Brahmamudi September 3rd Episode: బ్రహ్మముడి- రాహుల్ అరెస్ట్- చెంపచెల్లుమనిపించిన అపర్ణ- కావ్యకు దిమ్మదిరిగే ట్విస్ట్-brahmamudi serial september 3rd episode aparna berates rahul rudrani mind block twist to kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 3rd Episode: బ్రహ్మముడి- రాహుల్ అరెస్ట్- చెంపచెల్లుమనిపించిన అపర్ణ- కావ్యకు దిమ్మదిరిగే ట్విస్ట్

Brahmamudi September 3rd Episode: బ్రహ్మముడి- రాహుల్ అరెస్ట్- చెంపచెల్లుమనిపించిన అపర్ణ- కావ్యకు దిమ్మదిరిగే ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu
Sep 03, 2024 07:52 AM IST

Brahmamudi Serial September 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ నేరం చేసినట్లు కావ్య ఫైల్స్ తీసుకొచ్చి ఇస్తుంది. దాంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. రాహుల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. కానీ, తర్వాత కావ్యకు దిమ్మ దిరిగే షాక్ ఎదురవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో పోలీసులకు కోపరేట్ చేస్తానని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అనుకున్నది సక్సెస్ అయిందని రుద్రాణి, రాహుల్ చూసుకుంటారు. నువ్వేతప్పు చేయలేదని ఇక్కడ అందరికీ తెలుసు. నీ పద్ధతిలో రాహుల్‌ను అడిగితే నిజం చెబుతాడు. ఇలాంటి బుద్ధులు రాహుల్‌కే ఉన్నాయి. నా కొడుకు నేరం చేయడం తన రక్తంలోనే లేదు అని అపర్ణ అంటుంది.

క్షమించాలమ్మా. ఏం జరిగిందో కానీ కంపెనీ ఛైర్మన్‌ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. దీని గురించి కోర్టులో తేల్చుకోండని పోలీసులు అంటారు. మా లీగల్ అడ్వైజర్‌తో మాట్లాడండి అని సుభాష్ అంటే.. లేదు సార్. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్. కోర్టులోనే తేల్చుకోవాలి అని ఎస్సై అంటాడు. ఇట్స్ ఓకే. నేనేం తప్పు చేయలేదు. కోర్టులోనే రుజువు అవుతుంది అని రాజ్ అంటాడు. ఇంకా ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నావ్ రాజ్ అని రుద్రాణి అంటుంది.

స్మగ్లర్లతో డీలింగ్ చేయదు

తాతయ్య ఆశయాలను తుంగలోకి తొక్కి ఇలాంటి ఫ్రాడ్ చేసి ఎలాగు రాహుల్ ఆఫీస్‌కు వెళ్తున్నాడు కాబట్టి దొరికినా వాడి మీద తోసేయాలని అనుకున్నావ్ కదా అని రుద్రాణి అంటుంది. మనిషిలా మాట్లాడు. రాహుల్‌ మీద తోసేయాలని ఉంటే వీడెందుకు పోలీసులకు లొంగిపోతాడు. నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్నందుకు బాగానే బుద్ధి చూపించుకున్నావ్ అని అపర్ణ అంటుంది. ఎస్సై గారు మీరు ఒక నిర్దోషిని తప్పుపడుతున్నట్లు ఉంది. ఇది రాహులే చేసి ఉంటాడు. ఇతను తప్పా ఇంట్లో ఎవరు తప్పు చేసేవాళ్లు లేరు. వాళ్లకు బుద్ధి ఉంది. కానీ, మరి స్మగ్లర్లతో డీలింగ్ చేయదు అని స్వప్న అంటుంది.

స్వప్న నాకోసం నీ అత్త, భర్త దగ్గర చెడుకావొద్దు. నేను తప్పు చేయలేదు. నిజం ప్రూవ్ అవుద్ది అని చెప్పిన రాజ్ పోలీసులతో వెళ్తుంటాడు. ఇంతజరిగినా కావ్య కనపడట్లేదేంటి అని స్వప్న అనుకుంటుంది. ఇంతలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది. నా భర్త ఈ నేరం చేయలేదు. కంపెనీ పేరు మీద నకిలీ అగ్రిమెంట్, నకిలీ స్టాంప్‌లు ఎవరు చేయించారో, ఆ దొంగ బంగారం కాంట్రాక్ట్ పైన ఎవరు సైన్ చేశారో అన్ని వివరాలు ఈ ఫైల్‌లో ఉన్నాయని కావ్య పోలీసులకు ఇస్తుంది.

అది చూసిన ఎస్సై సారీ సర్. ఇప్పటివరకు కంపెనీ ఛైర్మన్‌గా మీరే ఉన్నారు అనుకున్నా. కానీ ఫ్రాడ్ ఎవరు చేశారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో మీకు ఏ సంబంధం లేదనేది అర్థమైంది సార్ అని ఎస్సై అంటాడు. మరి ఎవరికి సంబంధం అతని పేరు కూడా చెప్పేసేయండి అని కావ్య అంటుంది. మొత్తం చేసింది ఆ రాహులే అని ఎస్సై అనడంతో అంతా షాక్ అవుతారు. చెప్పానా వీడే అని చెప్పానా ఇప్పటికైనా అర్థమైంది కదా. వాడిని నడిరోడ్డుమీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లండి అని స్వప్న అంటుంది.

అమాయకుడిలా నటించావ్

ఇదంతా నా కొడుకుని ఇరికించడానికి కుట్ర అని రుద్రాణి అంటే.. అమ్మా సాక్ష్యాలన్ని క్లియర్‌గా ఉన్నాయని ఎస్సై అంటాడు. ఈ కావ్యే నాపై కుట్ర చేస్తుంది. నేను నిర్దోషిని అని రాహుల్ అంటాడు. దాంతో కోపంగా వెళ్లి రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. వదినా అని రుద్రాణి అంటే.. హేయ్.. అని వార్నింగ్ ఇస్తుంది. ఈ ఇంట్లో ఉంటూ, ఇంటిపై బతుకుతూ ఇంతటి అవినీతికి పాల్పడతావా. సంస్థ పరువు, ఇంటి పరువు తీస్తావా. ఇప్పటివరకు ఎంత అమాయకుడిలా నటించావ్. పైగా రాజ్‌ను అరెస్ట్ చేస్తుంటే మౌనంగా ఉంటావా అని అపర్ణ అంటుంది.

నీలాంటి వాడికి కరెక్ట్ ప్లేస్ జైలే.. వెళ్లు అని అపర్ణ అంటుంది. వదినా ఈ కావ్య ఏదో మాయ చేస్తుంది అని రుద్రాణి అంటుంది. పళ్లు రాళతాయ్. ఆడపడుచు స్థానంలో లేకపోయి ఉంటే.. నరికిపోగులు పెట్టేదాన్ని. ఇంటి సభ్యురాలివి కాకపోయి ఉంటే.. నా కోడలి కాలి గోటికి కూడా సమం కానీ నువ్వు.. తన గురించి ఏం మాట్లాడినా నువ్ ఎవరనేది కూడా చూడను. నోరు మూసుకుని పడి ఉండు. ఏం పెంచవమ్మా నీ కొడుకును. ఛీ.. అని అపర్ణ అంటుంది.

స్వప్న అన్నట్లు నడిరోడ్డుమీద కొట్టుకుని తీసుకెళ్లే ఆప్షన్ ఉంటే అలాగే చేయండని ప్రకాశం అంటాడు. ఎఎఫ్ఐర్ ఫైల్ చేసి రిమాండ్‌కు పంపించండి దరిద్రం వదిలిపోతుందని సుభాష్ అంటాడు. నీకేం తక్కువ చేశాంరా. నా మనవళ్లతో సమానంగా చదివించి, ఉన్నత స్థానంలో కూర్చోబెడితే.. ఇదేనారా నీ విశ్వాసం. అయినా నీ పెంపకం అలాంటిది. ఎస్సైగారు తీసుకెళ్లండి అని ఇందిరాదేవి అంటుంది. అరెస్ట్ చేయొద్దను చెప్పమ్మా అని రుద్రాణి అంటుంది.

ఇంటి పరువు కాపాడావ్

ఇంకా ఎవరు చెప్పిన వినేదిలేదమ్మా అని పోలీసులు రాహుల్‌ను తీసుకెళ్తారు. నేను ఏ నేరం చేయలేదని రాహుల్ బుకాయిస్తూ వెళ్తాడు. స్వప్న దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించే అని కావ్య అంటుంది. నువ్వేం చేస్తావే వెర్రిధాన. అది నేను రాసుకున్న రాత. వాడి మాటలు నమ్మి మోసపోయాను. వాడి భార్యగా ఉండటం కన్నా ఈ ఇంట్లో నీకు అక్కగా ఉండటం నాకు గౌరవంగా ఉంటుందని స్వప్న అంటుంది. ఈరోజు నువ్ చేసింది మాములు విషయం కాదు. నీ భర్తను కాపాడుకున్నవ్. ఇంటి పరువు కాపాడావు అని అపర్ణ అంటుంది.

ఇదంతా ఎలా చేశావ్ అని రాజ్ అడుగుతాడు. రాహుల్ ఆఫీస్‌కు వెళ్లినప్పుడే శ్రుతిని గమనించమని చెప్పాను అని కావ్య అంటుంది. నీ ముందు చూపుకు శభాష్ కావ్య అని సుభాష్ అంటే.. రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. మరోవైపు కల్యాణ్ టిఫిన్ చేస్తున్నాడు అని బంటి అంటాడు. రెండు గంటలు అవుతుంది, నేను అన్ని పనులు చేశాను. నీ టిఫిన్ మాత్రం కాలేదు. బంటిగాడు ఆకలికి ఆగలేడు అని అప్పు అంటుంది. ఉప్మా రెడీ అని కల్యాణ్ తీసుకొస్తాడు.

అది మొత్తం నీరు నీరు ఉంటుంది. ఉప్మా అని సాంబారు చేశావేంటీ.. మీ ఉప్మాను మీరే తాగండి. నేను వెళ్లి పెద్దమ్మ ఇంట్లో తింటాను అని బంటి వెళ్లిపోతాడు. వంటల్లో నేనే దద్ది అంటే.. నువ్ నాకంటే దద్దివి. ఇవి తింటే మోషన్స్ పట్టుకుంటాయి. ఇవాళ్టికి నేను ఏదో తింటాను కానీ, నువ్ బయట టిఫిన్ చేసి వెళ్లు. లేట్ అయితే పికప్‌లు, డ్రాప్‌లు లేట్ అవుతాయి అని అప్పు అంటుంది. దాంతో షాక్ అయిన కల్యాణ్ నీకెలా తెలుసు అంటాడు. నువ్వేగా నిన్న చెప్పావ్ అని అప్పు అంటుంది.

ముందు చెబితే నమ్మారా

మరోవైపు రాజ్‌కు కాఫీ తీసుకొస్తుంది కావ్య. అక్కడ తగలబెట్టు అని రాజ్ అంటే.. నేను చేసింది రాహుల్ లాంటి తప్పు కాదు తగలబెట్టడానికి అని కావ్య అంటుంది. మధ్యలో రాహుల్‌ను ఎందుకు తీసుకొస్తున్నావ్. వాడు తప్పు చేసి ఉంటే మాకు ముందు చెప్పొచ్చు కదా అని రాజ్ అంటాడు. ముందు చెబితే మీరు నమ్మారా. ఫైల్ మార్చాడంటే విన్నారా.. నన్ను, అక్కను ఫూల్స్ చేశాడని అంటే నమ్మారా అని కావ్య అంటుంది. ఇల్లు ముక్కలు అయిపోతుందని తాతయ్య ఆందోళనలో పడతారు అని కావ్య అంటుంది.

రాహుల్ అరెస్ట్ అవడం మా అక్కతోపాటు అందరూ కోరుకుంటున్నారు. నేరం మీపై మోపాలని చూశాడు కాబట్టే ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. తాతయ్య నిర్ణయం తప్పు కాబట్టే ఆరోజు అడ్డుపడ్డాను అని కావ్య అంటుంది. దీనంతటికి కారణం నువ్వే. నువ్ కల్యాణ్‌ను ఇంటికి తీసుకొచ్చి ఉంటే.. మా పిన్ని ఆస్తి పంచమని అడిగేది కాదు. రాహుల్ ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఇలా ఫ్రాడ్ చేసేవాడు కాదని రాజ్ అంటే.. టుపుక్కు జర జర డుబుక్కు మే కథ చెబుతుంది కావ్య.

మీకు వంకరంగా ఆలోచించడం ఐమూలగా అలవాటైనట్లు ఉంది. ఇక మీరెళ్లి మీ స్థానంలో కూర్చుని బాధ్యతలు తీసుకోండి. నిర్ణయాన్ని మార్చుకోమని తాతయ్యను అడగండి అని కావ్య అంటుంది. ఇది పనికిమాలిన ఐడియా అని రాజ్ అంటుంది. నేను కావాలని రాహుల్‌ను అరెస్ట్ చేయాలనికోలేదు. కంపెనీ పరువు కాపాడాలని మాత్రమే చేశాను. నమ్మితే నమ్మండి అని కావ్య అంటుంది. మరోవైపు ఇల్లీగల్ బిజినెస్ చేసినట్లు నటించరా అంటే.. నిజంగానే ఇలా ఇరుక్కున్నాడేంటీ. ఒంటరిదాన్ని అయిపోయాను అని రుద్రాణి అనుకుంటుంది.

తట్టుకోలేకపోతున్నాను

వాడు లేకుండా ఏం చేయలేను. నాన్న దగ్గర ఎమోషనల్‌గా మాట్లాడి వాడిని బయటకు తీసుకురావాలి అని రుద్రాణి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది. వాడు పోలీస్ స్టేషన్‌లో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడిని విడిపించి తీసుకొస్తే అన్ని నిజాలు తెలుస్తాయని రుద్రాణి అంటుంది. అలా చేసే ప్రసక్తే లేదని సీతారామయ్య అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో రాహుల్ ఇంటికి వస్తాడు. నేను నిర్దోషిని అని పోలీసులు వదిలేశారు అని రాహుల్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రుద్రాణి నానా మాటలు అంటుంటే.. మీ కొడుకు తిరిగి వచ్చినంత మాత్రనా నిర్దోషి అన్నట్లు కాదు అని కావ్య అంటుంది. స్టాప్ ఇట్ కళావతి అని కావ్యపై కోప్పడతాడు రాజ్.