Bigg Boss Elimination: షాకింగ్‌గా బిగ్ బాస్ ఓటింగ్- ఈ వారం ఊహించని విధంగా ఎలిమినేషన్- ఇవాళ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss Telugu 8 Elimination Eleventh Week: బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 11వ వారం ఓటింగ్ చాలా షాకింగ్‌గా ఉంది. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాస్తా ఇవాళ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Bigg Boss Telugu 8 Elimination This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ దాదాపుగా చివరి దశకు వస్తోంది. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగులో ఫ్యామిలీ వీక్ పూర్తి అయింది. ఈ వారం అంతా ఒక్కో హౌజ్‌మేట్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి సర్‌ప్రైజ్ చేశారు. దాంతో వారమంతా ఎమోషనల్‌గా నడిచింది.
స్టాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్
ఫ్యామిలీ వీక్‌లో వచ్చే హౌజ్ మేట్ కుటుంబ సభ్యులు పొగడ్తలు, విమర్శలతో హింట్స్ ఇచ్చారు. వాటిని బట్టి వారి ఆట విధానాన్ని మార్చుకునే పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే, ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ జరిగి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఈ వారం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నామినేషన్స్‌లో ఆరుగురు
మొదటి రెండు వారాల బిగ్ బాస్ ఓటింగ్‌లో అధిక ఓట్లతో టాప్‌లో ఉండే కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. రోజు రోజుకు ఆట తీరు తగ్గుతూ చాలా వరకు డౌన్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఆరుగురు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ 8 తెలుగు 11వ వారం గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్, యష్మీ గౌడ, అవినాష్, విష్ణుప్రియ ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.
టాప్ 1లో గౌతమ్
వీరిలో నామినేషన్స్ పూర్తయిన మొదటి రోజు నుంచి గౌతమ్ కృష్ణకు అత్యధిక ఓటింగ్ నమోదు అయింది. దాంతో ఇప్పటివరకు అందరికంటే టాప్ 1 స్థానంలో నిల్చున్నాడు. గౌతమ్ తర్వాత అంతటి ఓటింగ్‌తో యష్మీ రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానం టేస్టీ తేజకు దక్కగా.. నాలుగో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నాడు.
డేంజర్‌లో ఇద్దరు
ఐదో స్థానంలో అవినాష్, ఆరో ప్లేస్‌లో అంటే చిట్ట చివరి ప్లేస్‌లో యాంకర్ విష్ణుప్రియ ఉంది. అంటే, వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం అవినాష్ రెండో సారి మెగా చీఫ్ అయ్యాడు. దాని కారణంగా అవినాష్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అందరికంటే తక్కువ ఓటింగ్ తెచ్చుకున్న విష్ణుప్రియ ఈ వారం ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.
పడిపోయిన గ్రాఫ్
బిగ్ బాస్ మొదటి వారంలో అత్యధిక ఓటింగ్‌తో మొదటి స్థానంలో దూసుకువచ్చే విష్ణుప్రియ రోజు రోజుకు ఆట తీరు తగ్గిపోయింది. కానీ, పృథ్వీతో చేసే లవ్ ట్రాక్ కారణంగా ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. హౌజ్‌లోకి గెలవాలనే ఉత్సాహం కంటే కొన్ని రోజులు ఉండి ఎంజాయ్ చేద్దామన్న ధోరణితో విష్ణుప్రియ ఉండటంతో ఆమె ఇవాళ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా వచ్చి
అంటే, ఆదివారం ప్రసారం అయ్యే ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఇవాళే షూట్ చేయనున్నారు. కాబట్టి, అలా ఈరోజే ఎలిమినేషన్ ఉండనుందన్నమాట. ఇదిలా ఉంటే, టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ టాప్ 5కి కూడా చేరుకుండానే ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. అయితే, నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది.
ఎలిమినేషన్‌ను మార్చే ఎవిక్షన్ షీల్డ్
ఒకవేళ విష్ణుప్రియ కోసం నబీల్ ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగిస్తే ఆమె సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఆమెకు బదులు మరొకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ఏదైమైనా బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఎలిమినేషన్ షాకింగ్‌గా ఉండనుందని తెలుస్తోంది.