Brahmamudi August 7th Episode: బ్రహ్మముడి- అందరిముందే అప్పును పెళ్లి చేసుకున్న కల్యాణ్- ఇక నుంచి కవి అప్పు వేరు కాపురం!-brahmamudi serial august 7th episode kalyan marries appu and leaving duggirala family brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 7th Episode: బ్రహ్మముడి- అందరిముందే అప్పును పెళ్లి చేసుకున్న కల్యాణ్- ఇక నుంచి కవి అప్పు వేరు కాపురం!

Brahmamudi August 7th Episode: బ్రహ్మముడి- అందరిముందే అప్పును పెళ్లి చేసుకున్న కల్యాణ్- ఇక నుంచి కవి అప్పు వేరు కాపురం!

Sanjiv Kumar HT Telugu
Aug 07, 2024 08:20 AM IST

Brahmamudi Serial August 7th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌లో అప్పును అనామిక నుంచి హీరోలా వచ్చి కాపాడుతాడు కల్యాణ్. తర్వాత పెళ్లి మండపంలో అందరికి జరిగింది చెబుతాడు. అప్పుడే రాజ్ తాళి అందించడంతో అప్పును పెళ్లి చేసుకుంటాడు కల్యాణ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పు తల్లిదండ్రులను రుద్రాణి నానా మాటలు అంటుంది. దాంతో రుద్రాణి కొడుకు క్యారెక్టర్ ఏంటో చెబుతూ ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. వాళ్లను అంటున్నావ్ నీ చరిత్ర ఏమైనా గొప్పదా. నువ్ భర్తను వదిలేసిన ఆడదానివి నువ్వు. నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవనేకూడదు. పొద్దున్నే లేచి నీలాంటి నీచమైన మొహం చూస్తేనే అరిష్టం అని ఇందిరాదేవి కూతురుపై కోప్పడుతుంది.

కడుపు కోత తాకితే

ఇద్దరికిద్దరు చేరి ఈ పెళ్లి చెడగొట్టారు. మీ మాటల వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. మీరు అన్నట్లు కాకుండా అప్పు ఏదైనా ప్రమాదంలో పడి తిరిగి వస్తే ఇన్ని నిందలు వేసిన మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. వీళ్లు అనుభవించే పేదరికతం తన పిల్లలు అనుభవించకూడదు అని ప్రతి తల్లి కోరుకుంటుంది. అందులో తప్పేం లేదు. కూతురు కనిపించకా.. ఈ పెళ్లి ఆగిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఈ తల్లిదండ్రుల కడుపు కోతే గనుక మీకు తాకితే ఆ ఆసురు మీకు ఏదో రూపంలో తాకకుండా పోదు అని ఇందిరాదేవి అంటుంది.

ఇది నేను పెట్టే శాపం కాదు. గుళ్లో దేవుడే అంతా చూస్తున్నాడు. వింటున్నాడు. నా మనవరాలిని ఇంకొక్క మాట అంటే ఊరుకోను. చెంప పగులగొడతాను అని ఇందిరాదేవి అంటుంది. కావ్యను అని అని నా మనసు విరిచేశారు. దేవుడు దయ వల్ల ఆ ఊబి నుంచి బయటపడ్డాను. స్వప్న కరెక్టే మాట్లాడుతుంది. రాహుల్ లాంటి భర్తతో సర్దుకుపోయి బతకడమే గొప్ప. ఇంకెప్పుడు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడకండి. ఆ తల్లి గర్భశోకం తగిలితే మీకే ప్రమాదం అని అపర్ణ చెబుతుంది.

హీరోలా కల్యాణ్ ఎంట్రీ

మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయినట్లు అనామికకు కాల్ వస్తుంది. దాంతో సంతోషించిన అనామిక నీ పెళ్లి ఆగిపోయిందని అప్పుకు చెబుతుంది. పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం కరెక్టే అని వెటకారంగా అంటుంది అనామిక. నా పెళ్లి సంగతి సరే నా నుంచి నిన్నెవరు కాపాడుతారు అని అప్పు అంటుంది. అసలు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు అని అనామిక అంటుంది. అప్పుడే డోర్ తెరుచుకుంటంది. కల్యాణ్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. కల్యాణ్‌ను చూసి అనామిక కంగుతింటుంది.

తర్వాత అబ్బో నీ ఫ్రెండ్ కనిపించకపోయేసరికి నా దగ్గరే ఉంటుందని బాగానే గెస్ చేశారు మొగుడు గారు. సారీ సారీ మాజీ మొగుడు గారు అని అనామిక అంటుంది. కనిపెట్టడమే కాదు తీసుకెళ్తాను అని కల్యాణ్ అంటాడు. అది మాత్రం జరగదు. రేయ్ నా మాజీ మొగుడిని ఇలాగే కట్టిపడేయండ్రా.. కష్టంలో కూడా తోడుంటాడు అని అనామిక అంటుంది. రౌడీ పైకి వస్తే వెనుక నుంచి హీరోలా కొడతాడు కల్యాణ్. రౌడీలందరితో అదిరిపోయేలా కల్యాణ్ ఫైట్ చేస్తాడు.

డబ్బు కోసమే కదా

తర్వాత అనామిక పీక పిసకడానికి వెళ్లి ఆగిపోతాడు కల్యాణ్. నన్ను చంపేంత కోపం వస్తుందే నీకు. మరి మీరిద్దరు కలిసి నాకు ఎంత ద్రోహం చేశారు. నిన్ను ప్రేమించినా నన్ను కాదని అప్పుకు ఇంపార్టెన్స్ ఇస్తే నాకెలా ఉంటుంది. అందుకే నా జీవితాన్ని నాశనం చేసిన మీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాను అని అనామిక అంటుంది. నీది ప్రేమ అని ఎలా చెప్పుకుంటున్నావ్. డబ్బుకోసమే కదా నన్ను పెళ్లి చేసుకుంది అని కల్యాణ్ అంటాడు.

అవును డబ్బు కోసమే చేసుకున్నాను. మీ మగాళ్లు కట్నం రూపంలో తీసుకోవడంలేదా. నేను తీసుకుంటే తప్పేంటీ అని అనామిక అంటుంది. డబ్బు కావాలంటే నీ మొహంపైనే పడేసేదాన్ని అని అప్పును తీసుకెళ్తుంటే అనామిక వార్నింగ్ ఇస్తుంది. అప్పుకు ప్రమాదం ఎటు నుంచి అయినా వస్తుంది. ఎలా కాపాడుకుంటావ్ అని అనామిక హెచ్చరిస్తుంది. కాపాడుకుంటాను. నా వాళ్లు అని ఒక్కసారి అనుకుంటే ఎలాగైనా కాపాడుకుంటాను అని కల్యాణ్ అంటే.. ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని అనామిక ఛాలెంజ్ చేస్తుంది.

దిష్టి తీసి హారిత ఇవ్వాలి

అయితే రెండోసారి ఓడిపోయేందుకు రెడీగా ఉండు అని కల్యాణ్ అప్పును తీసుకెళ్లిపోతాడు. మరోవైపు నేను ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఉండి అందరి మాటలు పడాలా అని రుద్రాణి అంటుంది. నాకు తోడు ఉండకుండా వెళ్లిపోతావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీకు వీళ్లందరూ తోడు ఉన్నారు. అయినా నువ్ ఇక్కడ ఉండి ఏం లాభంలే. ఈపాటికి నీ కొడుకుకి అప్పుకు పెళ్లి అయిపోయి ఉంటుందని ఇంటికెళ్లి దిష్టి తీసి హారతి ఇవ్వాలికదా. అవన్ని రెడీ చేసుకో అని రుద్రాణి అంటుంది.

మా అమ్మ అనవసరంగా అమాయకంగా వాళ్లను సమర్థిస్తుంది కానీ, పుట్టలో ఉండాల్సిన వాళ్లు బయట తిరుగుతున్నారు. వీళ్లది మాయదారి కుటుంబం. మూడోదాన్ని కూడా అంటగట్టాలని ఎత్తు వేశారు అని రుద్రాణి అంటుంది. దాంతో స్టాప్ ఇట్ అని కల్యాణ్ అప్పుతో ఎంట్రీ ఇస్తాడు. వాళ్లిద్దరిని చూసి అంతా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ అత్త. అప్పు గురించి ఏం తెలుసు నీకు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. లేదా నోరు మూసుకుని ఉండాలి అని కల్యాణ్ ఫైర్ అవుతాడు.

కిడ్నాప్ చేశారు

ఏంటీ మా అమ్మని అంటున్నావ్. ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వచ్చింది అని రాహుల్ అంటాడు. నువ్ మీ అమ్మ చాలు అందరూ అల్లరిపాలు అవ్వడానికి అని కల్యాణ్ అంటాడు. మరి అప్పు నీతో ఎలా వచ్చింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. తెలుసు మీరంతా మేము కనపడకపోయేసరికి లేచిపోయామని నిందలు వేస్తారని తెలుసు. కానీ, అక్కడ జరిగింది వేరు అని కల్యాణ్ అంటాడు. ఏం జరిగిందిరా అని రాజ్ అడుగుతాడు.

అప్పు బుద్ధిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ, అప్పును కిడ్నాప్ చేశారు. మత్తుమందు ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు అని కల్యాణ్ చెబుతాడు. ఎవరు చేసింది అని కావ్య అడుగుతుంది. ఇంకెవరు ఈవిడ ముద్దుల కోడలు అనామిక అని కల్యాణ్ అనడంతో అంతా షాక్ అవుతారు. అనామిక లేదు ఆవకాయ లేదు. జైలుకు వెళ్లిన అనామిక వచ్చి కిడ్నాప్ చేసిందంటే నమ్మాలా నేను అని రుద్రాణి అంటుంది.

అంతా వెళ్లిపోయారా

మీరు చూశారా.. నేను చూశాను అని జరిగింది చెబుతాడు బంటి. అనామిక ఎందుకు కిడ్నాప్ చేసిందిరా అని ప్రకాశం అడుగుతాడు. ఇదిగో వీళ్లిద్దరు నూరిపోశారు కదా. అనామిక జైలుకు వెళ్లడానికి, నేను విడాకులు ఇవ్వడానికి కారణం అప్పునే అని తన పెళ్లి చెడగొట్టాలని అనుకుంది. ఆగిపోయిందా.. పెళ్లి వాళ్లు అంతా వెళ్లిపోయారా. దానికి కారణం మా అమ్మ రుద్రాణి అత్తయ్యే అయింటారు కదా అని కల్యాణ్ అంటాడు. వాళ్లిద్దరే అని స్వప్న అంటుంది.

ఆంటీ ఇదిగోండి మీ కూతురు ఎలా వెళ్లిందో అలాగే వచ్చింది. లేచిపోలేదు అని కల్యాణ్ అప్పజెబుతాడు. ఏవమ్మా ధాన్యలక్ష్మీ ఇప్పుడేం మాట్లడవు. రుద్రాణితో కలిసి నా కూతుళ్ల గురించి అన్నన్ని మాటలు అన్నావ్. పోయిన పెళ్లి కొడుకును తీసుకురాగలవా. మీరు దుగ్గిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదాన్నో నాకె తెలియదు. ఆడపుటుక పుట్టారు ఎందుకు అని కనకం ఫైర్ అవుతుంది. పెళ్లి ఆగిపోని. పెళ్లి కొడుకు వెళ్లిపోని. నా కూతురు క్షేమంగా వచ్చింది అది చాలు. దీనికి పెళ్లి జరగపోయినా పర్వాలేదు. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని కృష్ణమూర్తి అంటాడు.

ఇలా ఉండిపోవాల్సిందేనా

అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వాళ్లు ఇన్ని మాటలు అన్నారు. వాళ్లను ఏం చేయమంటారో చెప్పండి అని స్వప్న అంటుంది. ఏం లేదు. వాళ్లు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు అని కావ్య అంటుంది. వీళ్లు చేసిన పనికి అప్పు పెళ్లి ఆగిపోయింది. ఇంత జరిగికా అప్పును ఎవరు పెళ్లి చేసుకుంటారు. వీళ్లు చేసిన దానివల్ల ఎవరు ముందుకొస్తారు. అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా అని కనకం బాధగా అంటుంది. అవసరం లేదు అని రాజ్ అంటాడు. వెళ్లి తాళిబొట్టు తీసుకొచ్చి కల్యాణ్‌కు ఇస్తాడు రాజ్.

అప్పును నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎవరు మూలంగా అప్పుపై నిందలు పడ్డాయో వాడే తాళి కడతాడు అని రాజ్ అంటాడు. అంతా షాక్ అవుతారు. కట్టరా తాళి. ఎవరు అడ్డు పడతారో నేను చూస్తాను అని రాజ్ అంటాడు. దాంతో అప్పుకు కల్యాణ్ తాళి కడతాడు. ధాన్యలక్ష్మీ అడ్డుకుంటుంటే రాజ్ ఆపుతాడు. అంతా చూస్తుండగానే అప్పు మెడలో కల్యాణ్ తాళి కడతాడు. అంతా షాక్ అయి అలా చూస్తుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కల్యాణ్ వేరు కాపురం

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో మీ మనసులో ఏముందో అడిగాను. అప్పుడు చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆరోజు నన్ను మోసం చేశారు. ఈరోజు నా చెల్లెలిని మోసం చేశారా. ఏది నిజం చెప్పండి అని కల్యాణ్‌ను నిందిస్తుంది కావ్య. నా ఇష్టం లేకుండా ఇంటికి ఇది కోడలిగా ఎలా వస్తుందో నేను చూస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను అప్పును ఇంట్లోంచి తీసుకెళ్లిపోతాను అని కల్యాణ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.