తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం

Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం

07 January 2023, 14:59 IST

    • Rohit Shetty Injured: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టి గాయాలపాలయ్యారు. ఆయన హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ప్రమాదానికి గురికావడంతో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్బీనగర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించారు.
రోహిత్ శెట్టి
రోహిత్ శెట్టి

రోహిత్ శెట్టి

Rohit Shetty Injured: బాలీవుడ్ డైరెక్టర్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టికి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

రోహిత్ శెట్టి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి తరహా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్‌ను చిత్రబృందం రూపొందించారు. ఈ ప్రత్యేకమైన సెట్ కోసమే మేకర్స్ 20 కోట్ల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ సెట్‌లోనే రోహిత్ శెట్టి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్, శిల్పా శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హై యాక్షన్ స్టంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కార్ ఛేజ్ యాక్షన్ సీక్వెన్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లకు ఇందులో కొదవే లేదు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.