తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 3rd Episode: కావ్యకు అవార్డ్- రాజ్‌కు కోలుకోలేని దెబ్బ- గట్టిగా ఇరికించిన అనామిక- మీడియా మాటలకు ఏడుపు

Brahmamudi October 3rd Episode: కావ్యకు అవార్డ్- రాజ్‌కు కోలుకోలేని దెబ్బ- గట్టిగా ఇరికించిన అనామిక- మీడియా మాటలకు ఏడుపు

Sanjiv Kumar HT Telugu

03 October 2024, 8:58 IST

google News
  • Brahmamudi Serial October 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌లో ఎక్స్‌పోలో సామంత్ గ్రూప్‌కు అవార్డ్ వస్తుంది. అది విని రాజ్, కావ్య షాక్ అవుతారు. తనకు అవార్డ్ రావడానికి కారణం అనామిక, కావ్య అని సామంత్ చెబుతాడు. తాము గెలవాలనే కావ్య డిజైన్స్ చేసిందని అనామిక చెబుతుంది. 

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 3వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్‌కు కంగ్రాట్స్ చెప్పి, సారీ చెప్పమని కావ్యతో స్వప్న చెబుతుంది. నేనేందుకు చెప్పాలి. నేనేం తప్పు చేశాను. ఒక్కసారి ఆయన మనసులో నేనున్నాను అని చెప్పమను. నేను ఇప్పుడే వెళ్లి క్షమించమని అడుగుతాను. మా అత్తయ్య దగ్గరికి వెళ్లి ఆమె కాళ్లు పట్టుకుని మీకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు నేను పక్కన లేనందుకు క్షమాపణలు కోరుతాను అని కావ్య అంటుంది.

ఏదైనా మెరాకిల్

ఏంటోనే ఇక్కడ నీకు చెప్పలేకపోతున్నాను.. అక్కడ వాళ్లకు చెప్పలేకపోతున్నాను అని స్వప్న వెళ్లిపోతుంది. టీవీలో కావ్యను చూపిస్తే.. అపర్ణ చూసి సంతోషిస్తుంది. ఇంతలో అవార్డ్ అనౌన్స్‌మెంట్ చెప్పే అతను వచ్చి ఏ కంపెనీకి అవార్డ్ రానుందో ఇంకాసేపట్లో తేలనుందని చెబుతాడు. ఈ ఎక్స్‌పోలో గత పదేళ్లుగా అవార్డ్ దక్కించుకున్న సంస్థ స్వరాజ్ గ్రూపే. ఈ సారి ఏదైనా కొత్తగా మెరాకిల్ జరగబోతుందా.. ఎప్పటిలాగే స్వరాజ్ గ్రూప్ దక్కించుకుంటుందా చూద్దాం అని అతను అంటాడు.

అదిగో లెటర్ వచ్చేసింది. ఇందులో ఎవరు అవార్డ్ గెలుచుకోబోతున్నారో చూద్దాం అని అనౌన్స్‌మెంట్ చెప్పే అతను అంటాడు. వావ్.. వెరీ సర్‌ప్రైజ్. దిస్ అవార్డ్ గోస్ టూ.. అవార్డ్ గోస్ టూ.. సామంత్ గ్రూప్ ఆఫ్ జ్యూవెల్లరీస్ అని అతను చెబుతాడు. రుద్రాణి చెప్పడంతో పైకి లేస్తున్న రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దుగ్గిరాల కుటుంబంతోపాటు కావ్య షాక్ అవుతుంది. అనామిక, సామంత్ తెగ సంబరపడిపోతారు. కావ్యను రుద్రాణి ఐమూలగా చూస్తుంది.

సామంత్ గ్రూప్ ఆఫ్ మెనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సామంత్‌ను వేదికపైకి ఆహ్వానిస్తారు. సామంత్ స్పీచ్ ఇస్తాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. నాకే కాదు ఇక్కడ ఉన్న ఇంకొంతమందికి కూడా ఆశ్యర్యంగా ఉంది. కానీ, ఇది నిజం. నేను నెంబర్ వన్ పొజిషన్‌కు రాడానికి చాలా ఏళ్లు పట్టింది. ఈ ప్రదర్శనలో మా సంస్థకు అవార్డ్ వస్తుందని నేను ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ, చివరిగా సాధించాను అని సామంత్ అంటాడు.

అనామికతో పెళ్లి

ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. కానీ, నా విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీ అనామిక అని సామంత్ అంటాడు. దాంతో అపర్ణ వాళ్లు షాక్ అవుతారు. అనామికను స్టేజ్ పైకి రమ్మంటాడు సామంత్. ఈరోజు తను నా పక్కన ఉండటం వల్లే నాకు ఈ విజయం వరించింది. షీ ఈజ్ మై లేడీ లక్. ఈ శుభ సందర్భంలో మీకో గుడ్ న్యూస్ చెప్బబోతున్నాను. నేను త్వరలో అనామికను పెళ్లి చేసుకోబోతున్నాను అని సామంత్ అంటాడు.

అలాగే, నా విజయానికి కారణమైన రెండో స్త్రీ.. మా క్రియేటివ్ డిజైనర్ మిసెస్ కావ్య అని సామంత్ అంటాడు. దాంతో రాజ్, కావ్య, స్వప్న, సుభాష్, అపర్ణ అంతా షాక్ అవుతారు. రుద్రాణి నవ్వుకుంటుంది. ఈ అవార్డ్ అందుకునే అర్హత మాకన్న మా డిజైనర్ కావ్యకే ఉంది అని సామంత్ అంటాడు. అదేంటీ నేను ఇచ్చిన డిజైన్స్ వేరే కంపెనీకి కదా. వీళ్లకు ఎలా వెళ్లాయి అని సురేష్‌ను అడుగుతుంది కావ్య. అయ్యో ఇది కూడా సామంత్ బినామీ కంపెనీయే కదా. మీకు తెలియదా అని సురేష్ అంటాడు.

కావ్యను వచ్చి అవార్డ్ తీసుకోమంటాడు సామంత్. అదేంటీ నన్ను పిలుస్తున్నారు. వాళ్ల ఏడుపు వాళ్లను ఏడవమను. నేను వెళ్లను అని కావ్య అంటుంది. కావ్య వచ్చి అవార్డ్ తీసుకో అని అనామిక అంటుంది. నన్నెందుకు ఇరికిస్తున్నారు. నాకేంటీ సంబంధం. నేను అవార్డ్ తీసుకోను. ఇది తీసుకుంటే నేను వ్యక్తిత్వం లేని వ్యక్తిగా కనిపిస్తాను అని కావ్య అంటుంది. కానీ, అనామిక పిలుస్తూనే ఉంటుంది. కావ్య భయంగానే స్టేజీపైకి వెళ్తుంది.

గట్టిదెబ్బ కొట్టిందన్న రుద్రాణి

ఇంత మోసమా.. ఇదంతా నువ్ కావాలని చేశావా అని అనామికను కావ్య అడుగుతుంది. ఈ అవార్డ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అవార్డ్ దుగ్గిరాల ఫ్యామిలీకి వెళ్తుంది. ఈసారి మాకే రావాలని చాలా కష్టపడి చేసింది కావ్య. ఈమె ప్రయత్నం, పట్టుదలే ఈ విజయానికి కారణం. అవార్డ్ కావ్య అందుకోవడమే సముచితంగా ఉంటుంది అని అనామిక చెబుతుంది. కావ్యకు అవార్డ్ ఇస్తారు. అనామిక బలవంతంగా అవార్డ్ తీసుకునేలా చేస్తుంది. ఇద్దరికి ఇద్దరు ఎలా ప్రతికారం తీర్చుకున్నారో చూశావా. కావ్య గట్టిదెబ్బ కొట్టింది అని రాజ్‌తో రుద్రాణి అంటుంది.

వీళ్లిద్దరి మధ్య ఎంత దూరం పెరిగిపోతుందో ఛ.. అని స్వప్న అనుకుంటుంది. కావ్య మన ప్రత్యర్థి కంపెనీకి పనిచేయడం ఏంటీ. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అపర్ణ అంటుంది. కళ్లముందు కనిపిస్తుంటే నమ్మడం లేకపోవడం ఏంటీ. నీకు గుడ్డి నమ్మకం. తనేంటో నాకు అర్థమైంది కాబట్టి. నాకు ఆశ్చర్యం కలగడం లేదు. కనీసం నువ్ కళ్లు తెరిచి ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకుంటే మంచిది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

నువ్ నోరుమూయ్. అక్కడ ఏదో తప్పు జరిగి ఉంటుంది అని ప్రకాశం అంటాడు. నాకు అలాగే అనిపిస్తుంది. లేకపోతే కావ్య అత్తారింటి పరువు ఎందుకు తీయాలనుకుంటుంది అని ఇందిరాదేవి అంటుంది. దుగ్గిరాల కోడలు అయిండి ప్రత్యర్థి కంపెనీకి పని చేయడంపై కారణం ఏమైనా ఉందా. మీరు ఇంటినుంచి వెళ్లిపోవడానికి కారణం ఉందా. మీరు రాజ్ ఎందుకు విడిపోయారు. మీరు అనామికతో కావాలనే చేతులు కలిపారని అనుకోవచ్చా. ఇకనుంచి మీరు ఈ కంపెనీకే పని చేస్తారా అని మీడియా అడుగుతుంది.

గొడవ అయ్యేలా ఉంది

దాంతో ఏడుస్తూ కావ్య వెళ్లిపోతుంది. మీడియా అడిగిన ప్రశ్నలకు కావ్య సమాధానం చెప్పలేదు. కానీ, దుగ్గిరాల ఇంట్లో కొన్నిరోజులుగా ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి అని జరిగిన విషయాలు అన్ని మీడియా యాంకర్ చెబుతుంది. డోర్ పక్కన నిలబడి కావ్య ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ ఉంటే గొడవ అయ్యేలా ఉంది. వెళ్లిపోవే అని స్వప్న అంటుంది. రాజ్, సుభాష్ వస్తారు.

కంగ్రాచ్యులేషన్స్. అద్భుతం. నీకు మాటకు మాట జవాబు చెప్పడం మాత్రమే తెలుసు అనుకున్నా. మాట పడటం ఇష్టంలేదనుకున్నా. కానీ, నీలో చాలా కళలు ఉన్నాయని ఇవాళే అర్థమైంది కళావతి. నీకు అనామికకు ఏమాత్రం తేడా లేదని అర్థమైంది. నీ నిజస్వరూపం తెలుసుకోలేకపోయాం. కానీ, ఇవాళ నీ అసలు స్వరూపం ఎలా ఉంటుందో ఇవాళ చూశాం. ఇది నేనే కళ్లారా చూసిన సాక్ష్యం అని రాజ్ అంటాడు. మీరు చూసింది ఏది నిజం కాదు. ఇందులో నా ప్రమేయం ఏంలేదు అని కావ్య అంటుంది.

మా కంపెనీకి నష్టం జరిగిందని నేను బాధపడట్లేదు. నువ్ నా నమ్మకంపై దెబ్బ కొట్టావ్. జీవితంలో ఈ గుణపాఠం మర్చిపోలేను. నీ మీద ఏ మూలనో ఉన్న ప్రేమ ఈ క్షణంతో చచ్చిపోయింది. ఇంకెప్పుడు నాకు ఎదురుపడకు అని రాజ్ బాధగా వెళ్లిపోతాడు. అనుకున్నది సక్సెస్ అయినట్లుగా రుద్రాణి చూస్తుంది. ఏవండి నేను చెప్పేది వినండి అని కావ్య బతిమిలాడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం