Brahmamudi September 10th Episode: బ్రహ్మముడి- రాజ్ భార్యగా ముగిసిన కావ్య పాత్ర- ఇక సెలవంటూ ఇంట్లోంచి వెళ్లిపోయిన కళావతి
10 September 2024, 7:29 IST
Brahmamudi Serial September 10th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కంట్రోల్‌లో లేడని ఇంటికి తీసుకొస్తాడు సుభాష్. అక్కడ రాజ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. దాంతో వచ్చిన ఫోన్ కాల్ గురించి, వెళ్లడం గురించి కావ్య చెబుతుంది. రాజ్ నమ్మడు, భార్యగా పనికిరావంటాడు.
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అపర్ణకు ఏం కాదని సుభాష్ సర్దిచెప్పిన ఆ విషయం నాకు తెలుసు. నా మాట నాకెందుకు చెబుతున్నారు అని కోప్పడతాడు రాజ్. దాంతో సుభాష్‌ను పక్కకు తీసుకెళ్లిన కల్యాణ్.. అన్నయ్యను చూస్తే భయంగా ఉంది పెద్దనాన్న. కంట్రోల్‌లో లేడు. ఇక్కడ ఉండటం కరెక్ట్. ఇంటికి వెళ్లనమండి అని అంటాడు. వాడు నా మాట ఎక్కడ వింటాడురా అని సుభాష్ అంటాడు.
ధైర్యంగా ఉంటుంది
దాంతో పెద్దనాన్న చాలా కంగారుపడుతున్నాడు. పెద్దమ్మకు ఏం కాదు. పెద్దనాన్న ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. నువ్ ఇంటికి తీసుకెళ్లు. నేను తీసుకెళితానంటే రావట్లేదు అని కల్యాణ్ అంటాడు. ఎందుకు డాడ్ భయం. అమ్మకు ఏం కాదు రాజ్ గట్టిగానే చెబుతాడు. పెద్దమ్మ ఒక్కత్తే ఇంపార్టెంటా అన్నయ్య.. పెద్దనాన్న కాదా అని కల్యాణ్ అంటాడు. నాకు చాలా భయంగా ఉందిరా. నన్ను తీసుకెళ్లురా. ఇంట్లో అందరితో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని సుభాష్ అంటాడు.
అమ్మను విడిచి నేను రాలేను. మీరు కల్యాణ్‌తో వెళ్లండి డాడ్ అని రాజ్ అంటాడు. అమ్మకు ఏం కాదని చెబుతున్నావ్ కదా. కల్యాణ్ ఉంటాడు. నువ్ రారా అని రాజ్‌ను తీసుకెళ్తాడు రాజ్. ఇంట్లో అంతా దిగాలుగా కూర్చుంటారు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తుంటారు. ఇంకేంటీ మామ్ కావ్యపై కోపం పెరిగేలా మొదలుపెట్టు అని రాహుల్ అంటే.. ఇప్పటికే కావ్యపై రాజ్ ద్వేషంగా ఉన్నాడు. ఇప్పుడు రాజ్ వచ్చాకా మొదలుపెడతాను. కావ్యను రాజ్ గెట్ అవుట్ అనేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది.
రాజ్, సుభాష్ కారు దిగుతారు. డాడీ మమ్మీ నిజంగా ప్రాణాలతో తిరిగి వస్తుందా. ఎందుకో అలా అనిపిస్తుంది అని రాజ్ డౌట్‌గా అడుగుతాడు. రేయ్ అవేం మాటలురా అని సర్దిచెప్పి లోపలికి తీసుకెళ్తాడు రాజ్‌ను సుభాష్. ఎలా ఉందిరా అని ఇందిరాదేవి అడిగితే.. అక్కడ అందరు చూశారుగా. ఎలా ఉంటుంది. అలాగే ఉంది అని రాజ్ కోపంగా అంటాడు. రాజ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్ అని సుభాష్ అంటాడు. చావు బతుకుల్లో ఉంది మా అమ్మ. అసలు తప్పు నాది. ఎవరో నమ్మి అనారోగ్యంగా ఉన్న మమ్మీని వదిలివెళ్లడం నాది తప్పు అని రాజ్ అంటాడు.
కడుపుతో ఉన్నావని కూడా చూడను
తప్పు నీది కాదురా. ఈ మహాతల్లి కావ్యది. వదినను బాగా చూసుకోమ్మని రాజ్ చెప్పి వెళ్లాడుగా. మరి మా వదిన ప్రాణాల మీదకు ఎందుకు తీసుకుతెచ్చావ్. తనకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని రెచ్చగొడుతుంది రుద్రాణి. అత్త రాజ్ అసలే బాధలో ఉన్నాడు. సమస్య ఎందుకు పెద్దది చేస్తున్నావ్ అని స్వప్న అంటుంది. ఇవాళ నువ్ ఏదైనా అంటే కడుపుతో ఉన్నావని కూడా చూడను. కట్టుబట్టలతో గెంటేస్తాను అని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.
నీ చెల్లెలి ఎంత పెద్ద తప్పు చేసిందో నీకెం తెలిసే.. ఇది మా వదినా ప్రాణాలకు సంబంధించింది అని రుద్రాణి అంటుంది. దాంతో రుద్రాణిని వారిస్తుంది ఇందిరాదేవి. దాంతో రుద్రాణి అడిగినదాంట్లో తప్పేముంది అని ధాన్యలక్ష్మీ సపోర్ట్ చేస్తుంది. అక్కకంటే ముఖ్యమైన పని ఆవిడగారికి ఏం వచ్చిందో అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇందిరాదేవి అడుగుతుంది. కారణం చెబుతాను. కానీ, అత్తయ్యకు ఇలా అవుతుందని ఊహించలేదు. అంత బాధ్యత లేకుండా నేను ఉండను. అదొక్కటి అంతా నమ్మితే చాలు అని కావ్య ఏడుస్తూ అంటుంది.
ఆఫీస్ నుంచి స్టోర్ ఇంఛార్జ్ నంటూ ఒకడు ఫోన్ చేశాడు. దొంగబంగారం కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటున్నట్లు, కంపెనీ పరువు పోయేలా సాయంత్రం మీడియాలో వచ్చేలా చూస్తున్నారని, దాని వెనుక ఉన్నది రాహుల్ అని చెప్పారు అని కావ్య అంటాడు. ఎవడు అది చెప్పింది. నేను అందరితో గుడిలో ఉన్నాను కదా అని రాహుల్ అంటాడు. ఆ కంపెనీ వద్దని వాడు అన్నాడు కదా. ఇంకా వాడిని వదలవా. ఒకసారి ఫేక్ ఫ్రూప్స్ చూపించి అరెస్ట్ చేశావా చాలదా అని రుద్రాణి డ్రామా చేస్తుంది.
అది ఫేక్ కాల్
నా అంతటా నేను నింద వేయాలని చూడట్లేదు. నిజంగానే నాకు ఫోన్ వచ్చింది. అత్తయ్య గారితో చెప్పాను. ఆయనకు చెబుతానంటే గుడి నుంచి ఆఫీస్‌కు వెళ్లాడనికి లేట్ అవుతుంది. నవ్ వెళ్లమని చెబితేనే నేను వెళ్లానండి అని కావ్య అంటుంది. ఎవరు ఫోన్ చేశారు. అక్కడ ఏం జరిగింది. అన్నయ్యకు, రాజ్‌కు ఎందుకు కాల్ చేయలేదని రుద్రాణి అంటే.. ఆయనకు కాల్ కలవట్లేదు అని చెప్పాడు. అది ఫేక్ కాల్ అని అక్కడికి వెళ్లాకే తెలిసింది అని జరిగింది చెబుతుంది కావ్య.
ఇప్పటికిప్పుడు కథ అల్లేసింది. రాహుల్‌ను ఇంట్లోంచి గెంటేయాలని ప్లాన్ చేశావా. ఒక్కటి కూడా నిజం కాదు అని రుద్రాణి అంటుంది. నేను జరిగిందే చెబుతున్నాను అని కావ్య అంటే.. రుద్రాణి అరుస్తుంది. ముందు కల్యాణ్ వెళ్లేలా చేశావ్. రాహుల్‌ను కంపెనీకి వెళ్లకుండా చేశావ్. మా వదిన ఆరోగ్యం బాలేదని తెలుసు. కంపెనీ నష్టమో లాభమో రాజ్ చూసుకుంటాడు. మా వదినా ప్రాణాలు ముఖ్యం కదా అని రుద్రాణి కావ్యను ఇరికిస్తుంది.
అవును.. ముఖ్యమే. అందుకే ఉంటాను అన్నాను. కానీ, అత్తయ్యే వెళ్లమన్నారు. దొంగబంగారం పట్టుబడటం మీడియాలో వస్తుంది అన్నాడు. ఇంటి ప్రతిష్ట కూడా పోతుందని నేను వెళ్లాను. అది నా బాధ్యత అనుకుని వెళ్లాను. ఇప్పుడు మీకు అవకాశం దొరికిందని ఎక్కువ చేస్తున్నారు. ఆపండి ఇక అని కావ్య చెబుతుంది. దాంతో స్టాప్ ఇట్ అని రాజ్ కోపంగా అరుస్తాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ఎందుకు వెళ్లావ్ అని రాజ్ అంటాడు.
అమ్మ నిండు ప్రాణాలు
ఇంటి పరువు పోతుందని కావ్య అంటే.. మై ఫుట్ అని రాజ్ గట్టిగా అరుస్తాడు. కంపెనీకి నష్టం వస్తే వచ్చింది. ఇంటి పరువు పోతే పోయింది. నీకెందుకు. ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను. ఏం జరిగినా కంపెనీ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా. మా అమ్మను నిర్లక్ష్యం చేశావ్. మా అమ్మ ప్రాణాలతో ఉంటుందో లేదో తెలియదు. నీ నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ నిండు ప్రాణాలు. అది తెలుసా నీకు అని రాజ్ అంటాడు.
నన్ను అర్థం చేసుకోడానికి అర్థం చేసుకోండి. అత్తయ్య చెబితేనే వెళ్లాను. తప్పనిపరిస్థితుల్లో వెళ్లాను. అది ఇంత దూరం వెళ్తుందని అనుకోలేదు. ఇలా జరగడం నాకు గిల్టీగానే ఉంది. ఇందులో నేను ఏది కావాలని చేసింది కాదు. అక్కడి నుంచి అబద్ధపు ఫోన్ కాల్ వస్తుందని ఊహించలేదు. నన్ను నమ్మండి అని అని కావ్య చేతులతో మొక్కి వేడుకుంటుంది. మా అత్త మాటలు నమ్మి మా చెల్లిని తప్పుబడుతున్నావ్. తనేంటో నీకు తెలుసు. అన్ని తెలిసి ఆవేశపడుతున్నావ్ అని స్వప్న అంటుంది.
అత్తగారి ప్రాణాన్ని గాలికి వదిలేసి.. తప్పు చేయని నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంది. దానికోసం మా వదిన ప్రాణాన్నే బలి పెట్టాలని అనుకుంది అని రుద్రాణి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని కావ్య అరుస్తుంది. కానీ, చాలు ఆపు అని రాజ్ అంటాడు. నువ్ ఏం చెప్పిన నేను వినను, నేను నమ్మను. అయిపోయింది. నమ్మకం పోయింది. నువ్ తప్పు చేశావ్. నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతోంది. ఒకవేళ జరగరాంది జరిగిదే నిన్ను జీవితంలో క్షమించను అని రాజ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఇలాంటి ఆడది ఈ దుగ్గిరాల ఇంటి కోడలిగా పనికివస్తుందా అని రుద్రాణి అంటుంది. నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాల అని కావ్య అంటుంది. నువ్ నా భార్యగా ఉండటానికే పనికిరావు. ఇంటి కోడలిగా ఉండే అర్హత నీకు లేదు అని రాజ్ అంటాడు. దాంతో ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసింది. ఇక సెలవు అని కావ్య ఇంట్లోంచి వెళ్లిపోతుంది.