Brahmamudi August 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్- రుద్రాణి మాస్టర్ స్కెచ్- లేచిపోయిన కల్యాణ్ అప్పు-brahmamudi serial august 3rd episode will kavya stop raj kalyan appu eloped raj all plans fail brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్- రుద్రాణి మాస్టర్ స్కెచ్- లేచిపోయిన కల్యాణ్ అప్పు

Brahmamudi August 3rd Episode: బ్రహ్మముడి- రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్- రుద్రాణి మాస్టర్ స్కెచ్- లేచిపోయిన కల్యాణ్ అప్పు

Sanjiv Kumar HT Telugu
Aug 03, 2024 08:36 AM IST

Brahmamudi Serial August 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ తేది ఎపిసోడ్‌లో అప్పుతో కల్యాణ్ పెళ్లి చేయించాలనుకున్న రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. కల్యాణ్‌పై అప్పుకున్న ప్రేమను కల్యాణ్‌కు కాల్ చేసి చెబుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో నువ్ ఇప్పటికీ కల్యాణ్‌ను ప్రేమిస్తున్న విషయం కల్యాణ్‌కు తెలుసా అని అప్పును స్వప్న అడుగుతుంది. తను నన్ను స్నేహితురాలిగా మాత్రమే చూస్తున్నాడు. నాపై జాలి చూపిస్తున్నాడు అని అప్పు ఉంటుంది. స్నేహమేంటీ జాలి ఏంటీ అసలు నువ్ అడిగావా అని స్వప్న అంటుంది.

సంతోషంగా ఉంటారు

కల్యాణ్‌తో నా పెళ్లి జరిగితే మాపై వేసిన నిందలు నిజమవుతాయి. అప్పుడు అమ్మనాన్నల పరువు పోతుంది అని అప్పు చెబుతుంది. తొక్కలో పరువు. కంటికి కనిపించని పరువు కోసం కళ్ల ముందున్న జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని స్వప్న అంటుంది. ఈ పెళ్లి జరగాలి. నేను అత్తారింటికి వెళ్లాలి. అలా అయితేనే అమ్మనాన్నలు సంతోషంగా ఉంటారు. నాకు కావాల్సింది ఇదే అని అప్పు అంటుంది.

నిన్ను కాదు.. నిన్ను ఇలా తయారు చేసిన కావ్యను అనాలి. దానిలాగే నీతి నిజాయితీ అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్. ఉండు ఇప్పుడే నీకు కల్యాణ్ అంటే ఇష్టమని అందరికి చెబుతాను అని అప్పు ఫోన్ తీసుకుని బయలుదేరుతుంది స్వప్న. అలా చేస్తే నేను చనిపోతాను అని అప్పు అంటుంది. దాంతో స్వప్న ఆగిపోతుంది. స్వప్న దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుని నేను చెప్తే చేస్తానని నీకు తెలుసు. దీన్ని ఇక్కడితో వదిలేయ్. కొన్ని జీవితాలు అంతే వాటిని మార్చడానికి కుదరదు అని అప్పు అంటుంది.

రుద్రాణి కొడుకా

స్వప్న వెళ్లిపోతుంది. మరోవైపు పెళ్లికొడుకు వైపు వాళ్లు వస్తే కనకం వాళ్లు హారతి పట్టి ఆహ్వానిస్తారు. ఇంతలో ధాన్యలక్ష్మీని పక్కకు తీసుకెళ్లిన రుద్రాణి నువ్ చాలా సంతోష పడుతున్నట్లు ఉన్నావ్. కానీ, రాజ్‌ మాత్రం కల్యాణ్‌ను అప్పుతో పెళ్లి చేయించాలని చూస్తున్నాడు అని అంటాడు. కనకంలాగా ప్లాన్స్ వేసి రాజ్ పెళ్లి చేయడు. తమ్ముడి మీద ప్రేమతో కావ్యపై కోప్పడ్డాడు కానీ, మరి పెళ్లి చెడగొట్టడానికి రాజ్ ఏమైనా రుద్రాణి కొడుకా ఏంటీ అని ధాన్యలక్ష్మీ పంచ్ ఇస్తుంది.

హేయ్.. మధ్యలో నా కొడుకును ఎందుకు తీసుకొస్తావ్. కానీ, నాకు ఎప్పుడు కుడి కన్ను అదిరినా ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఇవాళ కుడికన్ను పదే పదే అదురుతుంది అని రుద్రాణి చెబుతుంది. ఎవరైనా సమస్యల్లో ఉంటే నీకు కన్ను కొట్టడం అలవాటే కదా. నీకు కుడికన్ను అదిరితే నీకు చెడు జరగదు. ఎదుటి వాళ్లకు మంచి జరుగుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏమో ఏమైనా జరగొచ్చు. ఇదివరకు అయినా పెళ్లిళ్లు లాగే అప్పు పెళ్లి కల్యాణ్‌తో జరగొచ్చు అని రుద్రాణి అంటుంది.

తమ్ముడిలా చూసుకుంటుంది

నువ్ ఊకో రుద్రాణి. ఎప్పుడు ఏదోటి చెబుతూనే ఉంటావ్. ఇంట్లో ఉన్న కల్యాణ్ ఇంతమందిని దాటి ఇక్కడికి వచ్చి ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు శ్రీరామ్ కాళ్లు బంటీ కడిగి నెత్తిన చల్లుకుంటాడు. మా అప్పుకు తోడబుట్టినవాళ్లు ఎవరు. వీడినే చిన్నప్పటి నుంచి సొంత తమ్ముడిలా చూసుకుంటుంది అని కనకం చెబుతుంది. తర్వాత కల్యాణ్‌కు స్వప్న కాల్ చేసి ఓ ముఖ్యమైన విషయం చెబుతాను. జాగ్రత్తగా విను అని అంటుంది.

నువ్ అప్పు గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ అప్పు నిన్ను ఇప్పటికి ప్రేమిస్తుంది అని స్వప్న చెబుతుంది. అది నాకు తెలుసు అని కల్యాణ్ అంటాడు. అప్పు మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉండి నీ ఫొటోలు డిలీట్ చేస్తూ ఏడుస్తూ కూర్చుంది. తన మనసులో నిన్ను పెట్టుకుని వేరొకరితో పెళ్లికి సిద్ధమై అప్పు పెద్ద తప్పు చేసింది అని స్వప్న అంటుండగా.. రాజ్ వచ్చి వింటాడు.

ఇలాగే వదిలేస్తావా

నువ్ చెప్పు నువ్ అప్పును ప్రేమిస్తున్నావా అని స్వప్న అడిగితే.. కల్యాణ్ సైలెంట్‌గా ఉంటాడు. నీ మౌనమే సమాధానం చెబుతుంది. ఇద్దరూ ప్రేమించుకుని ఎవరి కోసం త్యాగాలు చేస్తున్నారు. ఏం జరిగినా అప్పు మాత్రం సంతోషంగా ఉండాలని పదే పదే చెబుతావే. ఇదేనా సంతోషంగా చూసుకోవడం. పదిమంది కోసం ఇలాగే వదిలేస్తావా. ఎవరి కోసమో త్యాగాలు చేస్తూ పోతే మనం ఒంటరిగా మిగిలిపోతాం. తర్వాత మిగిలేది బాధ మాత్రమే అని స్వప్న అంటుంది.

నా చెల్లి బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు చెప్పా. తర్వాత ఏం చేయాలనేది నువ్ ఆలోచించుకో అని స్వప్న కాల్ కట్ చేస్తుంది. అదంతా విన్న రాజ్ ఇక అప్పు కల్యాణ్‌ను నమ్ముకుని లాభం లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి అని రాజ్ అనుకుంటాడు. అప్పు పెళ్లి చేసుకోడానికి సిద్ధపడింది అంటే నన్ను మర్చిపోతుంది అనుకున్నా. ఇంకా నా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అంటే నేను ముందడుగు వేయకపోతే నా ప్రేమకు అర్థం లేదు అని కల్యాణ్ అనుకుంటాడు.

తాళం వేసిన రుద్రాణి

అన్నయ్య చెప్పింది నిజమే. ఈ రెండు కుటుంబాల గురించి ఆలోచించి మేము ఇద్దరం బాధపడి ఆగిపోవడం వల్ల మా ఇద్దరికి నష్టమే. ఏదైతే అది జరిగింది. ఎలాగైనా ఆ పెళ్లి ఆపేసి.. అప్పును తీసుకురావాలి అని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు కల్యాణ్. కానీ డోర్ రాదు. డోర్‌కి లాక్ వేసి ఉంటుంది. మరోవైపు ఇల్లుకు తాళం వేశావా అని రుద్రాణిని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. వేశాను. ఆ తాళాన్ని కూడా నా తాళం గుత్తికి తగిలించుకున్నా అని రుద్రాణి చూపిస్తుంది.

ఇంటి నుంచి వస్తూ ఇదొక మంచి పని చేశాం. లేకుంటే టెన్షన్ పడి చచ్చేవాళ్లం అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు ఇప్పుడు బయటకు ఎలా వెళ్లాలి అని కల్యాణ్ ఆలోచిస్తాడు. మరోవైపు శ్రీరామ్‌ను రాజ్ కలిసి ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాజ్ అంటాడు. మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని మా తమ్ముడు కల్యాణ్ ప్రేమిస్తున్నాడు. అప్పు కూడా ప్రేమిస్తుంది. ఇంట్లోవాళ్ల కోసం ఈ పెళ్లి చేసుకుంటుంది అని రాజ్ అంటాడు.

పెళ్లి కొడుకు గది ఇది కాదు

లేదు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందాకా నేను అప్పుతో మాట్లాడాను. తను చాలా సంతోషంగా ఉందని, నాతో పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. నాకు అప్పు గురించి, కల్యాణ్ గురించి ముందే తెలుసు. అప్పు మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకుంటుందని తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను శ్రీరామ్ చెబుతాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో శ్రీరామ్ తండ్రి వచ్చి పెళ్లి కొడుకు గది ఇదికాదని తీసుకెళ్తాడు.

అసలు అప్పుకు బుద్ధిలేదు. ఇష్టం లేదని పెళ్లి కొడుకుకే చెబుతుందా. ఉన్న ఒక్క అవకాశాన్ని దూరం చేసింది. అసలు కళావతిని అనాలి. ఇదంతా తన ట్రైనింగే అని రాజ్ అంటాడు. అప్పుడే వచ్చిన కావ్య అదంతా విని.. అన్ని ప్రయత్నాలు చేశారు. మీరు ఈ పెళ్లి చూడటానికి రాలేదా. ఆపేందుకు వచ్చారా అని అంటుంది. నీకు తెలియకుండా ఇద్దరి జీవితాలను నాశనం చేస్తున్నావ్ అని రాజ్ అంటాడు. నేను నా కుటుంబ పరువు కాపాడుతున్నాను అని కావ్య అంటుంది.

ధాన్యలక్ష్మీకి డౌట్

నేను ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాను అని రాజ్ అంటే.. నేను మిమ్మల్ని ఆపుతాను అని కావ్య సవాల్ చేస్తుంది. అది చూద్దాం అని రాజ్ అంటే.. చూసుకుందామని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటికి రెండో తాళం ఉంది కదా. అది ఎక్కడ ఉందో. నానమ్మ దగ్గరే ఉండాలి అని ఇందిరాదేవికి కాల్ చేస్తాడు కల్యాణ్. కానీ, సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఇద్దరికీ సరిగా వినిపించదు. తర్వాత పక్కకు వెళ్లి ఇందిరాదేవి మాట్లాడుతుంది.

మన ఇంటికి రెండో తాళం ఎక్కడుంది అని కల్యాణ్ అడుగుతాడు. అప్పుడు అటు నుంచి ధాన్యలక్ష్మీ వస్తుంది. కాస్తా ఆలోచించి తన రూమ్‌లోని డ్రాలో ఉందని ఇందిరాదేవి చెబుతుంది. కల్యాణ్ కాల్ కట్ చేస్తాడు. ధాన్యలక్ష్మీ వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇందిరాదేవి చెప్పబోతుంటే.. కనకం వచ్చి అమ్మా మీకోసమే వెతుకుతున్నాను. పంతులు గారితో గౌరీ వ్రతం సాంప్రదాయ ప్రకారమే జరగాలని చెప్పారట కదా. మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెబుతుంది.

అస్తమానం కాల్స్ చేస్తుంటారు

దాంతో ఇందిరాదేవి వెళ్లిపోతుంది. రుద్రాణి వచ్చి ఎందుకు అంత కంగారుపడుతున్నావ్ అని అడుగుతుంది. అత్తయ్యకు ఫోన్ వచ్చింది. ఎవరా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరైతే నీకెందుకు దాంట్లో కంగారు ఎందుకు అని రుద్రాణి అంటుంది. అందరం ఇక్కడే ఉన్నాం. అత్తయ్యకు కాల్ వచ్చిందంటే కల్యాణ్ అయి ఉంటాడు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. మా అమ్మకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అస్తమానం కాల్ చేస్తూ ఉంటారు. తాళం వేశాం కదా. ఇప్పుడు ఆలోచించాల్సింది అప్పు గురించి అని వెళ్లిపోతారు రుద్రాణి, కల్యాణ్.

మరోవైపు తాళం తీసుకుని కల్యాణ్ బయటకు వస్తాడు. మరోవైపు ఏం చేయాలా అని రాజ్ ఆలోచిస్తుంటాడు. అందరి కళ్లు కప్పైన సరే వీరిద్దరి పెళ్లి జరిపించాలి. ముందు ఇక్కడి నుంచి అప్పును తప్పించాలి. అలా చేయాలంటే ముందు అప్పును ఒప్పించాలి అని రాజ్ అనుకుంటాడు. అప్పు గది పక్కకు వెళ్తాడు రాజ్. కానీ, అక్కడ అప్పు ఉండదు. కావ్య ఉంటుంది. అప్పు నేను రాజ్‌ని. నీకు అసలు తలకాయ ఉందా. ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.

మెంటల్ కేసు కళావతి

మనసులో కల్యాణ్‌ను పెట్టుకుని ఇంకొకరితో ఎలా తాళి కట్టించుకుంటావ్. జీవితాంతం ఎలా ఉంటావ్. మధ్యలో మీ కళావతి ఒక మెంటల్‌ది. ఎవరినీ అర్థం చేసుకోరు. మీరు సుఖంగా ఉండలేరు. నీకు ఇదే చివరి అవకాశం. టైమ్ కూడా లేదు. నా మాట మీద నమ్మకం ఉంటే ధైర్యం చేయి. నిన్ను కల్యాణ్ దగ్గరికి తీసుకెళ్తాను. బయట కారు ఆపుకుని వెయిట్ చేస్తుంటాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆ మెంటల్ కేస్ కళావతికి తెలియకూడదు. సరేనా అని రాజ్ అంటాడు.

హుమ్ అని ఒక గొంతు వినిపిస్తుంది. దాంతో హమ్మయ్యా ఒప్పేసుకుంది. సరే చూస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. రాజ్ కారులో ఉంటే.. కావ్య వచ్చి ఎక్కుతుంది. జర జల్దీ పోనీయ్ బావ అని అప్పు గొంతులా కావ్య అంటుంది. దాంతో ఓకే అని కారు స్టార్ట్ చేస్తాడు రాజ్. ఇంతలో ప్రకాశం వచ్చి అడ్డుపడతాడు. ఈ సమయంలో ఎక్కడికి ఎందుకు అని అడుగుతాడు. చాలా అర్జంట్‌ అని రాజ్ అంటాడు. ఏంటా అర్జంట్ అని ప్రకాశం అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కచ్చితంగా వెళ్లిపోయారు

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు ఉంటాడు. కానీ, అప్పు గదిలో కనిపించట్లేదని స్వప్న చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అప్పు కోసం అంతా వెతుకుతారు. ఎక్కడని వెతుకుతారు. ఇక్కడ అప్పు కనిపించట్లేదు. అక్కడ కల్యాణ్ కనిపించట్లేదు. ఇద్దరూ కలిసి కచ్చితంగా వెళ్లిపోయారు అని ధాన్యలక్ష్మీ కోపంతో అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మరోవైపు కల్యాణ్ కారులో వెళ్లడం చూపిస్తారు. చూస్తుంటే ఇద్దరూ లేచిపోయినట్లు తెలుస్తోంది.