తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varasudu Pre Release Business: వార‌సుడు ప్రీ రిలీజ్ బిజినెస్‌ - విజ‌య్ కెరీర్‌లో ఇదే హ‌య్యెస్ట్

Varasudu Pre Release Business: వార‌సుడు ప్రీ రిలీజ్ బిజినెస్‌ - విజ‌య్ కెరీర్‌లో ఇదే హ‌య్యెస్ట్

07 January 2023, 13:20 IST

  • Varasudu Pre Release Business: తెలుగులో విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సినిమాగా వార‌సుడు రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెన్ డీటెయిల్స్ ఇవే...

విజ‌య్
విజ‌య్

విజ‌య్

Varasudu Pre Release Business: ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న వార‌సుడు సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. టాలీవుడ్‌లో సంక్రాంతి పోటీ దృష్ట్యా పండుగ‌ రేసు నుంచి వార‌సుడు త‌ప్పుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ఈ పుకార్ల‌ను దిల్‌రాజు ఖండించారు. జ‌న‌వ‌రి 11న త‌మిళంతో పాటు తెలుగులో విజ‌య్ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

తెలుగు రిలీజ్ డేట్‌ను అధికారికంగా శ‌నివారం అనౌన్స్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా వార‌సుడు విజ‌య్ కెరీర్‌లో తెలుగులో అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ సినిమాగా నిలిచింది. వార‌సుడు తెలుగు వెర్ష‌న్ థియేట్రిక‌ల్ రైట్స్ దాదాపు 16 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు చెబుతున్నారు. విజ‌య్ గ‌త చిత్రం బీస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 11 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ఆ రికార్డ్‌ను వార‌సుడు అధిగ‌మించింది. 17 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది.

ఈ సినిమాను నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో దిల్‌రాజు స్వ‌యంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ బిజినెస్‌తో పాటు ఫ్యామిలీకి ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ఓ యువ‌కుడు ఎలా ప‌రిష్క‌రించాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి వార‌సుడు సినిమాను రూపొందించారు. వారిసు పేరుతో స్ట్రెయిట్‌గా త‌మిళంలో ఈ సినిమాను రూపొందించారు. వార‌సుడు పేరుతో తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. త‌మిళంతో పాటు తెలుగు ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

కాగా త‌మిళంలో సంక్రాంతికి విజ‌య్ వారిసుతోపాటు అజిత్ తునివు సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో వార‌సుడుకు పోటీగా చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం