తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 10th Episode: బ్రహ్మముడి- రుద్రాణి డెవిల్ ప్లాన్- ఆస్తి లాక్కునేందుకు స్కెచ్- అప్పు కల్యాణ్ ఫస్ట్ నైట్

Brahmamudi August 10th Episode: బ్రహ్మముడి- రుద్రాణి డెవిల్ ప్లాన్- ఆస్తి లాక్కునేందుకు స్కెచ్- అప్పు కల్యాణ్ ఫస్ట్ నైట్

Sanjiv Kumar HT Telugu

10 August 2024, 7:46 IST

google News
  • Brahmamudi Serial August 10th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ తేది ఎపిసోడ్‌లో కావ్య, రాజ్ గొడవ పడతారు. కోపంగా ఉన్న రాజ్ ఏం తినడు. మరోవైపు అప్పు కల్యాణ్ ఇద్దరూ కలిసి తొలిసారి పడుకుంటారు. ఆస్తి మొత్తం లాక్కునేందుకు రుద్రాణి స్కెచ్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 10వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ దగ్గరికి వచ్చి కావ్య భోజనం అని చెబితే నువ్ చేయు అని కోపంగా మాట్లాడుతాడు రాజ్. అది నాకు తెలుసు. ఎవరి మీద కోపం చూపిస్తున్నారండి. కవిగారికి తాళి ఇచ్చి కట్టమని చెప్పింది మీరు. మీ పిన్నిగారికి భయపడి పోయింది కవిగారు అని కావ్య అంటుంది.

మూడు రోజులు మాత్రమే

కల్యాణ్ వెళ్లిపోవడంతో ఇంట్లో ఎవరు సంతోషంగా లేరు. నువ్వే తమ్మున్ని తీసుకురావాలి అని రాజ్ అంటాడు. చచ్చినా నేను ఆ పని చేయను. వాళ్లు ఏమైనా నా ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నారా. అలాంటప్పుడు నేనేందుకు ఇంటికి తీసుకురావాలి. మీరు చెబితేనే వినని వాడు నేను చెబితే వింటాడు. ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఇంటికి రాలేదు. అక్కడ ఉంది కళావతి కాదు అప్పు. మూడు రోజులు సర్దుకుంటుంది. తర్వాత ఎదురుతిరుగుతుంది. కోరి గొడవలు తెచ్చుకోవడం అవసరమా అని కావ్య అంటుంది.

నా తమ్ముడికి బయట బతకడం తెలియదు. ఎలా పని చేసుకోవాలో తెలియదు అని రాజ్ అంటాడు. అయిపోయినదాని గురించి ఇప్పుడు మనం గొడవ పడటం అవసరమా. ఇంట్లో భోజనం చేయకుండా అంతా ఎదురుచూస్తున్నారు. రండి అని కావ్య అంటుంది. నా మాట విననప్పుడు నేనేందుకు నీ మాట వినాలి. నీ వంట నేనేందుకు తినాలి. రాను అని రాజ్ అంటాడు. అది కాదండి అని కావ్య అక్కడే ఉంటే.. నువ్ వెళ్లవుగా అని రాజ్ వెళ్లిపోతాడు.

ప్రైవసీ ఉంచుదాం

మరోవైపు బ్యాచ్‌లర్ రూమ్‌లో అందరితో కలిసి కింద కూర్చుని అప్పు, కల్యాణ్ భోజనం చేస్తుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటారు. దుగ్గిరాల ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఇంట్లోవాళ్లతో కల్యాణ్ భోజనం చేయడం తలుచుకుని ఫీల్ అవుతుంది అప్పు. అరేయ్ వాళ్లకు కొత్తగా పెళ్లి అయింది. వాళ్లకు ప్రైవసీ కావాలి. మనం సినిమాకు వెళ్దాం అని అప్పు ఫ్రెండ్స్ అనుకుంటారు. త్వరగా తినండి సినిమాకు వెళ్దాం అని ఫ్రెండ్ చెబుతాడు.

తర్వాత టైమ్ అవుతుందని అంతా సినిమాకు వెళ్లిపోతారు. మనం సినిమాకు వెళ్లి మళ్లీ రూమ్‌కు రాం. ఇవాళ పుట్‌పాత్‌పైనే మన నిద్ర అని అందరికీ అప్పు ఫ్రెండ్ కిరణ్ చెబుతాడు. ఎంతో లగ్జరీగా బతికిన నిన్ను ఇలాంటి ఇరుగుగదిలోకి తీసుకురావడం నాకా చాలా బాధగా ఉందని అప్పు అంటుంది. నిజానికి అక్కడ అంతా ఉన్నా ఏదో లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఉంటే సంతోషంగా ఉందని కల్యాణ్ చెబుతాడు.

కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం

అనామికే సరిగా ఉంటే ఇదంతా ఉండేది కాదని అప్పు అంటుంది. అనామిక నన్నెప్పుడు ప్రేమించలేదు. నా డబ్బుకోసమే పెళ్లి చేసుకుంది. ఎప్పుడు నన్ను కించపరిచేది. కటువుగా మాట్లాడే నువ్వు నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు. నాకు ఇంట్లో ఉన్నప్పుడు జైలులో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడే నాకు స్వేచ్ఛ దొరికింది. ఇక మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. అనామిక గురించి, గతం గురించి మర్చిపోయి హాయిగా ఉందాం అని కల్యాణ్ అంటాడు.

మరోవైపు ఆకలితో కడుపు పట్టుకుని రాజ్ కిందకు వస్తాడు. అది తల్లి అపర్ణ చూస్తుంది. వంటింట్లోకి వెళ్లిన రాజ్‌కు తినడానికి ఏది దొరకదు. మమ్మీ తినడానికి ఏం లేదని రాజ్ అంటాడు. అన్నం ఉంది. కర్రీ ఉంది. కావాలంటే చెప్పు నేను వడ్డిస్తాను అని అపర్ణ అంటుంది. ఆ కళావతి వండింది నేను తినను అని రాజ్ అంటాడు. ఏవండి నేను వడ్డిస్తాను అని కావ్య అంటూ వస్తుంది. నీ చేతి వంట తినడట మగమహారాజు అని అపర్ణ చెబుతుంది. నాకు కాలితో వంట చేయడం రాదండి అని కావ్య సెటైర్ వేస్తుంది.

కోపంగా ఉన్నారు

కావాలంటే పస్తులు ఉంటాను కానీ, నేను అన్నం తినను అని రాజ్ వెళ్లిపోతాడు. మీరేమైన గొడవ పడ్డారా అని అపర్ణ అడుగుతుంది. కవిగారి వెళ్లిపోతుంటే నేను ఆపలేదని కోపంగా ఉన్నారని కావ్య అంటుంది. వాడు ఆకలికి ఆగలేడు. వాడే మళ్లీ వస్తాడు. నువ్ కంగారుపడకు. వాడు రానప్పుడే అర్థమైంది అని అపర్ణ చెబుతుంది. మరోవైపు కింద పడుకోడానికి అప్పు రెడీ చేస్తుంది. అలాగే చూస్తూ ఉంటాడు కల్యాణ్. ఏంటని అప్పు అడిగితే ఏం లేదని సిగ్గుపడతాడు.

టెక్నికల్‌గా అయితే ఇవాళ మనకు ఫస్ట్ నైట్ జరగాలి కదా అని కల్యాణ్ అంటాడు. జరగాల్సినట్లు జరిగితే ఫస్ట్ నైట్ జరిగేది. కానీ, నేను పిజ్జా డెలీవరి చేసినంత ఫాస్ట్‌గా మన పెళ్లి జరిగింది అని అప్పు అంటుంది. ఇద్దరూ పడుకుని మాట్లాడుకుంటారు. చీరతో సతమతం అవుతుంది అప్పు. చీరను కట్టుకున్న వాన్ని తిట్టాలి అని అప్పు అంటే.. చీర మన దేశ సంప్రాదాయం అని కల్యాణ్ అంటాడు. తర్వాత ఇద్దరూ పడుకుంటారు. బెడ్‌పై పడుకోవడం అలవాటు ఉన్న కల్యాణ్‌కు కిందపడుకోవడం కష్టంగా ఉంటుంది.

ఒళ్లంతా కళ్లే

అది గమనించిన అప్పు కష్టంగా ఉందా అని అప్పు అడుగుతుంది. నువ్ పక్కనే ఉన్నావ్‌గా అని కల్యాణ్ అంటాడు. తర్వాత కవితల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత అప్పు పడుకుంటుంది. కల్యాణ్ అలాగే చూస్తూ ఉంటాడు. నువ్ అలాగే చూస్తూ ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుందని కళ్లు మూసుకునే అప్పు అంటుంది. అమ్మో.. దీనికి ఒళ్లంతా కళ్లే అని కల్యాణ్ అనుకుని పడుకుంటాడు. అలా ఇద్దరు తొలిసారి కలిసి పడుకుంటారు. మపోవైపు రుద్రాణి కంగారుగా మందు తాగుతుంటుంది. అపర్ణ, ఇందిరాదేవి అన్న మాటలు తలుచుకుని ఆవేశపడుతుంది.

నీ కోపాన్ని వైన్‌పై చూపిస్తే బాటిల్ ఖాళీ అవుతుంది కానీ. నీ కోపం తగ్గుతుందా అని రాహుల్ అంటాడు. దాంతో గ్లాస్ విసరగొట్టిన రుద్రాణి ఇన్నాళ్లు పెద్దమనిషి ముసుగులో అపర్ణ వదినా నాపై ప్రేమ చూపించింది. ఆస్తంతా తన కొడుకుకే చెందాలని చూస్తుంది. ఇన్నాళ్లు దయ చూపించి ఊరుకున్నాను. ఇక నేనేంటో చూపిస్తాను. వాళ్లు నాకు ఆస్తి ఇవ్వడం కాదు. నేను మొత్తం లాక్కుంటాను. ఇప్పుడు ఇంటి బయట వెళ్లిపోయిన కల్యాణ్ ఇంటికి రాకుండా చేకుండా చేస్తాను. ఇంటివాళ్లమీద ధాన్యలక్ష్మీ కసి పెంచకునేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది.

పిచ్చివాడిని చేసి

దాని వల్ల మనకు వచ్చేది ఏంటని రాహుల్ అంటాడు. రేయ్ కల్యాణ్ వెళ్లిపోతే మిగిలేది రాజ్ ఒక్కడే. వాన్ని ఒంటరివాన్ని చేస్తే.. ఆస్తి మొత్తానికి నువ్ వారసుడు అవుతాడు. ఇకనుంచి నా టార్గెట్ అదే. రాజ్ నుంచి కావ్యను దూరం చేసి దాన్ని కూడా ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేస్తాను. రాజ్‌ను డిప్రెషన్‌లోకి పంపించి వాన్ని పిచ్చివాడిని చేసి ఓ మూలన పడి ఉండేలా చేస్తాను అని రుద్రాణి అంటుంది. కావ్యను పంపించడం మన వల్ల అవుతుందా అని రాహుల్ డౌట్ పడతాడు.

ఇప్పటివరకు మీ మమ్మీలో ఇంటి ఆడపడుచుని చూశావ్. ఇకనుంచి నాలో ఉన్న డెవిల్‌ను చూస్తావ్ అని మరింత తాగుతుంది రుద్రాణి. మరోవైపు ఆకలి వేస్తుందని రాజ్ ఫ్రిడ్జ్‌లో చూస్తాడు. పాలు అయిన తాగి కడుపు నింపుకుందామని అనుకుంటాడు రాజ్. పాలు వేడి చేసుకుంటాడు. తర్వాత గ్లాసులో పాలు పోసుకుంటూ చేయి కాల్చుకుంటాడు రాజ్. దాంతో పాల గిన్నే కింద పడిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం