Bigg Boss Elimination: ఒక్కరోజులో మారిన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 8 Elimination Twelfth Week: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం ఊహించనివిధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం ఓటింగ్ ఒక్కరోజులో మారిపోయింది. ఎలిమినేట్ అవుతారుకున్న కంటెస్టెంట్ టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూద్దాం.
Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ చివరి అంకానికి దాదాపుగా దగ్గరికి వచ్చేసింది. మరో రెండు మూడు వారాలు మాత్రమే బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ సాగనుంది. ప్రస్తుతం హౌజ్‌లో పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. సెప్టెంబర్ 2న 14 మంది హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
హౌజ్‌లో పదిమంది
ఆ తర్వాత ఐదుగురి ఎలిమినేషన్ తర్వాత అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా ఎనిమిది మంది అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా ఎలిమినేషన్స్ జరిగాయి. ఒక వారం డబుల్ ఎలిమినేషన్ కాగా గత వారం మాత్రం ఎవరు ఎలిమినేట్ కాలేదు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో పదిమంది మిగిలారు. వారిలో గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ ఉన్నారు.
రెండురోజులపాటు నామినేషన్స్
వీరికి పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 ఎక్స్ కంటెస్టెంట్స్‌తో 12వ వారం నామినేషన్స్ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు నామినేట్ అయ్యారు. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు పన్నెండో వారం నామినేషన్స్‌లో నిఖిల్, ప్రేరణ, యష్మీ, పృథ్వీ, నబీల్ ఉన్నారు.
టాప్‌లోకి ఎలిమినేషన్ కంటెస్టెంట్
మంగళవారం (నవంబర్ 19) 12వ నారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తవ్వగానే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో మొదటి రోజున చిట్ట చివరి స్థానంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5లో ఉండే ఇంటి సభ్యురాలు యష్మీ గౌడ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఒక్కరోజులో బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయింది. దాంతో టాప్ 2 ప్లేస్‌లోకి యష్మీ దూసుకొచ్చింది.
మరింత పడిపోయిన నిఖిల్
బిగ్ బాస్ తెలుగు ఓటింగ్‌లో ఎప్పటిలాగే మొదటి ప్లేస్‌లో ప్రేరణ కొనసాగుతోంది. ఆమెకు 21.44 శాతం (8,828 ఓట్లు) ఓటింగ్ నమోదు అయింది. రెండో ప్లేస్‌లోకి వచ్చేసిన యష్మీ గౌడకు 20.9 శాతం ఓటింగ్, 8,606 ఓట్లు పడ్డాయి. అలాగే, మూడో స్థానంలో నబీల్ 20.43 ఓటింగ్, 8,411 ఓట్లతో కొనసాగుతున్నాడు. కానీ, టాప్ 2లో ఉన్న నిఖిల్ ఒక్కసారిగా నాలుగో స్థానంలోకి మరింతగా పడిపోయాడు.
డేంజర్ జోన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్
నిఖిల్‌కు 19.8 శాతం ఓటింగ్, 8,153 ఓట్లు పడ్డాయి. అలాగే, నాలుగో స్థానంలో ఉన్న పృథ్వీ ఐదో ప్లేస్‌లోకి జారిపోయాడు. పృథ్వీకి 17.43 శాతం ఓటింగ్, 7,179 ఓట్లు పడ్డాయి. అంటే, డేంజర్ జోన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నిఖిల్, పృథ్వీ ఉన్నారు. ఇలా ఒక్కరోజులో అందరి స్థానాలు మారిపోయాయి. అయితే, ఇవి అన్ అఫీషియల్ ఓట్స్ అని తెలుస్తోంది.
పృథ్వీ ఎలిమినేట్
అధికారికంగా పోల్ అయ్యే ఓట్లను దాదాపుగా బయటపెట్టరు. అన్ అఫీషియల్ ఓట్ల ప్రకారంగానే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది దాదాపుగా అంచనా వేయొచ్చు. ఈ లెక్కన ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది. అయితే, నిన్నటి (నవంబర్ 20) బిగ్ బాస్ ఓటింగ్ వరకు యష్మీనే ఎలిమినేట్ అవుతుందని సమాచారం అందింది. కానీ, నేడు మాత్రం యష్మీ టాప్ 2లో ఉంది.
విష్ణుతో గొడవ
కాబట్టి, బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది వీకెండ్ వచ్చేవరకు సస్పెన్స్‌గా మారనుంది. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 20వ తేది ఎపిసోడ్‌లో విష్ణు, యష్మీ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ గొడవ కారణంగానే యష్మీ టాప్‌లోకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది.