Brahmamudi August 29th Episode: బ్రహ్మముడి- కావ్యకు సెలవు ప్రకటించిన రాజ్- రుద్రాణి ట్రాప్‌లో గట్టిగా ఇరుక్కున్న కళావతి-brahmamudi serial august 29th episode rudrani rahul set a trap for kavya by swapna to blame brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 29th Episode: బ్రహ్మముడి- కావ్యకు సెలవు ప్రకటించిన రాజ్- రుద్రాణి ట్రాప్‌లో గట్టిగా ఇరుక్కున్న కళావతి

Brahmamudi August 29th Episode: బ్రహ్మముడి- కావ్యకు సెలవు ప్రకటించిన రాజ్- రుద్రాణి ట్రాప్‌లో గట్టిగా ఇరుక్కున్న కళావతి

Sanjiv Kumar HT Telugu
Aug 29, 2024 07:36 AM IST

Brahmamudi Serial August 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌లో రాజ్ క్యారంబోర్డ్ ప్రిపేర్ చేస్తాడు. కావ్యను వచ్చి ఆడమంటాడు. ఇవాళ నీకు సెలవు ప్రకటిస్తున్నాను అని టిఫిన్ బయటనుంచి తెప్పిస్తాడు. మరోవైపు కావ్య గట్టిగా ఇరుక్కునేలా స్వప్నను ఉపయోగించి ట్రాప్ వేస్తారు రుద్రాణి రాహుల్.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తమతోపాటే ఇంటికి రమ్మని కృష్ణమూర్తి అడుగుతాడు. మేము రాము. అల్లుడు ఎప్పుడు కొడుకు కాలేడు. వస్తే ఇల్లరికం అల్లుడే అంటారు. అప్పుడు మాకు విలువ ఏముంటుంది అని అప్పు అంటుంది. మీరు సంతోషంగా ఉన్నారు. అది చాలు. మాకు తృప్తిగా ఉంది. మాకు పెళ్లైనప్పుడు ఇంతకంటే చిన్నగదిలోనే ఉండేవాళ్లం. కానీ, తృప్తిగా ఉన్నాం. నచ్చి చేసుకున్నారు. సంతోషంగా ఉండండి అని కనకం అంటుంది.

మరోపూట గడవదు

పుట్టింటి నుంచి చీర సారే తీసుకొస్తారు. కానీ, మీ పెళ్లి అనుకోకుండా జరిగింది. పెళ్లి ఖర్చులకే డబ్బు అయిపోయింది. అందుకే ఏం తేలేకపోయాం. కానీ, ఈ మూడు వేలున్నాయి. ఇవి తీసుకోండి అని కనకం ఇస్తుంది. కానీ, అప్పు వద్దంటుంది. ఓవరాక్షన్ చేయకు. తీసుకో. నీ డబ్బుతోనే ఇల్లు గడిచేది. దాంట్లోనే నీ ఖర్చులు వెల్లదీసుకునేదానివి అని కనకం అంటుంది. ఒక్కపూట అయిన ఉండకుండా వెళ్తున్నారు అని కల్యాణ్ అంటాడు.

ఒక పూట పనిచేయకపోతే మరోపూట గడవని చిన్న బతుకులు బాబు మావి అని కృష్ణమూర్తి అంటాడు. కనకం, కృష్ణమూర్తి బయటకు వస్తారు. ఒక్కపూట అయినా ఉండనందుకు అల్లుడు గారు ఫీల్ అవుతారేమో అని కృష్ణమూర్తి అంటాడు. ఉంటేనే ఇబ్బంది పడతారు. అసలు వాళ్ల దగ్గర ఏముందని మనకు పెడతారు. ఎవరో వాయినం ఇస్తే.. ఆ సెనగలతో మనకు టిఫిన్ చేసి పెట్టింది. మనం రాకపోతే ఆ గుప్పెడు సెనగలతోనే కడుపు నింపుకునేవారు అని కనకం బాధగా చెబుతుంది.

బాధపడకే. ఎంతో కొంత ఇచ్చాం కదా. దాంతో కొన్ని రోజులు వెళ్లదీస్తారు. ఈలోపు అల్లుడు గారు ఏదైనా పని చూసుకుంటారు అని కృష్ణమూర్తి అంటాడు. ఈ డబ్బుతో సరుకులు తీసుకురా అని అప్పు అంటే.. వద్దు అవి మీ అమ్మ నీకు ఇచ్చింది. దాన్ని ముట్టుకోను. నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. ఇంకా నిన్ను కష్టపెట్టలేను అని కల్యాణ్ అంటాడు. మరోవైపు హాల్లో క్యారంబోర్డ్ రెడీ చేస్తుంటాడు రాజ్. కిచెన్‌లోకి కావ్య వెళ్తుంటే.. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా నీకు సెలవు ఇస్తున్నాను రా అని పిలుస్తాడు రాజ్.

కోడలి పార్టీ

అందరు ఆటలుగా ఉందని అందరూ అంటారని కావ్య అంటుంది. నేను ఉన్నాగా చెప్పడానికి. కొండంత అండగా నేనుండగా నువ్వేందుకు భయపడతావ్ రాజ్ అంటే.. అయితే కూర్చోన కొండంత అండ అని వెటకారంగా అంటుంది కావ్య. కూర్చో తొండంత పిల్ల అని రాజ్ కౌంటర్ ఇస్తాడు. ఏంటని కావ్య అంటే.. ఏదో ప్రాసకోసం అన్నానులే అని రాజ్ అంటాడు. అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్లు కూడా ఆడతాం అంటారు.

నేను కోడలి పార్టీ అని కావ్య వైపు కూర్చుంటుంది అపర్ణ. రాజ్ వైపు ఇందిరాదేవి కూర్చుంటుంది. నలుగురు క్యారంబోర్డ్ ఆడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్లు వచ్చి చూసి సంతోషిస్తారు. మీ తర్వాత నేను అన్నయ్య ఒక జట్టు, స్వప్న రాహుల్ ఒక జట్టు అనుకుని ఆడతామని ప్రకాశం అంటాడు. పులి మేక ఎలా కలుస్తాయి అంకుల్ అని స్వప్న అంటే.. వాటికి జాతి వైరం ఉంటుంది కదా అని ప్రకాశం అంటాడు. అలా వచ్చారా.. అలా అయిన నేను రాహుల్ కలిసినట్లు అవుతుందని స్వప్న అంటుంది.

చిట్టి నువ్వే గెలవాలి అని సీతారామయ్య అంటాడు. అలాగే బావ అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ నువ్ తాతయ్య చెప్పింది జరగాలంటే కళావతిని ఓడగొట్టాలి అని రాజ్ అంటాడు. ఓడగడొతా.. పడగొడతా అని ఇందిరాదేవి అంటుంది. అత్తా కోడళ్లతో పెట్టుకుంటున్నారు. మా పోటీనీ తట్టుకోలేరు అని అపర్ణ అంటుంది. మీరు అలా అంటుంటే నాకు టెన్షన్‌గా ఉందని కావ్య అంటుంది. నలుగురు సంతోషంగా ఆడుతుంటారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ వస్తారు.

రుద్రాణి దొంగ ఏడుపు

ఎంతరమణీయంగా ఉందో అని రుద్రాణి అంటే.. రాత్రి నువ్వు కూడా సంతోషంగా ఉన్నావ్ కదా. చెంపమీద కొట్టిన బుద్ధిరాలేదా. నాతో మాట్లాడుతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా మొహం. అప్పును అవమానించినందుకు నా కోడలు చేసింది. రూమ్‌లో లాఫింగ్ గ్యాస్ పెట్టింది. రాత్రంతా నవ్వుతూనే ఉన్నాం. కల్యాణ్ వెళ్లిపోయినందుకు నేనెందుకు నవ్వుతున్నాను. కన్నతల్లి బాధ చూసి అలా చేస్తానా అని దొంగ ఏడుపు ఏడుస్తుంది రుద్రాణి.

నీ కొడుకు వెళ్లిపోయిన బాధ ఇంట్లో ఎవరికైనా ఉందా. ఆఖరికి నీ వెర్రినాగన్న (ప్రకాశం) కూడా చేరాడు. నీ కొడుకు రోడ్డుమీద బొమ్మలు అమ్ముకుంటే వాళ్లు సంతోషంగా ఎలా ఉన్నారో చూడు అని రుద్రాణి ఎక్కిస్తుంది. ధాన్యలక్ష్మీ గొడవకు దిగబోతుంటే.. ఇప్పుడు నువ్వు ఏదైనా అంటే ఇద్దరిని కలిపి తిడతారు. వాళ్ల సంతోషాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నావని అంటారు అని రుద్రాణి అంటుంది. నాకింత బాధను మిగిల్చి వాళ్లు ఎలా సంతోషంగా ఉంటారో చూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇలా కాదు. సమయం చూసి మాట్లాడుదాం అని ధాన్యలక్ష్మీని పంపించేస్తుంది రుద్రాణి. ఇక్కడ చిచ్చు రాజేశాను. అక్కడ పుల్లేస్తాను అని రుద్రాణి అంటుంది. ఇలా ఆడుకోవడమేనా కడుపుకు టిఫిన్ పెట్టడేమైనా ఉందా అని రుద్రాణి అంటుంది. దాంతో బయటనుంచి కొందరు టిఫిన్ తీసుకొస్తారు. ఇవాళ నా శ్రీమతికి సెలవు. కావునా అందరికీ టిఫిన్ బయట నుంచి వస్తుంది. ఆకలి అయినవాళ్లు తినండి. లేనివాళ్లు మాతో ఆడండి అని రాజ్ అంటాడు.

కోపం వచ్చేలా చేస్తే

మరోవైపు రాహుల్ దగ్గరికి వచ్చి వాళ్ల నవ్వు చూస్తుంటే కడుపు మండిపోతుంది. తమ్ముడు వెళ్లిపోతే డిప్రెషన్‌లో ఉంటాడని అనుకుంటే భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు అని రుద్రాణి అంటుంది. ఇలా అయినా కంపెనీకి దూరంగా ఉండి ఆలోచించడు అని రాహుల్ అంటాడు. ఇలా సరిపోదు. వాళ్లిద్దరు సంతోషంగా ఉంటే ఆపలేం. రాజ్ మనసును కావ్య మార్చేస్తుంది. ఆ అవకాశం వాళ్లకు ఇవ్వకూడదు. ఇదే టైమ్‌లో కావ్యపై రాజ్‌కు కోపం వచ్చేలా చేస్తే దూరమైపోతాడు కదా అని రుద్రాణి అంటుంది.

ఒకప్పుడు మన కంపెనీలో ఇల్లీగల్‌గా బంగారం పెట్టేందుకు ట్రై చేశావ్ కదా. ఆ పని మళ్లీ చేస్తున్నట్లుగా స్వప్నకు తెలిసేలా చేయు. స్వప్న వెళ్లి కావ్యకు చెబుతుంది. అప్పుడు నువ్ తప్పు చేస్తున్నట్లు ఇంట్లో అందరికి చెబుతుంది. కానీ, నీకు చెడ్డపేరు రాదు. నువ్ కంపెనీకి ద్రోహం చేస్తున్నావని కేవలం స్వప్నకు మాత్రమే నిరూపిస్తాం. కానీ, అందరిముందు అది నిజం చేయకుండా చేస్తాం అని రుద్రాణి అంటుంది. స్వప్నకు మాత్రమే నేను వెధవని నిరూపిస్తాం. కానీ, అందరిముందు కావ్యను వెధవని చేస్తాం అని రాహుల్ వెళ్లిపోతాడు.

ఈ దెబ్బతో కావ్యపై రాజ్‌కు పుట్టికొచ్చిన ప్రేమ మొత్తం పోతుంది. దీన్ని కావ్య ఎలా తట్టుకుంటుందో చూస్తాను అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు బీరువాలో ఇల్లీగల్ కోసం చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాను అంటూ ఫైల్ తీసుకుంటాడు రాహుల్. అప్పుడే స్వప్న వస్తుంది. అది చూసి కావాలనే ఫోన్‌లో మాట్లాడుతాడు రాహుల్. ఇది చాలా సీక్రెట్. రాజ్ ఉండటం వల్ల డీల్ పూర్తిచేయలేను. నువ్ ఇప్పుడు ఎన్ని కేజీల బంగారం తీసుకొచ్చిన నా కంపెనీలో పెట్టుకుంటాను. ఏం జరిగినా కంపెనీ మూతపడుతుంది కానీ, మనకేం జరుగుతుంది అని రాహుల్ మాట్లాడుతాడు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి

డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేశాను. ఇక మనకు కోట్లల్లో లాభం అని రాహుల్ కాల్ పెట్టేసినట్లు నటిస్తాడు. కంపెనీ బాధ్యతలు ఇస్తే వీడేంటీ ఇలా చీప్‌గా చేస్తున్నాడు అని రాహుల్ వెళ్లగానే ఆ డాక్యుమెంట్స్ చూస్తుంది. ఇలా చేస్తే నిజంగానే కంపెనీ మూతపడుతుంది. ఈ విషయం వెంటనే కావ్యకు చెప్పాలి. డాక్యుమెంట్స్ తీసుకెళ్తే రాహుల్‌కు డౌట్ వస్తుంది. వీళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి అని స్వప్న అనుకుని వెళ్లిపోతుంది. అది చూసిన రాహుల్ వెళ్లి అంతా కావ్యకు చెప్పు. మా మమ్మీ మిమ్మల్ని ఎలా పిచ్చోళ్లను చేస్తుందో చూడు అని అనుకుంటాడు.

కావ్య దగ్గరికి వెళ్లి రాహుల్ మాట్లాడింది చెబుతుంది స్వప్న. వాళ్లతో డీల్ అగ్రిమెంట్ చేసుకోడానికి పేపర్స్ రెడీ చేశాడు అని స్వప్న చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో రాహుల్ బిజినెస్ చూసుకోడానికి వీళ్లేదు, రాహుల్ అక్రమంగా దొంగ బంగారం కొనడానికి సిద్ధపడ్డాడు అని కావ్య అంటుంది. రాహుల్ సాక్ష్యం అడిగితే.. చూడు అని రాహుల్ దగ్గరున్న పేపర్స్ చూపిస్తుంది స్వప్న. అవి రాజ్ చూస్తాడు. చూస్తుంటే ఈసారి రద్రాణి ట్రాప్‌లో కావ్య గట్టిగా ఇరుక్కుని రాజ్ దగ్గర చెడ్డపేరు తెచ్చుకుంటుందని తెలుస్తోంది.