాడు. బాధ్యత.. అసలు అది తెలిసిన మనిషా తను. అనారోగ్యంతో ఉన్న మనిషిని అలా వదిలేసి వెళ్తుందా. మా అమ్మ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా. మా అమ్మకు ఏమైనా జరగాలి. చంపెస్తాను నిన్ను అని రాజ్ కోపంగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది, సక్సెస్ అవుతుంది అని రుద్రాణి సంతోషిస్తుంది.
బయటకు వచ్చిన డాక్టర్‌ను ఎలా ఉందని అడుగుతారు. ఆవిడకు సడెన్‌గా బీపీ పెరిగింది. దానివల్ల మెడ నరాలపై ఎఫెక్ట్ పడి సన్నటి క్లాట్ ఏర్పడింది. అందువల్ల కోమాలోకి వెళ్లిపోయింది అని డాక్టర్ చెబుతుంది. దాంతో అంతా షాక్ అయితే.. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ప్రాణాలకు ప్రమాదం ఏం లేదుగా అని సుభాష్ అడిగితే.. చెప్పలేం. మేమిచ్చే మెడిసిన్‌కు రెస్పాండ్ అయితే తప్పా ఏం చేయలేం అని డాక్టర్ అంటుంది.
ఒకరిద్దరు మాత్రమే
ఏంటీ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం అన్నారా అని డాక్టర్‌పై కోప్పడతాడు రాజ్. ఏం మాట్లాడుతున్నారు.. ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుందా.. పొద్దున బాగానే ఉందిగా. అందరితో మంచిగా మాట్లాడుతుందిగా. ఎక్కువైతో బతకదని మీరు ఎలా అంటారు.. మీరే బతకించాలి అని రాజ్ కోప్పడతాడు. ఏం కాదని సుభాష్ ఆపుతాడు. ఐసీయూ ముందు ఇంతమంది ఉంటే మాకు, మిగతా పేషంట్స్‌కు ఇబ్బందిగా ఉంటుంది. ఒకరిద్దరు మాత్రమే ఉండండి అని డాక్టర్ చెబుతుంది.
మా కోడలిని వదిలి ఎలా ఉండగలం అని ఇందిరాదేవి అంటుంది. ఉండి ఏం చేస్తావ్. ప్రాణం పోస్తావా.. పోయే ప్రాణం నిలబెడతావా, అందరూ వెళ్లిపోండి.. డాక్టరే చేతులు ఎత్తేసింది అని రాజ్ ఆవేశంగా అంటాడు. మీకు చెప్పే ఓపిక నాకు లేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. బతికించండి. లేదంటే అని డాక్టర్‌పైకి వెళ్తాడు రాజ్. దాంతో సుభాష్ అడ్డుకుని డాక్టర్‌ను పంపిస్తాడు. నువ్ నా ఎదురుగా ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పో ఇక్కడి నుంచి అని కావ్యపై అరుస్తాడు రాజ్.
కావ్య ఏదో చెబుతుంటే.. అడ్డుకున్న సుభాష్.. మేమిద్దరం ఉంటాం అని అంటాడు. ఏంటో మేము అక్కడ నిలకడగా ఎలా ఉంటాం. కానీ, రాజ్ ఊరుకునేలా లేడు అని రుద్రాణి దొంగ ప్రేమ నటిస్తుంది. నేను ఆయనతో ఇక్కడే ఉంటాను అని ఇందిరాదేవితో కావ్య అంటుంది. కానీ, ఇందిరాదేవి, స్వప్న నచ్చజెప్పి కావ్యను తీసుకెళ్లిపోతారు. కావ్య ఏడుస్తూ రాజ్‌ను చూస్తూ వెళ్లిపోతుంది. అది వాళ్లిద్దరు విడిపోయినట్లుగా చూపిస్తారు.
పిచ్చోడిలా రాజ్ మాటలు
మరోవైపు కల్యాణ్‌కు విషయం తెలిసి హాస్పిటల్‌కు వెళ్తాడు. అప్పును ఇంట్లోనే ఉండమంటాడు. పెద్దమ్మకు ఏమైందని కల్యాణ్ అడిగితే.. తెలీదురా.. కోమాలో ఉందంటున్నారు.. ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం అంటున్నారు అని సుభాష్ చెప్పడంతో కల్యాణ్ షాక్ అవుతాడు. అలా ఏం కాదని నచ్చజెపుతాడు కల్యాణ్. రాజ్ భుజంపై చేయి వేస్తాడు కల్యాణ్. ఏంటీ అమ్మకు ఏమైనా అవుతుందా అని భయపడుతున్నావా. ఏం కాదురా పిచ్చోడా. మా అమ్మ లేచి కూర్చుంటుంది. చూస్తూ ఉండు అని రాజ్ అంటాడు.
అరేయ్ ఎవరినీ నమ్మకూడదు. ఈ డాక్టర్స్‌ను కట్టుకున్న భార్యను కూడా నమ్ముకోకూడదు. అంతా మాటలు చెబుతారు అంతే.. కానీ, లోపలికి రానివ్వడం లేదురా. వెళ్లి పిలిస్తే.. మా అమ్మ లేస్తుంది. కానీ, వాళ్లు పట్టించుకోవట్లేదు అని రాజ్ ఏదోదో పిచ్చోడిలా వాగుతాడు. సుభాష్ ఆపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తర్వాతి ఎపిసోడ్‌లో ఆఫీస్‌కు వెళ్లడానికి కావ్య కారణం చెబుతుంది. కంపెనీ పరువు పోతుందని వెళ్లాను అని కావ్య అంటుంది. మై ఫూట్.. ఎంత నష్టం జరిగితే నీకేందుకు.. ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించను అని రాజ్ అంటాడు. ఏదైనా జరిగేదాకా ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనిస్తావా. గెంటి పడేసేయ్ రాజ్ అని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. కావ్య షాక్ అయి చూస్తుంది.