Brahmamudi August 9th Episode: బ్రహ్మముడి- తల్లి మాటలకు ఏడ్చేసిన రుద్రాణి- కావ్యను తిట్టిన చిన్నత్త- ఇరుకు గదిలో కల్యాణ్-brahmamudi serial august 9th episode a concern for murthy kanakam rudrani get emotional brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 9th Episode: బ్రహ్మముడి- తల్లి మాటలకు ఏడ్చేసిన రుద్రాణి- కావ్యను తిట్టిన చిన్నత్త- ఇరుకు గదిలో కల్యాణ్

Brahmamudi August 9th Episode: బ్రహ్మముడి- తల్లి మాటలకు ఏడ్చేసిన రుద్రాణి- కావ్యను తిట్టిన చిన్నత్త- ఇరుకు గదిలో కల్యాణ్

Sanjiv Kumar HT Telugu
Aug 09, 2024 07:58 AM IST

Brahmamudi Serial August 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 9వ తేది ఎపిసోడ్‌లో కావ్య, స్వప్న, కనకం, అప్పులను నానా మాటలు అంటుంది రుద్రాణి. నువ్ సొంత ఆడపడుచువి కాదు. హద్దుల్లో ఉండమని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు తల్లి మటాలకు రుద్రాణి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 9వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 9వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌ దుగ్గిరాల ఇంట్లో కనకం ఇంటిని, ఆ ఇంటి ఆడపిల్లలను ఏదో అంటూ పుల్లలు పెడుతుంది రుద్రాణి. ఈ ఇంటి కొడుకులు కనకం ఇంటి కూతుళ్లతో రాయబడింది అని నానా మాటలు అంటుంది రుద్రాణి. అంతా అయిపోయింది. ఏదైతో జరగకూడదు అని ఇంతకాలం నా కొడుకును వెనక్కి లాగానే అదే జరిగింది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

సంతోషంగా బతుకుతాడు

స్నేహం స్నేహం అని చెప్పి ఈ కన్నతల్లికే ద్రోహం చేసి వెళ్లాడు. నా కడుపులో చిచ్చు పెట్టాడు అని ధాన్యలక్ష్మీ ఏడుస్తూ చెబుతుంది. ఎందుకు ఏడుస్తావ్. నీ మనసులో ఏముందో చెప్పావ్ కానీ, వాడి మనసు అర్థం చేసుకున్నావా. నీ ఇష్టాలు రుద్దావ్. నీకోసం ఇన్నాళ్లు భరించాడు. అప్పు దూరమవుతుందని తెలిసి బయటపడ్డాడు. ఇకనుంచి వాడు చాలా సంతోషంగా బతుకుతాడు అని ప్రకాశం అంటాడు. ఏముందని బతుకుతాడు ఏం చేసి బతుకుతాడు. రోడ్డు పడ్డాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఆ అప్పు అనే మహమ్మారి దాపరించినప్పటినుంచి వాడి బతుకు బజారున పడుతూనే ఉంది. ఇప్పుడు రోడ్డున పడింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇది అనుకోకుండా జరిగింది. కల్యాణ్ ఎక్కడున్న వాడు దుగ్గిరాల వారసుడే. ఈ కోపాలు పంతాలు ఎప్పుడు ఉండవు. వాళ్లు ఎప్పటి నుంచో ఇష్టపడుతూనే ఉన్నారు. కానీ, మనకు నచ్చదని వాళ్లు బయటకు చెప్పాలి. ఇప్పుడు వాడు కోరుకుంది. వాడు సంతోషంగా ఉంటాడు అని సుభాష్ అంటాడు.

ఆస్తి దోచుకున్నామా

ఆస్తులు, తల్లిదండ్రులను వదిలేసి ఏం సుఖంగా ఉంటాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇదంతా రాసి పెట్టిందే. ఓసారి అన్నయ్యకు. ఓసారి నీకు ఇప్పుడు నీకు. దీనంతటికి సూత్రధారులు కావ్య స్వప్న ఆ అప్పు. వీళ్లు మన ఇంటి సంతోషాన్ని, ఆస్తులను బొమ్మలు అమ్ముకున్నట్లు అమ్మెస్తున్నారు అని రుద్రాణి అంటుంది. ఇంకా.. నీ కొడుకు ఆస్తి దోచుకున్నామా, నీ మొగుడు ఆస్తి దోచుకున్నామా, ఈ దుగ్గిరాల ఇంటి ఆస్తి దోచుకున్నామా అని స్వప్న అంటుంది.

నీ కొడుకు మోసం చేస్తే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను మోసపోయాను కాబట్టి కావ్య పెళ్లి జరిగింది. నాకు ఇష్టం లేకున్నా ఈ మోసగాడిని పెళ్లి చేసుకున్నాను. కావ్యకు ఇష్టంలేని పెళ్లే జరిగింది. ఇప్పుడు జరిగిందే అసలైన పెళ్లి. మా మూడు జంటల్లో అప్పు కల్యాణ్‌కే న్యాయం జరిగింది. ఉన్నా లేకున్నా వాళ్లు ఆనందంగా ఉంటారు అని స్వప్న అంటుంది. ఏయ్ నోర్మూయ్. మీరు ఎంత మోసం చేసి పెళ్లి చేసుకున్నారో మర్చిపోయారా అని రుద్రాణి అంటుంది.

మీరంతా మంత్రగత్తెలు

అవును మోసమే చేశాం అయితే ఇప్పుడు ఏంటీ. ఇప్పుడు జరగాల్సింది కాకుండా సంవత్సరం క్రితంది తవ్వుతున్నారు. అందరి మనసులు విరిచేయాలని చూస్తున్నారు. ఎవరు ఎవరికి ముసుగు వేసి మోసం చేశారో అందరికీ తెలుసు అని కావ్య అంటుంది. షటప్. రాజ్ నీవైపు ఉండేసరికి నీకు ఎవరన్న లెక్కలేకుండా పోతుంది. మీరంతా మంత్రగత్తెలు. మీ మాయలతో మీవైపు తిప్పుకుంటారు అని రుద్రాణి అంటుంది. నోర్మూస్తావా. ఇక్కడ ఒక తల్లి ఏడుస్తుంది. తండ్రి కొడుకు బెంగపెట్టుకున్నాడు అని స్వప్న అంటుంది.

ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అని స్వప్న అంటుంది. దాంతో రాహుల్ ఫైర్ అవుతాడు. అప్పు వల్లే కదా కల్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు అని రాహుల్ అంటాడు. నీకు మెదడు ఉందా. ఇప్పుడు తప్పు ఎవరిది అని మాట్లాడట్లేదు. అందరూ బాధలో ఉన్నారు. దాన్ని మీ అమ్మను అనుకూలంగా మార్చుకోవద్దని చెబుతున్నాను అని స్వప్న అంటుంది. రుద్రాణి, రాహుల్ మీరిద్దరు కాస్తా సైలెంట్‌గా ఉంటారా. అప్పుపై ప్రేమను వాడు చివరి వరకు గ్రహించకపోవడం వాడి తప్పు అని ఇందిరాదేవి అంటుంది.

న్యాయం ఎవరు చేస్తారు

అనామిక విడాకుల తర్వాత కల్యాణ్‌పై ఉన్న ప్రేమను చెప్పకపోవడం అప్పు తప్పు. అప్పుడు ఏం చేసి అయినా పెళ్లి చేసేవాళ్లం. ఇలా హఠాత్తుగా పెళ్లి అయిపోయి వాడు వెళ్లిపోయేలా చేసేవాళ్లం కాదు అని ఇందిరాదేవి చెబుతుంది. చాలా ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా. ఇష్టం లేదంటూనే, జరగదంటూనే నువ్ రాజ్ కలిసి నా కొడుకుకు అప్పును ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నాకు ఎవరు న్యాయం చేస్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇంకేం చేస్తారు. రాజ్‌ను కొంగున ముడి వేసుకుని అంతా చేసింది కావ్య. కల్యాణ్‌ను కూడా తను చెప్పినట్లుగా చేసేలా చేస్తుంది అప్పు. ఈ ఇంటికి రాకుండా కూడా చేస్తారు అని రుద్రాణి అంటుంది. దాంతో అపర్ణ ఫైర్ అవుతుంది. నీకు అన్ని విద్యలు తెలిసినట్లు మాట్లాడుతున్నావ్. మరి నువ్వెందుకు నీ మొగుడిని కొంగున ముడి వేసుకోలేదు. మా ఇంటిమీదకు వచ్చి పడ్డావ్. నా కోడలు ఏం సాధించింది. అప్పు మాత్రం ఏ సాధిస్తుంది. ఇప్పటివరకు ఓపిక పట్టాను. ఇప్పటివరకు ధైర్యం చెబుతావని చూశాను. కానీ, నువ్ అగ్గిలో ఆజ్యం పోస్తున్నావ్ అని అపర్ణ అంటుంది.

సొంత ఆడపడుచువి కాదు

పెళ్లికి అప్పుది కానీ, కనకం వాళ్లది కానీ ఎలాంటి తప్పు లేదు. కల్యాణ్‌ను పెళ్లి చేసుకోమ్మని వాళ్లు చెప్పలేదు. తమ్ముడి మనసు అర్థం చేసుకుని రాజ్ తాళి కట్టమన్నాడు. అది అందరికీ తెలుసు. ఆడపడుచు అయితే పుట్టింటి సంతోషం కోరుకోవాలి. కానీ, నువ్ మా సొంత ఆడపడుచువి కాదు. పరాయి పంచన పడి ఉండేదానివి. హద్దుల్లో ఉండు అని అపర్ణ అంటుంది. నన్ను అంత మాట అంటావా. నేను పరాయిదాన్నా. అమ్మా నాన్నా విన్నారా అని రుద్రాణి అంటుంది.

అమ్మ ఎవరు నాన్న ఎవరు. భర్తను వదిలేసి వస్తే.. ఇంతకాలం సానుభూతితో చూస్తే నిన్ను తమలో కలుపుకున్నారు. కానీ, వాళ్ల మధ్యే విభేదాలు సృష్టించాలని చూస్తే నువ్వేవరు నేను ఎవరు అని ఇందిరాదేవి కోప్పడుతుంది. దాంతో ఏడుస్తూ రుద్రాణి వెళ్లిపోతుంది. రాహుల్ కూడా వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ నువ్ దుఖంలో ఉన్నావ్. కన్నీళ్లతో ఉంటే నిజమేంటో గ్రహించలేం. కాస్తా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు. తర్వాత మాట్లాడుకుందాం అని అపర్ణ చెబుతుంది.

తప్పేం లేదు

మరోవైపు కనకం, కృష్ణమూర్తి జరిగింది తలుచుకుని బాధపడుతుంటారు. అప్పు కల్యాణ్ బయట ఎలా బతుకుతారో అని కంగారుపడతారు. అప్పుకు కష్టాలు అలవాటే. కానీ, కల్యాణే ఎలా నెట్టుకొస్తాడో అని కృష్ణమూర్తి అంటాడు. కావ్య కూడా ఎన్నడూలేనిది కల్యాణ్‌ను వ్యతిరేకించింది. అది నాకు ఆశ్చర్యంగా ఉందని కనకం అంటుంది. దానివల్ల అప్పునే అంతా తిడతారు అని కావ్య ఆవేశపడింది. దాంట్లో తప్పేం లేదని కృష్ణమూర్తి అంటాడు.

ఎలాగైనా వాళ్లను ఒప్పించి ఇంటికి తీసుకురా అని కనకం అంటే.. కోపంతో వెళ్లినవాళ్లు కొన్నాళ్ల తర్వాత తీసుకురావొచ్చు. కానీ, బాగా ఆలోచించి వెళ్లారు. రారు అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు రాత్రి అప్పు కల్యాణ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. అప్పును చీరలో చూసి తన ఫ్రెండ్ నవ్వుతాడు. రేయ్ అప్పు చీర కట్టుకుని వచ్చిందిరా అని అందరిని పిలుస్తాడు. అంతా వచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్తారు. పర్వాలేదదే నువ్ అమ్మాయిలానే ఉన్నావ్ అని ఫ్రెండ్ అంటాడు.

పాపం మీ భవిష్యత్

రేయ్ నీ తల పచ్చడి చేస్తాను అని అప్పు అంటే కల్యాణ్ ఆపి మనం మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పోవాల్సి వస్తుందని అంటాడు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అని కల్యాణ్ అంటే.. అమ్మో ఈ డెవిల్‌తోనా ఏదో మీరు ఉన్నారు అని కామెంట్ చేస్తున్నాం. లేకుంటే చంపేసేది అది. ఇలాంటిదాన్ని పెళ్లి చేసుకున్నారు. పాపం మీ భవిష్యత్ ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది అని అప్పు ఫ్రెండ్ అంటాడు. కల్యాణ్ రూమ్ చూస్తుంటే.. ఇది నీకు నచ్చలేదా మీ ఇంటికి ఈ ఇంటికి చాలా తేడా ఉంటుందని అప్పు అంటుంది.

బ్యాచ్‌లర్ రూమ్స్ అన్ని ఇలాగే ఉంటాయా అని చూస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. కానీ, మీరు ఇలాంటి రూమ్‌లో అడ్జస్ట్ అవ్వగలరా అని ఫ్రెండ్ అంటే.. లేదు బయటకొచ్చిన మాకు అదృష్టంగా ఈ రూమ్ దొరికింది అని కల్యాణ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కావ్యపై రాజ్ ఫైర్

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో తాళి కట్టమన్నది మీరు. మీ పిన్నికి భయపడి వెళ్లిపోయింది కవిగారు అని కావ్య అంటుంది. ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. నా తమ్ముడిని నువ్వే తీసుకురావాలి అని రాజ్ అంటాడు. చచ్చినా తీసుకురాను అని కావ్య అంటుంది. నా మాట విననప్పుడు నీ మాట నేనెందుకు వినాలి. వెళ్లు అని రాజ్ కోప్పడతాడు.