Brahmamudi August 8th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీని కొట్టిన భర్త- ఇంట్లోంచి కల్యాణ్ అప్పు ఔట్- రాజ్ కావ్యకు గొడవలు-brahmamudi serial august 8th episode kalyans firm call prakasham slaps dhanyalakshmi brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 8th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీని కొట్టిన భర్త- ఇంట్లోంచి కల్యాణ్ అప్పు ఔట్- రాజ్ కావ్యకు గొడవలు

Brahmamudi August 8th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీని కొట్టిన భర్త- ఇంట్లోంచి కల్యాణ్ అప్పు ఔట్- రాజ్ కావ్యకు గొడవలు

Sanjiv Kumar HT Telugu
Aug 08, 2024 07:46 AM IST

Brahmamudi Serial August 8th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌లో అప్పు మెడలో తాళి తెంచేందుకు ధాన్యలక్ష్మీ ప్రయతిస్తుంటే ప్రకాశం వచ్చి చెంప చెల్లుమనిపిస్తాడు. తర్వాత కల్యాణ్, అప్పు ఇంట్లోంచి వెళ్లిపోతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌ అప్పు మెడలో కల్యాణ్ తాళి కడతాడు. దాంతో కల్యాణ్‌పై కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ. నువ్ ఏం చేశావ్. తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేదా. నాకు ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది.

జాలితో కట్టలేదు

అమ్మా ఇందులో అప్పు తప్పేం లేదు. అప్పుకు నాపై ప్రేమ ఉన్న కేవలం మీరు మాటలు అంటారని, ఆఖరికి కావ్య వదినను కూడా మాటలు అంటారని ఆ కుటుంబం నన్ను దూరం పెట్టింది. కానీ, చివరికి విధి మా ఇద్దరికి ఇలా బ్రహ్మముడి వేసింది అని కల్యాణ్ చెబుతాడు. కవి ఏంటిది. ఎందుకిలా చేశావ్ అని అప్పు అడుగుతుంది. బ్రో.. నీమీద జాలితో తాళి కట్టలేదు. ఒకప్పుడు నన్ను నువ్ ప్రేమించావ్. అప్పుడు అనామిక ఆకర్షణలో పడి నేను నిన్ను ఫ్రెండ్‌గానే చూశాను అని కల్యాణ్ చెబుతాడు.

అనామిక వెళ్లిపోయాక గానీ నా మనసేంటో నాకు తెలిసి రాలేదు. అనామిక నాకు ఒక్క క్షణం కూడా గుర్తుకురాలేదు. కానీ, నీ జీవితం ఏమైపోతుందో అని, నిన్ను ఎన్ని మాటలు అంటారో అని నీ గురించే ఆలోచించాను. దాన్నే ప్రేమ అంటారని మా అన్నయ్య స్పష్టం చేస్తే గానీ నాకు తెలిసి రాలేదు. అందుకే ధైర్యంగా నీ మెడలో తాళి కట్టాను. అంతేకానీ, వీళ్ల నోళ్లు మూయించాలని, నిందలు పోవాలని కాదు. చివరికి మన ప్రేమే జయించింది. భగవంతుడి స్థానంలో మనకు న్యాయం జరిగింది అని కల్యాణ్ చెబుతాడు.

ధాన్యలక్ష్మీని కొట్టిన ప్రకాశం

నేను ఒప్పుకోను. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. అసలు ఇది పెళ్లే కాదు. నాకు ఇష్టం లేకుండా ఇది నా ఇంటికి కోడలిగా ఎలా వస్తుందో చూస్తాను. ఇప్పుడే ఈ తాళి తెంచేస్తాను అని ధాన్యలక్ష్మీ ఆవేశంగా అప్పు మెడలో ఉన్న తాళిని తెంచబోతుంది. దాంతో ధాన్యలక్ష్మీ చెంపపై కొడతాడు భర్త ప్రకాశం. దాంతో ధాన్యలక్ష్మీ పక్కకు పడబోయి ఆగి అలాగే చూస్తుంది. దానికి అంతా షాక్ అవుతారు. ఈ చెంపదెబ్బ అప్పుపై నిందలు వేసినప్పుడే చేసి ఉంటే మన కుటుంబం పరువు ఇలా అందరిముందు పోయేది కాదు అని ప్రకాశం అంటాడు.

అదేంటీ తల్లిగా ఆ మాత్రం హక్కులేదా అని రుద్రాణి అంటుంది. నోర్మూయ్.. ఇంటి ఆడపడుచు హోదా ఇచ్చాం కదా అని చిచ్చు పెడతావా. నీవల్ల ధాన్యలక్ష్మీ చెడిపోయింది. ఇంకా ధాన్యలక్ష్మీకి సపోర్ట్ చేస్తే నువ్ నీ కొడుకు కట్టుబట్టలతో బయటకు గెంటేస్తాను అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు స్వప్నను కూడా గెంటేయండి. అందరం కలిసి అడుక్కు తింటాం అని రుద్రాణి అంటుంది. నాకు తాతయ్య బోలెడంత ఆస్తి రాసిచ్చారు. నేను నా కొడుకు కూర్చుని తింటాం అని స్వప్న అంటుంది.

నింద నిజం అవుతుంది

కవిగారు ఏంటీ కవిగారు ఇది. నేను మిమ్మల్ని నమ్మాను. మీ మనసులో ఉన్నది చెప్పమన్నారు. అప్పుడు మీరు నిజం చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆరోజు నన్ను మోసం చేశారా. లేదా ఈరోజు నా చెల్లెలిని మోసం చేశారా. ఏది నిజం చెప్పండి అని కావ్య బాధగా అడుగుతుంది. వదినా మీరు కూడా ఇలా అంటున్నారా. ఎప్పుడు సపోర్ట్ చేసే మీరే ఇలా అంటున్నారా అని కల్యాణ్ అంటాడు. నేను మీ పెళ్లికి అడ్డు పడటానికి కారణం మీరు పెళ్లి చేసుకుంటే మీపై పడిన నిందే నిజం అవుతుందని కావ్య చెబుతుంది.

మీ మధ్య సంబంధం ఉంది కాబట్టే అనామికకు విడాకులు ఇచ్చి అప్పును పెళ్లి చేసుకున్నారని లోకం అనుకుంటుంది. పైగా రుద్రాణి, ధాన్యలక్ష్మీ అన్న మాట నిజం అవుతుంది. పైగా మా అమ్మనాన్న ఆస్తి కోసమే మా ముగ్గురిని మీ ఇంటికి కట్టబెట్టారని రోజు మాటలు అంటారు. మేము భరిస్తున్నాం. నా చెల్లి కూడా భరించాలా. ఇప్పుడు కోడలిగా అది వస్తే దాన్ని ప్రశాంతంగా బతకనిస్తారా. కాపురం చేసుకోనిస్తారా అని కావ్య ఆవేదనగా అంటుంది.

ఇది మన ఇల్లు

అదంతా నేను ముందే ఆలోచించాను. అందుకే ఇన్నాళ్లు వెనుకడుగు వేశాను. అప్పు ఇంట్లో నిందలు పడుతుందని తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాను. మన ఇంటికి ఎప్పుడు నేను రాను అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా. అది మన ఇల్లు. మన ఉమ్మడి ఆస్తి. ఉండేందుకు నీకు హక్కు ఉంది. నువ్ ప్రేమించిన అమ్మాయిని నీకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటావని అనుకున్నాను అని రాజ్ అంటాడు.

రేయ్ కల్యాణ్ నీకేం కర్మరా. మీ అమ్మ ఒప్పుకోకపోతే అప్పును కోడలిగా నేను ఒప్పుకుంటాను. బయట ఉండి కష్టాలు పడాల్సిన అగత్యం లేదు. అందరం కలిసే ఉందాం అని అపర్ణ అంటుంది. లేదు పెద్దమ్మ. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందనడానికి కావ్య వదినే ఉదాహరణ. మా అమ్మ మాటలతో అప్పు ప్రశాంతంగా ఉండలేదు. మా అమ్మ ఊరుకున్న రుద్రాణి అత్త లాంటి వాళ్లు చెడగొడుతూనే ఉంటారు అని కల్యాణ్ అంటాడు.

ఆత్మీయులు దూరం కావడమే

రేయ్.. బయటకు వెళ్లడానికి నన్నెందుకు అడ్డు పెట్టుకుంటున్నావ్‌రా. నువ్ బయటకు వెళ్లినా నీకు ఏదోలా సహాయం చేస్తూనే ఉంటారు. ఏదో బయట ఉన్నావని అని మాత్రమే ఉంటుంది అని రుద్రాణి అంటుంది. ఈ మాట నువ్ ఇంకా అనట్లేదా అని చూస్తున్నాను. బయటకు వెళ్తున్నాను అంటే ఈ ఇంటి నుంచి నాకు ఏ సహాయం వద్దని. ఇందరి ఆత్మీయులను దూరం చేసుకోవడమే నాకు పెద్ద నష్టం. దాని ముందు ఆస్తి ఏం లెక్కకాదు అని కల్యాణ్ అంటాడు.

అప్పు దా వెళ్దాం అని కల్యాణ్ అంటే.. బాబు మీరు మా ఇంటికి రండి. మా ఇంట్లోనే ఉండండి అని కనకం అంటుంది. లేదు ఒక ఇంటితో సంబంధం తెంచుకున్న నేను ఇంకో ఇంటితో సంబంధం పెంచుకుంటే ఇంకా చాలా ప్లాబ్రమ్స్ వస్తాయి. దయచేసి నాకు అడ్డు చెప్పకండి అని కల్యాణ్ అంటాడు. మా కూతురుకి జీవితం ఇచ్చారని సంతోషించాలో మీ కుటుంబానికి దూరం అవుతున్నారని బాధపడాలో తెలియట్లేదు. బయటి ప్రపంచం తెలియకుండా బతికారు. ఎక్కడ అని కష్టపడతారు. మీరు మా ఇంట్లోనే ఉండండి. దయచేసి ఆ అవకాశం అయినా ఇవ్వండి అని కనకం అంటుంది.

ఇల్లరికం రాను

అవును బాబు. మీరు ఉన్నంత స్వచ్ఛంగా ప్రపంచం ఉండదు. మీరు బయట కష్టాలు పడితే అది మా కూతురు వల్లే అని తెలిసి తట్టుకోలేం. మీరు మా ఇంట్లోనే ఉండండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం అని కృష్ణమూర్తి అంటాడు. నేను మా తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తిపైనే ఆధారపడట్లేదు. ఇంకా మీపై ఎలా ఆధారపడతాను. మీకు బారంగా ఎందుకు అవుతాను. నేను ఇల్లరికం అల్లుడిగా వస్తే నాకు గౌరవం కాదు. మీకు మా దుగ్గిరాల కుటుంబానికి గౌరవం కాదు అని కల్యాణ్ అంటాడు.

నేను చదువుకున్నాను. అప్పుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మీరు దిగులు పడకండి అని కనకం, కృష్ణమూర్తి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోతుంటారు కల్యాణ్, అప్పు. కళావతి వాడు వెళ్లిపోతున్నడు ఆగమని చెప్పు. నువ్ చెబితే వింటాడు. ఆగుతాడు అని రాజ్ అంటాడు. నన్ను క్షమించండి. నేను ఆపను అని కావ్య అంటుంది. ఎందుకంతా పంతం నీ మాట వాడికి వేదం. అన్ని ఉండి. అందరం ఉండి ఏం లేని పేదవాడిలా వాడు బతకాల్సి వస్తుంది అని రాజ్ బాధగా అడుగుతాడు.

చిచ్చు పెట్టి పోతున్నావ్

ఈ విషయంలో నాకు ఏ సంబంధం లేదండి. ఆ తాళి ఇచ్చి కట్టమని చెప్పింది మీరు. కావాలంటే మీరే ఆపుకోండి అని కావ్య అంటుంది. అంతా చూస్తుండగానే కల్యాణ్, అప్పు వెళ్లిపోతారు. అన్ని వదులుకుని వనవాసానికి వెళ్తున్నారు. మనం అయోధ్య ప్రజలం అయిపోయాం అని ఇందిరాదేవి అంటుంది. ఈ కైకేయి మందర వల్లే కదా వెళ్తున్నారు అని ప్రకాశం అంటాడు. నా కడుపున చిచ్చు పెట్టి పోతున్నావ్‌గా పోరా పో అని ధాన్యలక్ష్మీ అంటుంది.

కట్ చేస్తే జరిగినదాని గురించి ఓ చోట కూర్చుని అప్పు, కల్యాణ్, దుగ్గిరాల కుటుంబం, కనకం కృష్ణమూర్తి ఆలోచిస్తుంటారు. బ్రో అని కల్యాణ్ పిలిస్తే.. ఇంకా బ్రో ఏందిరా భయ్ అని అప్పు అంటే.. ఇంకా రా ఎందిరా భయ్ అని కల్యాణ్ అంటాడు. దాంతో ఇద్దరూ నవ్వుకుంటారు. నీలో చాలా ధైర్యం ఉంది. అందరిని ఎదిరించే బలం ఉంది అని అప్పు అంటుంది. నువ్వేంటీ కొత్తగా మాట్లాడుతున్నావ్ అని కల్యాణ్ అంటే.. ఏమో పెళ్లి అయితే అమ్మాయిలందరు మారిపోతారేమో అని అప్పు అంటుంది.

వారసుడు ఎలిమినేట్

ఇద్దరూ జరిగినదాని గురించి మాట్లాడుకుంటారు. చీకటి పడుతుంది ఎక్కడికి వెళ్లాలో ఆలోచించావా అని అప్పు అడుగుతుంది. ఫ్రెండ్‌కు కాల్ చేసిన కల్యాణ్ తన గెస్ట్ హౌజ్ గురించి అడుగుతాడు. అయితే అది లీజ్‌కు ఇచ్చినట్లు కల్యాణ్ ఫ్రెండ్ చెబుతాడు. ఒక దారి ఉందని కల్యాణ్‌కు చెబుతుంది అప్పు. మరోవైపు అందరూ బాధపడుతుంటే రుద్రాణి సంతోషపడుతుంది. ఇదే కదా కోరుకుంది. ఒక వారసుడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక కావ్యను, రాజ్‌ను తప్పిస్తే సరి అని రుద్రాణి అనుకుంటుంది.

ఎందుకు అందరూ బాధపడుతున్నారు. అనుకున్నదే కదా జరుగుతుంది. ఈ ఇంటి చరిత్ర కనకం ఇంట్లో రాసి ఉంది. ఈ ఇంటి కొడుకులను ఆ ఇంటి కూతుళ్లకు ఇవ్వాలని ఉంది అని రుద్రాణి గొడవపెట్టేందుకు ట్రై చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో నీకు సంతోషంగా ఉందా. రాజ్ నువ్ కలిసి అనుకున్నది చేశారు కదా అని కావ్యను నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు కల్యాణ్‌ను ఇంటికి తీసుకు రావాలని కావ్యతో రాజ్ అంటాడు. కానీ, కావ్య ఒప్పుకోదు. దానికి ఇద్దరూ గొడవపడతారు.