Bigg Boss Telugu 8: 25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!-bigg boss telugu 8 nabeel afridi gets one lakh above followers in instagram by bigg boss 8 telugu fourth week nomination ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: 25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!

Bigg Boss Telugu 8: 25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!

Sanjiv Kumar HT Telugu
Sep 26, 2024 06:57 AM IST

Bigg Boss Telugu 8 Nabeel Afridi Instagram Followers: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ నబీల్ అఫ్రిదికి 25 రోజుల్లో ఏకంగా లక్షన్నర ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. అలాగే, బిగ్ బాస్ 8 తెలుగు నాలుగో వారం నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి ఎగబాకాడు నబీల్.

25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!
25 రోజుల్లో పెరిగిన లక్షన్నర ఫాలోవర్స్.. నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ విన్నర్ రేసులోకి అతను!

Bigg Boss 8 Telugu Nabeel Afridi: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రచ్చ రచ్చగానే సాగుతోంది. బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో కొత్తగా చీఫ్ అయిన సీత క్లాన్‌లోకి పృథ్వీ, సోనియా మినహా మిగతా హౌజ్ మొత్తం వెళ్లాలని కోరుకుంది. కానీ, సీత క్లాన్ ఫుల్ అయ్యేసరికి యష్మీ, నాగ మణికంఠను నిఖిల్ క్లాన్‌లోకి పంపించారు.

వరంగల్ డైరీస్

ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వగా వారిలో ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. హౌజ్‌లోకి చివరి కంటెస్టెంట్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టాడు నబీల్ అఫ్రిది. వరంగల్‌కు చెందిన నబీల్ ఒక యూట్యూబర్. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తూ ఉంటాడు.

నాలుగోవారం నామినేషన్స్

అయితే, నబీల్ బిగ్ బాస్‌కు ముందు ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం చాలా మందికి టైటిల్ పేవరేట్‌గా నిలిచాడు. తన ఆట తీరుతో రోజు రోజుకి అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నాలుగో వారం నామినేషన్స్‌తో ఒక్కసారిగా టైటిల్ రేసులోకి నిలిచాడు. అందరిని ఇరిటేట్ చేసే సోనియాకు ఈ వారం నామినేషన్స్‌లో ఇచ్చిపడేశాడు.

ఓటింగ్‌లో రికార్డ్

సోనియాకు ప్రాపర్ రీజన్స్ చెప్పి.. తన స్టైల్‌లో బుద్ధి చెప్పాడు నబీల్. తర్వాత నబీల్‌కు చీఫ్ అయ్యే అవకాశం ఉన్న సోనియా ద్వారా మిస్ అయింది. లేకుంటే నబీల్ చీఫ్ అయ్యే అవకాశం ఉండేది. చీఫ్‌ కాకపోయినప్పటికీ టాస్కుల్లో మాత్రం తన హండ్రడ్ పర్సంట్ ఎఫర్ట్స్ పెడుతూ సత్తా చాటుతున్నాడు నబీల్. అందుకే ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో కూడా విష్ణుప్రియ, నిఖిల్‌ రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్‌లో దూసుకుపోతున్నాడు.

25 రోజుల్లో లక్షన్నర

అయితే, నబీల్‌కు బిగ్ బాస్‌కు రాకముందు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నాలుగున్నర లక్షల (4,50000) మంది ఫాలోవర్స్ ఉండేవారు. కానీ, ఇప్పుడు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు వారాల్లో అంటే.. సుమారు 25 రోజుల్లో నబీల్ ఫాలోవర్ల సంఖ్య 609Kకి పెరిగింది. అంటే, దాదాపుగా ఆరు లక్షలకుపైగా ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు నబీల్.

టైటిల్ విన్నర్ రేసులోకి

బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి లక్షన్నర ఫాలోవర్స్‌ను ఎవరు సంపాదించుకోలేదు. ఇది కేవలం ఒక నబీల్‌కే సాధ్యపడింది. మేల్ కంటెస్టెంట్స్‌ను తన చుట్టూ తిప్పుకునే సోనియాకు బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్‌లో నబీల్ ఇచ్చిన కౌంటర్స్‌ చాలా మందికి నచ్చింది. ఆ ఒక్క నామినేషన్స్‌తో టైటిల్ విన్నర్ రేసులోకి ఎగబాగాడు నబీల్.

టైటిల్ విజేతగా

అమ్మాయిలకు దూరంగా ఉంటు మంచి మాట, ఆట తీరుతో దూసుకుపోతున్నాడు నబీల్. గేమ్స్, టాస్క్‌ల్లో ది బెస్ట్ ఎఫర్ట్ పెడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఇలాగే తన ఆట తీరు కొనసాగితే నబీల్ బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ ట్రోఫీ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది.