Bigg Boss Nominations: ఇద్దరికి విష్ణుప్రియ వెన్నుపోటు- ఈ వారం నామినేషన్స్‌లో ట్విస్ట్- నామినేట్ అయిన ఐదుగురు ఎవరంటే?
Bigg Boss Telugu 8 Nominations Ninth Week: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్ల ప్రక్రియను అంతా మెగా చీఫ్ విష్ణుప్రియ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో గౌతమ్, నబీల్ ఇద్దరికి వెన్నుపోటు పొడిచింది యాంకర్ విష్ణుప్రియ.
Bigg Boss Telugu 8 Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 28వ తేది ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ ఎన్నడు జరగని విధంగా జరిగింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ అంతా మెగా చీఫ్ విష్ణుప్రియ చేతిలో పెట్టాడు బిగ్ బాస్.
ఇద్దరికి వెన్నుపోటు
బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ఒక్క (సోమవారం అక్టోబర్ 28) నాడు మాత్రమే పూర్తిగా జరిగిపోయింది. మెగా చీఫ్ అయిన విష్ణుప్రియకు ఈ వారం ఏకంగా సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం ఏకంగా ఐదుగురుని నామినేట్ చేసే అవకాశాన్ని విష్ణుప్రియకు ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో ఆమె ముందుగా ఐదుగురుని నామినేట్ చేసింది. వారిలో తను మెగా చీఫ్ కావడానికి కారణమైన గౌతమ్, నబీల్ ఇద్దరికి వెన్నుపోటు పొడిచినట్లు అయింది.
బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది విష్ణుప్రియ. యష్మీపై అరడవం తనకు నచ్చలేదని, అశ్వాత్థామ 2.0 అని అవినాష్ అన్నప్పుడు గౌతమ్ రియాక్ట్ అయిన విధానం నచ్చలేదని చెప్పింది. దానికి ఏమాత్రం గౌతమ్ ఒప్పుకోలేదు. కానీ, గౌతమ్‌ను నామినేట్ చేసి జైలులో వేసింది విష్ణుప్రియ.
పృథ్వీతో ఉంటే
అనంతరం ప్రేరణ, నయని పావని, టేస్టీ తేజ, నబీల్‌ను నామినేట్ చేసి జైలులో వేసింది విష్ణుప్రియ. ఈ వారం నబీల్ గేమ్ చాలా డల్ అయిందని, ఫైర్ తగ్గిపోయిందని, ఎవరితో ఉండట్లేదని విష్ణుప్రియ కారణాలు చెప్పింది. దానికి పుల్ ఫైర్ అయిన నబీల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నాకు ఫైర్ ఉండటం వల్లే తాను మిరపకాయ కత్తి అందుకుని రాయల్ క్లాన్‌ను తీసేసి నువ్ మెగా చీఫ్ అయ్యేలా చేశాను, ప్రతిదాంట్లో నా పార్టిస్‌పేషన్ ఉంది, నువ్ పృథ్వీతోనే ఉంటే నేను ఎక్కడ కనిపిస్తాను అని విష్ణుకు ఇచ్చిపడేశాడు నబీల్.
అనంతరం తన నామినేషన్ ఒప్పుకోవట్లేదని చెప్పి జైలులోకి వెళ్లిన నబీల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడిన నన్ను, గేమే ఆడని ఆమె, మెగా చీఫ్ అవడానికి కారణమైన వాళ్లను నామినేట్ చేసింది, తన నుంచి ఇది ఊహించలేదు అని నబీల్ ఏడ్చాడు. నబీల్‌ను నామినేట్ చేయడంపై ఓజీ క్లాన్ కూడా విష్ణుపై అసహనం వ్యక్తం చేశారు. అలా తను మెగా చీఫ్ కావడానికి కారణమైన నబీల్‌ను నామినేట్ చేసి వెన్నుపోటు పొడిచినట్లు అయింది విష్ణుప్రియ.
ఐదుగురుని నామినేట్
అలాగే, రాయల్ క్లాన్ నుంచి చివరిలో కత్తి అందుకున్న గౌతమ్ ఓజీ క్లాన్‌లోని నిఖిల్‌కు మిరపకాయ దండ వేసి విష్ణుప్రియను సేవ్ చేసి మెగా చీఫ్ అవడానికి ఒక కారణం అయ్యాడు. అలాంటి గౌతమ్‌ను అందరికంటే ముందే నామినేట్ చేసి మరి విష్ణుప్రియ వెన్నుపోటు పొడిచినట్లు అయింది. అలా విష్ణుప్రియ ముందుగా ఐదుగురుని గౌతమ్, ప్రేరణ, నయని, తేజ, నబీల్‌ను నామినేట్ చేసింది.
ఆ తర్వాత మధ్యలో జైలు కీస్ పెట్టి అది అందుకున్న వాళ్లు ఒకరి నామినేట్ నుంచి తప్పించి వారికి బదులు మరొకరిని నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, అందులో ఒకసారి కీస్ తీసుకున్నవాళ్లు మరోసారి తీసుకోకూడదని, ఆటలో విష్ణు పాల్గొనకూడదని, మెగా చీఫ్ కారణంగా తనను నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ కండిషన్స్ పెట్టాడు.
రెండు భాగాలుగా నామినేషన్స్
ఈ ఆటలో కీస్ అందుకున్న పృథ్వీ.. నబీల్‌ను సేవ్ చేసి అవినాష్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యష్మీ.. ప్రేరణను కాపాడి, హరితేజను నామినేట్ చేసింది. తర్వాత కీస్ అందుకున్న రోహిణి.. అవినాష్‌ను సేవ్ చేసి పృథ్వీని జైలులో పెట్టింది. అనంతరం టేస్టీ తేజను కాపాడిన అవినాష్ యష్మీని నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ పృథ్వీని కాపాడి మళ్లీ టేస్టీ తేజను నామినేట్ చేసింది.
ఇలా రెండు భాగాలుగా జరిగిన బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. వారిలో ఫైనల్‌గా బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది గౌతమ్ కృష్ణ, నయని పావని, హరితేజ, యష్మీ గౌడ, టేస్టీ తేజ.
టాపిక్