Brahmamudi September 6th Episode: బ్రహ్మముడి- కావ్యపై హత్యాప్రయత్నం- చనిపోయిన అపర్ణ- పగ సాధించేసిన రాహుల్ రుద్రాణి-brahmamudi serial september 6th episode rahul rudrani evil intent aparna dead and blamed kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 6th Episode: బ్రహ్మముడి- కావ్యపై హత్యాప్రయత్నం- చనిపోయిన అపర్ణ- పగ సాధించేసిన రాహుల్ రుద్రాణి

Brahmamudi September 6th Episode: బ్రహ్మముడి- కావ్యపై హత్యాప్రయత్నం- చనిపోయిన అపర్ణ- పగ సాధించేసిన రాహుల్ రుద్రాణి

Sanjiv Kumar HT Telugu
Sep 06, 2024 07:45 AM IST

Brahmamudi Serial September 6th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ బర్త్ డే సందర్భంగా దుగ్గిరాల ఇంట్లో వాళ్లంతా గుడికి వెళ్తారు. అపర్ణ చనిపోడానికి రాహుల్, రుద్రాణి ప్లాన్ వేస్తారు. ట్యాబ్లెట్స్ మార్చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 6వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు పేపర్స్, పెన్స్ బర్త్ డే గిఫ్ట్ కింద ఇస్తుంది అప్పు. కల్యాణ్‌కు మెసేజ్ వస్తుంది. ఆ ఇంట్లో నా బర్త్ డే అంతా మర్చిపోయారు అనుకున్నా.. కానీ, వదినా గుర్తు పెట్టుకుంది అని కల్యాణ్ ఫీల్ అవుతూ చెబుతాడు. విష్ చేస్తే సంతోష పడకా ఫీల్ అవుతావేంటీ అని అప్పు అంటుంది.

నా పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవాళ్లు.. ఇంట్లో చిన్నవాడిని అయినందుకు ఎంతో హడావిడి చేసేవారు.. అని కల్యాణ్ చెబుతాడు. దాంతో మనం కూడా గుడికి వెళ్దాం అని అప్పు అంటుంది. నువ్ కూడా గుడికి వస్తావా అని కల్యాణ్ అంటే.. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు.. అలాగే భర్త పిలిస్తే వెళ్లాలి కదా అని అప్పు అంటుంది. తర్వాత కల్యాణ్ కేక్ కట్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం అంతా సంతోషంగా ఉన్నారు అని ధాన్యలక్ష్మీ సెటైర్లు వేస్తుంది ధాన్యలక్ష్మీ.

బర్త్ డే ఏర్పాట్లు

నా కొడుకు బయటకు పోగానే వాడిని మర్చిపోయారు. వాడి పుట్టిన రోజు ఎవరికీ గుర్తు లేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని ధాన్యలక్ష్మీ అంటే.. ఇందిరాదేవి పిలిచి కూర్చోబెట్టుకుని ఒంటికాలి తిన్నడు కథ చెబుతుంది. ఈ కథ నాకెందుకు చెప్పారు అని ధాన్యలక్ష్మీ అంటే.. నిన్న రాత్రి నుంచి రాజ్ వాడి బర్త్ డే ఏర్పాట్లు చేశాడు అని అపర్ణ చెబుతుంది. అవును పిన్ని వాడిపేరు గుళ్లో అభిషేకం చేయించి.. అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశానని రాజ్ చెబుతాడు.

వరలక్ష్మీ వ్రతం నుంచి వాడు వెళ్లిపోయాడని నువ్ కోపంగా ఉంటావని నీకు చెప్పలేదు అని రాజ్ అంటాడు. అన్నదానం ధాన్యలక్ష్మీ చేతులతో చేపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. అంతా వెళ్దాం అని ఇందిరాదేవి అంటే.. నేను రాలేను. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నేను ఇక్కడే ఉంటాను అని అపర్ణ చెబుతుంది. అంతా ఉంటామని అంటుంటే.. కావ్య నేను ఉంటానని చెబుతుంది. కావ్య ఉంటే ఏ టెన్షన్ ఉండదని ఇందిరాదేవి అంటుంది.

మా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని రాజ్ అంటే.. మీ అమ్మను మా అమ్మలా చూసుకుంటాను అని కావ్య చెబుతుంది. దీంతో రుద్రాణికి పక్కకు తీసుకెళ్తాడు రాహుల్. ఏంటీ నువ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశావా అని రుద్రాణి అంటే.. లేదు షాకిద్దామని, ఫ్యామిలీ అంతటికీ అని రాహుల్ అంటాడు. ఇప్పుడు అంతా గుడికి వెళ్తారు. అపర్ణ అత్త ఒక్కతే ఉంటుంది. తనకు జరగరానిది ఏమైనా జరిగిదే అది కావ్య మెడకు చుట్టుకుంటుంది. అపర్ణ అత్తయ్య చచ్చిపోతే అని రాహుల్ అంటాడు.

ట్యాబ్లెట్స్ మార్చు

ఏం మాట్లాడుతున్నావురా నువ్వు. వదినను చంపడం ఏంట్రా అని రుద్రాణి అంటుంది. అపర్ణ అత్త చనిపోతే కావ్యను రాజ్ ఎప్పటికీ క్షమించడు. ఇద్దరు విడిపోతారు. ఏంటీ మామ్ కొత్తగా మీ వదినపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని రాహుల్ అంటాడు. నువ్ అరెస్ట్ అయితే పర్లేదు అనుకున్న మనిషి గురించి నేనేందుకు ఆలోచిస్తాను. కానీ, మనం ఏం ఇరుక్కోం కదా అని ఆలోచిస్తున్నాను అని రుద్రాణి అంటుంది. అలా ఏం జరగదు. తప్పకుండా కావ్య ఇరుక్కుంటుంది. అపర్ణ వేసుకునే ట్యాబ్లెట్స్‌లో ఇవి మార్చు అని రాహుల్ ఇస్తాడు.

నార్మల్‌గా హార్ట్ ఎటాక్ పేషంట్స్‌కి బీపీ రాకుండా ట్యాబ్లెట్స్ ఇస్తారు. కానీ, ఈ ట్యాబ్లెట్స్ వల్ల బీపీ ఎక్కువ అవుతుంది. మళ్లీ హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ సమయంలో కావ్య పక్కన ఉండకుండా నేను ఏర్పాట్లు చేశాను అని రాహుల్ అంటాడు. ఈ ప్లాన్ అదిరిపోయిందిరా. ఈ దెబ్బతో వదినా పైకి వెళ్లిపోవడం ఖాయం.. కావ్య బయటకు వెళ్లడం ఖాయం అని రుద్రాణి అంటుంది. అంతేకాదు తల్లి చనిపోయిందని రాజ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. కంపెనీ మనచేతికి వస్తుంది అని రాహుల్ చెబుతాడు.

తర్వాత అపర్ణ ట్యాబ్లెట్స్ గుర్తు పెట్టుకోవడంపై కావ్యపై సెటైర్లు వేస్తాడు రాజ్. ఏం అవసరం ఉన్న నాకే కాల్ చేయమని రాజ్ చెబుతాడు. మరోవైపు రుద్రాణి అపర్ణ ట్యాబ్లెట్స్ సీసాలో రాహుల్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ పెట్టి మార్చేస్తుంది. అందరూ ప్రశాంతంగా వెళ్లిరండి.. నా గురించి ఆలోచించకండి అని అపర్ణ అంటుంది. వదినా ఆరోగ్యం జాగ్రత్తగా.. నేనే ఉందామనుకున్నా.. కానీ నీ ముద్దుల కోడలు ఉంటాననేసరికి మీరు మీరు ఒకటి అని ఊరుకున్న అని రుద్రాణి అంటుంది.

కిరిటాలు పెట్టరు

నేనేం ఐసీయూలో బెడ్‌ మీద లేను నువ్ అంత కుమిలిపోడానికి అని అపర్ణ అంటుంది. మేము వచ్చేసరికి ఐసీయూ బెడ్ మీద కాదు ఏకంగా చనిపోయి ఉంటావ్ అని రుద్రాణి అనుకుంటుంది. తర్వాత అంతా వెళ్లిపోతారు. మీకోసం టిఫిన్ చేస్తాను కావ్య అంటే.. నీకోసం వద్దా.. ఇకనుంచి నీ గురించి ముందు చూసుకో. నువ్ ఎంత చాకిరి చేసిన ఇక్కడ నీకు కిరిటాలు పెట్టరు అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య నవ్వుతుంది.

మరోవైపు గుడిలో దర్శనం చేసుకుంటారు కల్యాణ్, అప్పు. మెట్లపై కూర్చుని ప్రసాదం తింటుంటారు. పోయినసారి గుళ్లో అన్నదానం చేశారు అని కల్యాణ్ అంటే.. ఇప్పుడు మనం కూడా చేద్దామా. మనం అన్నదానంలో కూర్చుని తినే పరిస్థితులో ఉన్నామని అప్పు అంటుంది. అది కాదు నా బర్త్ డేను అంతా మర్చిపోయారు అని కల్యాణ్ అంటే.. రాజ్ వాళ్లను చూపిస్తుంది అప్పు. ఎవరు మర్చిపోలేదు అని అప్పు అంటుంది. దాంతో కల్యాణ్ ఎమోషనల్ అవుతాడు.

ఇప్పుడు వాళ్లు మనల్ని చూస్తే నేను నిన్ను దూరం చేశాను అని గొడవ పెట్టుకుంటారు. పదా అని అప్పు తీసుకెళ్తుంటే.. రాహుల్ వాళ్లను చూస్తాడు. రుద్రాణిని పక్కకు తీసుకెళ్లి అప్పు వాళ్లను చూపిస్తాడు రాహుల్. ఇప్పుడు వాళ్లను చిన్నత్త చూస్తే ఎమోషనల్ అయి వాళ్లను రానిస్తుందేమో అని రాహుల్ అంటాడు. వాళ్లే కనపడకుండా దూరంగా ఉన్నారు. ముందు అనుకున్న ప్లాన్ జరగాలంటే ఇక్కడ ఏ గొడవ జరగకూడదు అని రుద్రాణి అంటుంది.

సిమ్ విరిచేసేయ్

సరే నువ్వెళ్లు.. నేను ఏర్పాటు చేసింది మళ్లీ చూస్తాను అని రాహుల్ అంటాడు. ఒకరికి కాల్ చేసి.. నావల్ల కంపెనీలో పెద్ద ఫ్రాడ్ జరగబోతోందని నమ్మించు అన ప్లాన్ వివరిస్తాడు రాహుల్. మీరు చెప్పారని చేస్తున్నాను. నాకేం ప్రాబ్లమ్ రాదుగా అని అతను అంటాడు. లేదు. ఫేక్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావ్ కదా. కాల్ చేశాక సిమ్ విరిచేసేయ్ అని రాహుల్ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు తాను వంట చేస్తానని అపర్ణ అంటుంది. మీరు వంట చేయడం ఏంటీ. మీరు రెస్ట్ తీసుకోండి అని కావ్య చెబుతుంది.

ఎంతసేపు ఉండాలి. బోర్ కొడుతుంది అని అపర్ణ అంటుంది. కానీ, కావ్య వినదు. దాంతో కత్తితో కావ్యను బెదిరిస్తుంది అపర్ణ. కట్నం కోసం వేధించే అత్తలను చూశాను. కానీ, రెస్ట్ తీసుకోండని చెప్పిన కోడలిపై హత్యా ప్రయత్నాన్ని ఇప్పుడే చూస్తున్నాను అని కావ్య అంటుంది. దాంతో షాక్ అయిన అపర్ణ ఇది చాకా.. నేను అట్లకాడ అనుకున్నానే అని అది తీసుకుంటుంది అపర్ణ. ఒప్పుకోకపోతే వీపు వాయగొట్టేలా ఉన్నారే అని కావ్య అంటుంది.

మరోవైపు కల్యాణ్ పేరుపై అర్చన చేపిస్తారు. అది చూసి కల్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో వచ్చిన సీతారామయ్యతో బావ వెళ్లిన పని అయిందా అని ఇందిరాదేవి అడుగుతుంది. అయిపోయిందని సీతారామయ్య అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్‌ను అపర్ణ వేసుకుంటుంది.

కావ్యకు షాక్

మరోవైపు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని, చెక్ చేయాలని ఆఫీస్‌లో కావ్య రాహుల్ కాల్ మాట్లాడిన వ్యక్తితో ఉండిపోతుంది. అటువైపు కావ్యకు బీపీ ఎక్కువై తూలిపడుతుంది. కావ్యకు కాల్ చేసిన కావ్య చూసుకోదు. కట్ చేస్తే అపర్ణ స్పృహ తప్పిపడిపోతుంది. రాజ్ వాళ్లు వచ్చి లేపుతుంటారు. కానీ, అపర్ణ లేవదు. అదంతా చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ షాక్ అవుతుంది. అపర్ణ చనిపోయినట్లు చూపించారు.