Deepika Padukone in Singam 3: లేడీ సింగం పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ - సింగం -3 క‌న్ఫార్మ్ చేసిన రోహిత్ శెట్టి-deepika padukone plays a cop role in singam 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Deepika Padukone Plays A Cop Role In Singam 3

Deepika Padukone in Singam 3: లేడీ సింగం పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ - సింగం -3 క‌న్ఫార్మ్ చేసిన రోహిత్ శెట్టి

Nelki Naresh Kumar HT Telugu
Dec 08, 2022 02:09 PM IST

Deepika Padukone in Singam 3: ఖాకీ డ్రెస్ ప‌వ‌ర్‌ను చాటేందుకు దీపికా ప‌డుకోణ్ రెడీ అవుతోంది. లేడీ సింగంగా అవ‌తార‌మెత్తుతోంది. ఆమె పోలీస్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమా ఏదంటే...

దీపికా ప‌డుకోణ్‌, రోహిత్ శెట్టి
దీపికా ప‌డుకోణ్‌, రోహిత్ శెట్టి

Deepika Padukone in Singam 3: బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి (Rohit shetty) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సింగం, సింగం -2 సినిమాలో క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజ్‌లో మూడో భాగం రాబోతున్న‌ది. సింగం -3 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ లేడీ పోలీస్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి పేర్కొన్నాడు.

స‌ర్క‌స్ సినిమాలోని క‌రెంట్ ల‌గా రే అనే పాట‌ను గురువారం ముంబాయిలో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు దీపికా ప‌డుకోణ్ హాజ‌రైంది. ఈ సంద‌ర్భంగా సింగం -3 గురించి రోహిత్ శెట్టి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

సింగం -3లో దీపికా ప‌డుకోణ్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. పోలీస్ పాత్ర‌లో ఆమె క‌నిపిస్తుంద‌ని చెప్పాడు. సింగం సిరీస్‌లో లేడీ పోలీస్ ఎవ‌ర‌ని చాలా రోజులుగా అంద‌రూ న‌న్ను అడుగుతూనే ఉన్నారు. వారంద‌రికి నేడు స‌మాధానం దొరికింది అంటూ ఈ ఇవెంట్‌లో రోహిత్ శెట్టి వ్యాఖ్యానించాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు రోహిత్ శెట్టి చెప్పాడు.

సింగం, సింగం -2 సినిమాలో హీరో ప్ర‌ధానంగా సాగ‌గా సింగం -3 మాత్రం హీరోయిన్ క్యారెక్ట‌ర్ బేస్‌డ్‌గా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో దీపికా ప‌డుకోణ్ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

కాగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌ర్క‌స్ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ర‌ణ్‌వీర్‌సింగ్(Ranveer Singh) డ్యూయ‌ల్‌రోల్‌లో న‌టిస్తున్నాడు. క‌రెంట్ ల‌గా రే అనే పాట‌లో భ‌ర్త ర‌ణ్‌వీర్‌సింగ్‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది దీపికా ప‌డుకోణ్‌. స‌ర్క‌స్ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

IPL_Entry_Point

టాపిక్