Bigg Boss Voting: ఆడపులిలా ఆటాడిన యష్మీ.. అమాంతం పెరిగిన ఓటింగ్.. డేంజర్‌లో ఆ ఇద్దరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
Bigg Boss Telugu 8 Ninth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో యష్మీ గౌడ టాప్‌లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో పానిపట్టు యుద్ధం టాస్క్‌లో ఆడపులిలా ఆట ఆడింది యష్మీ. దాంతో ఆమెకు ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

Bigg Boss Telugu 8 Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య బీభత్సం జరిగింది. బీబీ ఇంటికి దారేది అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగానే లూడో తరహాలో గేమ్ ఉంది. కంటెస్టెంట్స్ అందరిని నాలుగు టీమ్స్‌గా విడిపోయారు. వారి మధ్య విడతల వారీగా గేమ్స్ పెట్టి అందులో గెలిచినవాళ్లు డైస్ వేస్తూ ముందుకు సాగాలి.
నీళ్లు వృథా కాకుండా
ఇందులో భాగంగా పానిపట్టు యుద్ధం టాస్క్ ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్ మెంబర్ అయిన నిఖిల్ మృగంలా రెచ్చిపోయాడు. రెడ్ టీమ్ అయిన గౌతమ్, యష్మీ, ప్రేరణపై విరుచుకుపడ్డాడు నిఖిల్. గౌతమ్‌పై గ్రడ్జ్‌తో టాస్క్‌లో యష్మీ, ప్రేరణతో రూడ్‌గా బిహేవ్ చేస్తూ గేమ్ ఆడాడు. నిఖిల్ అంతలా తమపై ఫిజికల్ అటాక్ చేస్తుంటే యష్మీ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎంతమాత్రం నీళ్లు వృథా కాకుండా గట్టి పోటీ ఇచ్చింది.
ఆడపులిలా యష్మీ
ఒక ఫైటర్‌లా యష్మీ గేమ్ ఆడింది. తన టీమ్‌ను కాపాడుకోటానికి యష్మీ ఆడపులిలా గేమ్ ఆడిందని నెటిజన్స్, రివ్యూవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే, ప్రేరణ కూడా గట్టి ఫైట్ ఇచ్చింది. యష్మీ, ప్రేరణను నిఖిల్ ఎంతలా ఫిజికల్ అయినా, లాక్కెళ్లినా కూడా వాళ్లు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, యష్మీ గేమ్ తన ఓటింగ్‌పై ఇంపాక్ట్ చూపించినట్లు తెలుస్తోంది. యష్మీకి ఒక్కసారిగా ఓటింగ్ పెరిగి టాప్‌లో దూసుకుపోతోంది.
42.8 శాతం ఓటింగ్‌తో
బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదోవారం నామినేషన్స్‌లో యష్మీతోపాటు గౌతమ్, నయని పావని, హరితేజ, టేస్టీ తేజ ఐదుగురు నామినేట్ అయ్యారు. వీరికి సోమవారం (అక్టోబర్ 28) ఓటింగ్ పోల్ ఓపెన్ అయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఓటింగ్‌లో యష్మీ గౌడ టాప్‌లో కొనసాగుతోంది. ఆమెకు 42.8 శాతం ఓటింగ్, 5,758 ఓట్లు పడి అందరికంటే టాప్‌లో ఉంది. మంగళవారం నాటి యష్మీ ఆటతో ఒక్కసారిగా ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
యష్మీ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ నిలిచాడు. అతనికి 22.34 శాతం ఓటింగ్, 3,006 ఓట్లు పడ్డాయి. అనంతరం మూడో స్థానంలో 15.1 శాతం ఓటింగ్, 2,031 ఓట్లతో టేస్టీ తేజ ఉన్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా హరితేజ (10.14 శాతం ఓటింగ్, 1,364 ఓట్లు), నయని పావని (9.63 శాతం ఓటింగ్, 1,295 ఓట్లు) ఉన్నారు. అంటే ఈ ఇద్దరు లేడి కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు.
ఈ వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరు మధ్య జరగనుందని తెలుస్తోంది. ఇలాగే ఓటింగ్ కొనసాగితే హరితేజ, నయని పావని మధ్యలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూస్తే అందరికంటే తక్కువ ఓట్లు పడిన నయని పావని ఈ వారం ఎలిమినేట్ కానుందని అంచనా వేయొచ్చు.