Brahmamudi Promo: రాజ్‌ను పోలీసుల ముందు గట్టిగా ఇరికించిన రాహుల్- జైలుకు దుగ్గిరాల వారసుడు- కావ్య కాపాడుతుందా?
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి ఒకటి. బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రాజ్‌ను దొంగ బంగారం కేసులో రాహుల్ గట్టిగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో తెలుసుకుందాం.
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు. అది చూసి ఇంట్లోవాళ్లంతా ఉలిక్కి పడి కూర్చున్న సోఫాలో నుంచి లేస్తారు. ఏమైంది. ఎందుకు వచ్చారు. ఏమైనా సమస్య అని ఇంట్లోవాళ్లు అడుగుతారు. అప్పుడు ఎస్సై వచ్చి వాళ్లు వచ్చిన విషయం ఏంటో చెబుతాడు.
రాహుల్‌ను నిలదీసిన సుభాష్
ఎర్లీ మార్నింగ్ మా పెట్రోలింగ్ వాళ్లు ఓ ట్రాలీ ఆటో పట్టుకున్నారు. అందులో దొంగ బంగారం సప్లై అవుతుంది. అది స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీకే సప్లై అవుతుందని బయటపడింది అని ఎస్సై చెబుతాడు. దాంతో అంతా షాక్ అయిపోతారు. రాజ్ ఆలోచనలో పడతాడు. అప్పుడు ఏరా నువ్వేగా ఆఫీస్‌కు వెళ్లేది. ఏంటిది. ఏం చేస్తున్నావ్. ఏం జరుగుతోంది అని రాహుల్‌ను నిలదీస్తాడు సుభాష్.
రెండు రోజుల ముందు నుంచే
ఇలా మన కంపెనీలో ఇలాంటి స్మగుల్డ్ గోల్డ్ కొంటారని నాకెలా తెలుస్తుంది మావయ్య అని రాహుల్ ఏం తెలియనట్లు బుకాయిస్తాడు. షటప్ అని కోపంగా ఫైర్ అయిన సుభాష్.. నిజం చెప్పు అని అంటాడు. నాకు అయితే ఏం తెలియదు. మీరే అంతా చూస్తున్నారు. నేను రెండు రోజుల ముందు నుంచే కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాను. ఇంతలోనే ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేస్తాను. మీరే చెప్పండి అని రాహుల్ తప్పించుకుంటాడు.
కోపరేట్ చేస్తాను మమ్మీ
దీనికి పూర్తి బాధ్యత కంపెనీ ఛైర్మన్ అయిన స్వరాజ్‌దే కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్సై అంటాడు. దాంతో రాజ్, అపర్ణ, సుభాష్ నిర్ఘాంతపోతారు. తర్వాత రాజ్ మాట్లాడుతాడు. నేను పోలీసులకు కోపరేట్ చేస్తాను మమ్మీ అని రాజ్ అంటాడు. దానికి ఇందిరాదేవి, సీతారామయ్యతోపాటు అంతా షాక్ అవుతారు. అప్పుడు వచ్చిన కావ్య అదంతా చూస్తుంది.
అత్తకు స్వప్న పంచ్‌లు
అయితే, మొదట పోలీసులకు కోపరేట్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు రాజ్ వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత రాహుల్ ఇదంతా చేశాడని అంతా అనుమానిస్తారు. కావ్య కూడా అనుమానిస్తుంది. కానీ, రుద్రాణి, రాహుల్ మాత్రం కాదని వారించేందుకు ప్రయత్నిస్తారని అర్థం అవుతోంది. స్వప్న మాత్రం తన అత్తకు పంచ్‌లు వేస్తూ రాహులే చేశాడని గట్టిగా చెబుతుందని తెలుస్తోంది. అయితే, తర్వాత కావ్య మాత్రం రాహుల్ చేసిన ఫ్రాడ్‌ను సాక్ష్యాలతో పట్టుకునే అవకాశం ఉంది.
రాజ్ సెక్రటరీ ద్వారా
ఇదివరకే రాజ్ సెక్రటరీ శ్రుతికి రాహుల్‌పై కన్నేసి ఉంచమని చెప్పింది. రాహుల్ చేసిన ఈ ఇల్లీగల్ వ్యవహారాన్ని శ్రుతి కనిపెట్టి ఉండాలి. ఆ తర్వాత పోలీసులకు రాహుల్‌ను సాక్ష్యాధారాలతో పట్టిస్తారా, రాహుల్ బినామీ కూడా దొరికిపోతాడా అనేది తెలాల్సి ఉంది. ఒకవేళ ఇలా జరగకుంటే రాజ్‌కు కచ్చితంగా జైలుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదంతా తెలియాలంటే బ్రహ్మముడి సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.