Brahmamudi November 21st Episode: బ్రహ్మముడి- కావ్యకు జీవితకాలం శిక్ష- రాజ్‌తో తెగిపోయిన బంధం- పనివాడిగా మారిన కల్యాణ్-brahmamudi serial november 21st episode kanakam is shattered raj kavya relation break star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 21st Episode: బ్రహ్మముడి- కావ్యకు జీవితకాలం శిక్ష- రాజ్‌తో తెగిపోయిన బంధం- పనివాడిగా మారిన కల్యాణ్

Brahmamudi November 21st Episode: బ్రహ్మముడి- కావ్యకు జీవితకాలం శిక్ష- రాజ్‌తో తెగిపోయిన బంధం- పనివాడిగా మారిన కల్యాణ్

Sanjiv Kumar HT Telugu
Nov 21, 2024 07:15 AM IST

Brahmamudi Serial November 21st Episode: బ్రహ్మముడి నవంబర్ 21 ఎపిసోడ్‌లో తాను గెలిచేసరికి ఆఫీస్‌లో కావ్యను అవమానించి పంపించేస్తాడు. లైఫ్ టైమ్ పనిష్‌మెంట్ అని జీవితాంతం పుట్టింట్లో ఉండమని రాజ్ అంటాడు. మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర టీలు ఇస్తూ పనివాడిగా మారిపోతాడు కల్యాణ్.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 21వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 21వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో భార్యాభర్తల సవాల్‌లో రాజ్ మోసం చేసి గెలుస్తాడు. కావ్య బయటకు రాగానే అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అని రాజ్ అంటాడు. మీ పీఏ ఓదార్చుతున్నట్లుంది. ఎవరికైనా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఉంటుంది. నీకు మాత్రం లైఫ్ టైమ్ పనిష్‌మెంట్ అని రాజ్ అంటాడు.

పేరు పెట్టి పిలిచిన కావ్య

సింహంతో వేట నాతో ఆట మొదలుపెట్టకూడదు అని రాజ్ అంటాడు. సినిమా డైలాగ్స్ కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు మిస్టర్ రాజ్ గారు అని మొదటిసారి భర్తను పేరు పెట్టి పిలుస్తుంది కావ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. హీరోలు అవ్వాలంటే వాళ్లు చేసే పనిలో నిజాయతీ ఉండాలి. వాళ్లు చేస్తే పని ధర్మంగా ఉండాలి. మనం చేస్తున్న పని కరెక్ట్‌గా అనిపించాలి. నేను ఏం చెబుతున్నానో మీకు అర్థమైందనుకుంటా. మీకు ఏం కావాలో కూడా నాకు అర్థమైంది అని కావ్య అంటుంది.

అర్థమైందిగా. మరి సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోలేదా. జాలీ చూపిస్తానని అనుకున్నావా అని రాజ్ అంటే అంత కర్మ పట్టలేదని కావ్య అంటుంది. ఇంతలో ఒకతను వచ్చి కావ్య మేడమ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా రిజిగ్నేషన్ రెడీ చేశాను అని చెబుతాడు. అర్థమైందిగా. సంతకం పెట్టి బయలుదేరు అని పెన్ ఇస్తాడు రాజ్. దాంతో కావ్య అలాగే సంతకం చేస్తుంది. పందెంలో గెలిచినవాళ్లు సీఈఓ అవుతారు. ఓడిపోయినవాళ్లు ఏం చేయాలో తెలుసు కదా. ఈ కంపెనీ నుంచే కాదు. నా లైఫ్ నుంచి కూడా శాశ్వతంగా నువ్ వెళ్లిపోవాలి అని రాజ్ అంటాడు.

ఇప్పుడు బయటకు వెళ్లిపోతే ఎలా బతకాలో అని ఆలోచిస్తున్నావా. నీకు భవిష్యత్‌లో ఏ సహాయం కావాలన్న, నీ స్థాయికి తగ్గ ఉద్యోగం ఎక్కడ కావాలన్న నేను హెల్ప్ చేస్తాను అని రాజ్ అంటాడు. నాకు ఎప్పటికీ మీ సహాయం రాదు. నాకు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు. ఇంకొకరిదగ్గరికి దేహి అని అనాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది. అయితే మరి మంచిది అని చెప్పిన రాజ్ ఇక నుంచి కంపెనీకి పూర్వవైభవ వస్తుంది. నీకు ఒక చిన్న అప్రిషియేషన్ అని అందరిని పిలుస్తాడు.

కావ్యకు అవమానం

మేడమ్‌కు అందరిని ఆల్ ది బెస్ట్ చెప్పమని చెబితే అంతా సైలెంట్‌గా ఉంటారు. మేడమ్‌తోపాటు వీళ్లు కూడా వెళ్తారేమో టెర్మినేషన్ లెటర్ రెడీ చేయి అనగానే అందరూ కావ్యకు ఆల్ ది బెస్ట్ చెబుతారు. రాజ్ కూడా ఫ్లవర్ బుకే ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతాడు. ఇట్స్ టైమ్ టు లీవ్ అని రాజ్ అనగానే కావ్య వెళ్లిపోతుంది. అదంతా కావ్య అవమానంగా ఫీల్ అయి వెళ్లిపోతుంది. అందరి వెళ్లమన్న రాజ్ శ్రుతిని మాత్రం ఉండమంటాడు.

ఇక నుంచి నువ్ నా పక్కనే ఉండాలి. పీఏగా కాదు. నీ ఎక్స్ సీఈఓకు కోవర్ట్‌గా అని రాజ్ అంటే.. అది నా వల్ల కాదు సర్ అని శ్రుతి అంటుంది. నా ఎదుగుదలను రోజు అక్కడికి మోస్తూ ఉండాలి. అదే నీ డ్యూటీ అని చెప్పిన రాజ్ ప్యూన్‌ను పిలిచి సీఈఓ చైర్‌ను క్లీన్ చేయమని చెబుతాడు. తెగ బిల్డప్ ఇస్తూ ఓవరాక్షన్ చేస్తాడు రాజ్. సీఈఓ చైర్‌లో కూర్చుని ఇక నుంచి ఈ సామ్రాజ్యానికి నేనే చక్రవర్తి. నేను చెప్పినట్లే జరగాలి అని రాజ్ అంటాడు.

అక్కడ టేబుల్‌పై సీఈఓగా కావ్య నేమ్ బోర్డ్ ఉండటం చూసి ఇక ఈ ఆఫీస్‌లో నీకు చోటు లేదమ్మ అని చెత్తబుట్టలో పడేస్తాడు రాజ్. మరోవైపు లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్లిన కల్యాణ్ లిరిక్స్ ఇస్తాడు. నీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటావని నాకు తెలుసు. ఇది సక్సెస్ అయ్యేవారి లక్ష్మణం. రా నా దగ్గర ఆశీర్వాదం తీసుకో. నాలాంటి సరస్వతి పుత్రుల ఆశీర్వాదం మొక్కకు పోసే నీరులాంటిది అని లక్ష్మీకాంత్ అంటాడు. ఈ మాట సరస్వతి దేవి వింటే నిన్ను శపించిపడేస్తుంది అని పక్కన ఉన్నతను అంటాడు.

కాళ్లపై పడిన కల్యాణ్

మంచి మనసు నాకు అప్పుడప్పుడే వస్తుంది. అప్పుడే ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అని లక్ష్మీకాంత్ అంటాడు. దాంతో లక్ష్మీకాంత్ కాళ్లపై ఆశీర్వాదం కోసం పడతాడు కల్యాణ్. నీలోని సాహిత్యం పొంగి పొర్లుతూ నాకు అందించాలని ఆశీర్వదిస్తాడు. కల్యాణ్ చూస్తే జీవితాంతం కాదులేవయ్య జస్ట్ మూడేళ్లే అని లక్ష్మీకాంత్ అంటాడు. ప్రొడ్యూసర్ వస్తే మీ లిరిక్స్ పూర్తయ్యాయని చెబుతాడు. తర్వాత కల్యాణ్‌ను టీ తీసుకురమ్మంటాడు లక్ష్మీకాంత్.

ముందు తటపటాయించిన కల్యాణ్ తర్వాత తీసుకొస్తాడు. ఇతన్ని ఎక్కడో చూసినట్లుందని నిర్మాత అంటే.. ఆటో డ్రైవర్. నా దగ్గర శిష్యరికం చేస్తానని కాళ్ల వేళ్ల పడితే ఒప్పుకున్నాను. నా తదనంతరం చెప్పుకుని బతుకుతాడని జాలి పడ్డాను అని లక్ష్మీకాంత్ అంటాడు. ఆ అమ్మ పాట రాసింది ఇతనే కదా అని నిర్మాత అంటాడు. ఇంతలో కల్యాణ్ వచ్చి టీ ఇస్తాడు. ఆరోజు నువ్ రాసిన పాట చాలా వైరల్ అయిందని నిర్మాత అంటాడు.

దాన్ని తను రాసినట్లుగా కవర్ చేసుకుంటాడు లక్ష్మీకాంత్. దాంతో నిర్మాత కూడా లక్ష్మీకాంత్‌ను పొగుడుతాడు. ఇలాంటి గురువు నీకు దొరకడం నీ అదృష్టం అని కల్యాణ్‌తో అంటాడు. తర్వాత ఇందాక టీ తెమ్మనందుకు ఫీల్ అవుతున్నావా. గురువుకు చేసుకునే సేవ గురు దక్షిణ లాంటిది అని పదివేలు ఇస్తాడు లక్ష్మీకాంత్. నేను లక్ష తీసుకుని నీకు పదివేలు ఇచ్చాడని చూస్తున్నావా అని లక్ష్మీకాంత్ అంటాడు. నేను అందుకు చూడట్లేదు నేను లిరిక్ రైటర్‌గా సక్సెస్ అవుతానని నమ్మకం వచ్చిందని కల్యాణ్ అంటాడు.

కాన్పు కోసమే రావాలి

శభాష్. నీకు ఇంకో సీన్ ఇస్తాను అని లక్ష్మీకాంత్ అంటాడు. మరోవైపు కావ్య అత్తింటికి వెళ్లేందుకు అన్ని సామాన్లు రెడీ చేస్తుంటుంది కనకం. కావ్యను అత్తింటికి పంపడం ఇదే ఆఖరి సారి కావాలి. మరోసారి పుట్టింటికి కావ్య వచ్చిందంటే అది దాని కాన్పు కోసమే కావాలి అని కనకం అంటుంది. ఇంతలో కావ్య వస్తుంది. తొందరగా వెళ్లి చీర మార్చుకుని రా అని కంగారుపెడుతుంది కనకం. ఎందుకుని కావ్య అంటే.. అత్తారింటికి. బ్యాగ్‌తో సహా రెడీ చేశాను అని కనకం అంటుంది.

తీసుకెళ్లి బ్యాగ్ ఇంట్లో పెట్టు. జీవితాంతం నేను ఇక్కడే ఉండిపోతున్నాను. ఆ ఆఫీస్‌కు, ఆయనకు నేను శాశ్వతంగా దూరమైపోయాను. ఈ కావ్య ఆ దుగ్గిరాల కోడలు కాదు అని కావ్య అంటుంది. ఏం జరిగిందని అని తల్లిదండ్రులు అడుగుతారు. వాళ్లు పెట్టిన పందెంలో నేను ఓడిపోయాను. ముందుగా అనుకున్నట్లుగా ఓడిపోయిన నేను ఆఫీస్‌కు, ఆయన జీవితంలోకి వెళ్లకూడదు. ఆ విషయంలో మీ అల్లుడు గారు క్షమించండి ఆ రాజ్ గారే గెలిచారు అని కావ్య అంటుంది.

నన్ను చూపుడు వేలు చూపించి బయటకు గెంటేశారు. మా బంధం తెగిపోయింది. మీరు ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి అని లోపలికి వెళ్తుంది కావ్య. ఏంటయ్యా ఇది ఇంత ఈజీగా వదిలేసి వెళ్లిపోయింది అని కనకం అంటుంది. తనకెప్పుడో అర్థమైంది. ఆ దేవుడు దయ తనమీద లేదని, మనకే అర్థం కాలేదని కృష్ణమూర్తి వెళ్లిపోతాడు. నా కూతురు ఓడిపోయిందా. అంటే, ఇంకెప్పుడు అత్తారింటికి వెళ్లదా అని కనకం భయపడుతుంది.

ఇదేం శాడిజం

మరోవైపు కావ్య వస్తుందేమో అని అపర్ణ హారతి రెడీ చేస్తుంది. అందరు రాజ్ ఓడిపోయాడా అని సంతోషంగా అడుగుతారు. ఇంకా ఆ గుడ్ న్యూస్ రాలేదని స్వప్న అంటుంది. అప్పుడే సంబంరపడిపోతున్నారు. రాజ్ కూడా గెలిచే అవకాశం ఉంది కదా అని రుద్రాణి అంటుంది. రాజ్‌కు కాపురం నిలబెట్టుకోవాలని ఉందన్న టెన్షన్ కనిపించట్లేదని రాహుల్ అంటాడు. ఈ అక్కుపక్షులు మాట్లాడేది వినలేకపోతున్నాను. ముందు రాజ్‌కు కాల్ చేయి అని ఇందిరాదేవి అంటుంది.

రాజ్ ఓడిపోయాడన్న శుభవార్త వాడి నోటి నుంచే వినాలన్న శాడిజం నేను ఎక్కడ చూడలేదమ్మా అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. ఓడిపోయిన నా కొడుకు నా కోడలిని తీసుకొచ్చాడు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు డల్‌గా యాక్ట్ చేయాలి అని రాజ్ నిదానంగా వస్తాడు. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner