తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nominations: బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్!

Bigg Boss Nominations: బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్!

Sanjiv Kumar HT Telugu

26 November 2024, 6:35 IST

google News
    • Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కాస్తా హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్ మరికొంత సాఫ్ట్‌గా సాగిపోయాయి. ఒక్కరోజులోనే బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్!
బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్! (Disney Plus Hotstar/YouTube)

బిగ్ బాస్ నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఎక్కువ ఓట్లు- కాళ్లు మొక్కుతానన్న గౌతమ్- 8 మంది నామినేట్!

Bigg Boss 8 Telugu 13th Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో హౌజ్‌లో మరింత ఆసక్తికరంగా విషయాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది.

నామినేషన్స్‌తోనే ప్రారంభం

బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్ హీట్ హీట్ ఆర్గ్యుమెంట్స్‌తో పాటు ఊహించని సంఘటనలతో సాగిపోయింది. అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్ ఒక్కరోజులోనే పూర్తి అయిపోయాయి. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 25 ఎపిసోడ్‌ నామినేషన్స్‌తోనే ప్రారంభం అయింది. ఎపిసోడ్ పూర్తి అయిపోయేసరికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది.

ఇద్దరికి అధిక ఓట్లు

బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ తెల్లవారు జాము మూడు గంటల వరకు జరిగాయి. అయితే, ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో యాంకర్ విష్ణుప్రియకు అధికంగా నామినేట్ ఓట్లు పడ్డాయి. ఆమెతోపాటు గౌతమ్‌కు కూడా అధికంగా నామినేషన్ ఓట్లు పడ్డాయి. విష్ణుప్రియ, గౌతమ్ ఇద్దరిని ఐదుగురు నామినేట్ చేశారు. దాంతో వీళ్లిద్దరికి హయ్యెస్ట్ ఓట్లు పడ్డాయి.

బిగ్ బాంబ్ పేల్చిన యష్మీ

విష్ణుప్రియను నబీల్, ప్రేరణ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ ఐదుగురు నామినేట్ చేశారు. అలాగే, గౌతమ్ కృష్ణను నబీల్, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ నామినేషన్స్‌లో నామినేట్ చేస్తే యష్మీ గౌడ ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్న సమయంలో బిగ్ బాంబ్ పేలుస్తూ నామినేట్ చేసింది. దాంతో అంతా కలిపి గౌతమ్‌ను ఐదుగురు నామినేట్ చేసినట్లు అయింది.

ఒరిజినల్‌గా ఉండట్లేదు

ఇక నామినేషన్స్‌లో గౌతమ్ వర్సెస్ ప్రేరణ మధ్య మంచి వాగ్వాదమే చోటు చేసుకుంది. ముందుగా టైటిల్ విన్నర్ అవ్వడం నాకు ఇష్టం లేదని, నువ్ ప్లాన్ చేసుకుని ఆడుతున్నావ్ అని, ఒరిజినల్‌గా ఉండట్లేదని గౌతమ్‌ను ప్రేరణ నామినేట్ చేసింది. దానికి బాగానే డిఫెండ్ చేసుకున్నాడు గౌతమ్. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.

కాళ్లు మొక్కమంటావా

అనంతరం కాసేపటికి ప్రేరణను గౌతమ్ నామినేట్ చేశాడు. ఎదుటి వాళ్లతో రూడ్‌గా మాట్లాడటం, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతం చూపించడం, గ్రూప్ గేమ్ ఆడటం అన్న పాయింట్స్‌తో గౌతమ్ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్ కావాలని ఏదో ఒకటి ట్రిగ్గర్ అయ్యేలా మాట్లాడి తర్వాత అని ప్రేరణ చెబుతుంటే నేను కావాలని, ట్రిగ్గర్ అవ్వాలని చేయట్లేదు ప్రేరణ. నీ కాళ్లు మొక్కమంటావా చెప్పు అని కాస్తా ఎమోషనల్‌గానే అన్నాడు గౌతమ్.

రోహిణి సేఫ్

దాంతో షాక్ అయిన ప్రేరణ తనను తాను బాగానే డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇదిలా ఉంటే, ఈ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్‌కు అధిక ఓట్లు పడగా.. అవినాష్, నబీల్, టేస్టీ తేజకు సింగిల్ ఓట్ మాత్రమే పడింది. అయితే, వారిని కూడా నామినేషన్స్‌లోకి ఉంచారు. అలా బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది ఉన్నారు. మెగా చీఫ్ కారణంగా రోహిణి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది.

8 మంది నామినేట్

దీంతో బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ, నబీల్ 8 మంది నామినేట్ అయ్యారు. వీరికి సోమవారం (నవంబర్ 25) ఎపిసోడ్ పూర్తి అయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం