Bigg Boss Prerana: ప్రేరణపై పగబట్టేసిన పృథ్వీ.. నిఖిల్‌కు వార్నింగ్.. ఏడ్చేసిన సీరియల్ హీరోయిన్, విలన్ (వీడియో)-bigg boss telugu 8 seventh week nominations yashmi prithvi vs prerana bigg boss 8 telugu october 14th episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Prerana: ప్రేరణపై పగబట్టేసిన పృథ్వీ.. నిఖిల్‌కు వార్నింగ్.. ఏడ్చేసిన సీరియల్ హీరోయిన్, విలన్ (వీడియో)

Bigg Boss Prerana: ప్రేరణపై పగబట్టేసిన పృథ్వీ.. నిఖిల్‌కు వార్నింగ్.. ఏడ్చేసిన సీరియల్ హీరోయిన్, విలన్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 Seventh Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఏడోవారం నామినేషన్స్ బీభత్సంగా జరిగాయి. గౌతమ్ నామినేషన్‌తో మొదలైన ఈ రచ్చ అలాగే సాగింది. ఈ క్రమంలోనే ప్రేరణపై విపరీతమైన పగ బట్టేశాడు పృథ్వీ. ప్రేరణ నామినేట్ అయ్యేవరకు వదలనంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

ప్రేరణపై పగబట్టేసిన పృథ్వీ.. నిఖిల్‌కు వార్నింగ్.. ఏడ్చేసిన సీరియల్ హీరోయిన్, విలన్ (వీడియో)

Bigg Boss 8 Telugu October 14th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 14వ తేది ఎపిసోడ్‌లో ఏడో వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. సోమవారం ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు ఏడో వారం నామినేషన్స్‌ను రచ్చ రంభోళ అన్నట్లుగా జరిగాయి. ఇప్పటికే నలుగురు నామినేట్ అయ్యారు. ఇంకా బిగ్ బాస్ తెలుకు 8 ఈ వారం నామినేషన్స్ ఇవాళ పూర్తి కానున్నాయని తెలుస్తోంది.

కిల్లర్ గర్ల్స్

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ కౌ గౌర్ల్ పద్ధతిలో జరిగాయి. ఇద్దరు కౌ గర్ల్స్‌ వేషంలో కిల్లర్ గర్ల్స్‌గా ప్రేరణ, హరితేజ ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. బజర్ మోగగానే పక్కన టేబుల్‌పై ఉన్న హ్యాట్ ఎవరు ముందు తీసుకుంటారో వారికి ఇతర కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన సభ్యుల నుంచి ప్రతి ఇద్దరిలో ఒక్కరిని నామినేషన్‌లో ఉంచే పవర్ ఈ కిల్లర్ గర్ల్స్‌కు ఉంటుంది.

అంటే, ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారు నామినేట్ చేయాలనుకున్న వారి పేర్లు చెప్పి పాయింట్స్ చెబుతారు. ఆ పాయింట్స్ ఎవరి అయితే వాలిడ్ అనిపిస్తాయో వారిలో ఒకరిని నామినేట్ చేస్తారు కిల్లర్ గర్ల్స్. అలాగే, వీరిలో ఎవరు తక్కువ సార్లు హ్యాట్ తీసుకుంటారో వారు నామినేషన్‌లో ఉండే రిస్క్ కూడా పెట్టాడు బిగ్ బాస్. దాంతో వీరు సేఫ్ గేమ్ ఆడకుండా ఉండేందుకు చెక్ పెట్టాడు.

అంతకుముందు పాయింట్సే

ఇక గౌతమ్‌ను రోహిణి నామినేట్ చేస్తూ ప్రారంభమైన ఈ వారం నామినేషన్స్ రచ్చ రచ్చ అయింది. అనంతరం నామినేట్ చేసేందుకు నిఖిల్, గంగవ్వ వచ్చారు. టేస్టీ తేజను నామినేట్ చేస్తూ నిఖిల్ పాయింట్స్ చెప్పాడు. బీబీ హోటల్ టాస్క్‌లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని, లో అయ్యావని అంతకుముందు నామినేషన్స్‌లో చెప్పిన పాయింట్సే చెప్పాడు నిఖిల్.

దానికి తనకు హెల్త్ అప్సెట్ అయిందని, డబ్బులు కూడా అయిపోయాయని, డబ్బులు లేనప్పుడు నేను ఎలా కంటిన్యూ చేయగలను అని సరిగ్గానే డిఫెండ్ చేసుకున్నాడు తేజ. ఇక బీబీ టాస్క్‌లో సరిగ్గా ఆడలేదని, ఎప్పుడు ఒంటరిగా సైలెంట్‌గా ఉన్నావని, లేకుంటే పోయి దమ్ముకొడతావని, ఇంట్లో పనులు కూడా చేయవని పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ.

ఆ ట్రై కూడా లేదు

తాను బాగానే పని చేశానని, మీరు చూడలేదని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు. నువ్ నాకు నచ్చలేదు నేను నామినేట్ చేస్తున్న అని గంగవ్వ తేల్చి చెప్పింది. ఇద్దరి పాయింట్స్‌లో గంగవ్వవి వాలిడ్ అనుకుని పృథ్వీని నామినేషన్స్‌లో పెట్టింది మొదట హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ. తేజ ఆరోగ్యం బాలేకున్న ట్రై చేశాడు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఆ డ్రెస్ వేసుకుని, చిప్ప పట్టుకుని కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ, నీ నుంచి మాత్రం ఎలాంటి ట్రై కూడా లేదని ప్రేరణ చెప్పింది.

దానికి కన్విన్స్ కాని పృథ్వీ.. ప్రేరణపై పగ పెంచుకున్నాడు. తర్వాతి నామినేషన్స్‌కు ప్రేరణకు హ్యాట్ దొరక్కుండా ఉండేందుకు అడ్డుగా వస్తూ ఉన్నాడు. అలా రెండుసార్లు వరుసగా హరితేజ హ్యాట్ గెలుచుకుంది. ప్రేరణ తక్కువ సార్లు హ్యాట్ గెలుచుకుంటే నామినేట్ అవుతుంది. అందుకే పృథ్వీ అలా రివేంజ్ తీర్చుకునేందుుక ప్రయత్నించాడు.

కక్ష సాధించిన పృథ్వీ

పృథ్వీని ఆపమని, తనను ఆపలేకుంటే హరితేజను అయినా అడ్డుకోమ్మని నిఖిల్‌కు చెప్పుకుంది ప్రేరణ. దాంతో పృథ్వీతో మాట్లాడేందుకు నిఖిల్ వెళ్లాడు. ప్రేరణ చెప్పింది పృథ్వీకి చెప్పాడు నిఖిల్. అలా చేశావంటే ఇక నుంచి నీకు నాకు పడతది చూసుకో అని సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చాడు పృథ్వీ. ఇలా చేయొద్దని పృథ్వీని యష్మీ కూడా బతిమిలాడుకుంది. కానీ, పృథ్వీ మాత్రం ఎవరి మాట వినలేదు.

అలాగే, నయని పావని కూడా ప్రేరణకు హ్యాట్ దొరక్కుండా ముందు వచ్చి పట్టుకుని హరితేజకు ఇచ్చింది. ఫెయిర్ గేమ్ ఆడుతూ పృథ్వీని నామినేట్ చేసినందుకు, సొంత టీమ్ తనకు హెల్ప్ చేయకపోవడం, అందరూ రివర్స్ కావడంతో ప్రేరణ ఒక్కసారిగా ఏడ్చేసింది. ఇక పృథ్వీని వదిలేయ్ వాడు వినడు. వాడికి బ్రెయిన్ లేదు, వాడేంటో తెలుసుగా అని సైగలతో చెప్పింది ప్రేరణ.

సీరియల్ యాక్టర్స్ ఏడుపు

ప్రేరణపై పృథ్వీ చేసేదానికి యష్మీ కూడా చాలా ఫీల్ అయింది. రెండుసార్లు ప్రేరణకు హ్యాట్ దొరక్కుండా చేసేసరికి యష్మీ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ ఓవైపు, అదే సీరియల్ విలన్ యష్మీ మరోవైపు ఇద్దరు ఫ్రెండ్స్ ఏడ్చేశారు.