Bigg Boss Rohini: నబీల్ ఏమైనా కాలు చాపి కూర్చున్నాడా- యష్మీకి ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి- గంగవ్వ మాస్ కౌంటర్ (వీడియో)-bigg boss telugu 8 sixth week nominations rohini avinash nominates yashmi bigg boss 8 telugu today episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Rohini: నబీల్ ఏమైనా కాలు చాపి కూర్చున్నాడా- యష్మీకి ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి- గంగవ్వ మాస్ కౌంటర్ (వీడియో)

Bigg Boss Rohini: నబీల్ ఏమైనా కాలు చాపి కూర్చున్నాడా- యష్మీకి ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి- గంగవ్వ మాస్ కౌంటర్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Oct 08, 2024 12:06 PM IST

Bigg Boss Telugu 8 Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్‌లో యష్మీకి జబర్దస్త్ రోహిణి ఇచ్చిపడేసింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో నామినేట్ చేసే క్రమంలో నబీల్ ఏమైనా కాలు చాపుకుని కూర్చున్నాడా అని యష్మీతో చెప్పి గట్టి కౌంటర్ వేసింది రోహిణి.

బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్‌
బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్‌

Bigg Boss 8 Telugu Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఫుల్ జోష్ వచ్చింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు సీజన్‌లో కళ వచ్చిందని నెటిజన్స్, బిగ్ బాస్ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హౌజ్‌లో ఉన్న ఇదివరకు కంటెస్టెంట్స్ (ఓజీ క్లాన్)కు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ (రాయల్ క్లాన్స్) గట్టి పోటీ ఇస్తున్నారు.

రెండో రోజు నామినేషన్స్

అలాగే, నామినేషన్స్‌లో కూడా ఇచ్చిపడేస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 7) నాడు ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు ఆరో వారం నామినేషన్ల ప్రక్రియ ఇవాళ (అక్టోబర్ 8 ) కూడా జరగనుంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్ ప్రోమోను తాజా విడుదల చేశారు. ఆరో వారం నామినేషన్స్ రెండో రోజున జబర్దస్త్ రోహిణి, గంగవ్వ, అవినాష్ నామినేట్ చేశారు.

యష్మీని రోహిణి నామినేట్ చేసింది. "నబీల్ అండ్ పృథ్వీ ఆడినప్పుడు ప్రేరణ సంచాలక్‌. పృథ్వీ ఓడిపోయినప్పుడు ఎందుకు ఏడ్చావ్" అని యష్మీని అడిగింది రోహిణి. "ప్రేరణను నేను తను తీసుకున్న డెసిషియన్ రాంగ్ అనలేదు" అని యష్మీ వివరణ ఇచ్చుకుంటుంటే.. "నువ్ తప్పు అనలేదు. తను తప్పు చేయమన్నావ్" అని పంచ్ ఇచ్చింది రోహిణి.

తర్వాత విష్ణుప్రియను గంగవ్వ నామినేట్ చేసింది. "నువ్ సైలెంట్‌గా కూర్చుంటుంది గేమ్.. ఆట ఆడట్లేదు. ఎందుకు ఆడట్లేదు. నీ కాళ్లు చేతులు సరిగ్గా లేవా" అని మాస్‌గా గంగవ్వ నెక్ట్స్ లెవెల్‌లో కౌంటర్ ఇచ్చినట్లు అడిగింది. విష్ణుప్రియను రోహిణి కూడా నామినేట్ చేసింది. "లోపలికి వచ్చి ఎంజాయ్ చేయమన్నారంటే.. నిన్ను ఎంజాయ్ చేసుకోమనలేదు. టాస్క్, గేమ్, ప్రతిదాంట్లో ఎంజాయ్‌‌మెంట్ వెతుక్కోమ్మని" అని రోహిణి చెప్పింది.

ఏడ్చిన విష్ణుప్రియ

"ఎక్కడ నా పర్సనాలిటీ రివీల్ అవ్వగలుగుతుందో అక్కడ నేను చూపిస్తున్నాను" అని విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంటే.. టేస్టీ తేజ నవ్వినట్లు.. అదేం ఆన్సర్ అని హరితేజ చూసినట్లుగా చూపించారు. అనంతరం పృథ్వీని అవినాష్ నామినేట్ చేశాడు. "నువ్ ఆ మూడు గంటల టాస్క్ తప్పా హౌజ్‌లో చిల్ అవుతున్నట్లు కనిపించింది" అంతే అని అవినాష్ అన్నాడు. తర్వాత విష్ణుప్రియ కాస్తా ఏడ్చినట్లుగా చూపించారు.

"నువ్ ఎందుకు నామినేట్ చేస్తున్నావో నీకు తెలియదు" అని పృథ్వీ అన్నాడు. "టాస్క్ కాకుండా ఏం చేస్తున్నావ్" అని అవినాష్ అంటే.. "ఇంకేం చేయాలి" అని పృథ్వీ అన్నాడు. "మరెందుకు వచ్చావ్" అని అవినాష్ అంటే.. "విన్ అవ్వడానికి" అని పృథ్వీ అన్నాడు. "సరే అవ్వు మరి అయితే.." అని అవినాష్ నవ్వుకున్నాడు.

తర్వాత యష్మీని రోహిణి నామినేట్ చేసే పాయింట్స్ డిస్కషన్ చూపించారు. "పృథ్వీ చాలా కష్టపడ్డాడు.. చాలా కష్టపడ్డాడు అంటే.. నబీల్ ఏమైనా కాలు చాపి కూర్చున్నాడా. ఆయన కూడా కష్టపడ్డాడు" అని రోహిణి ఇచ్చిపడేసింది. నబీల్ మెగా చీఫ్ అయినప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేసి ఉండాల్సింది కదా అని ప్రేరణతో యష్మీ గొడవకు దిగింది. ఆ విషయంపైనే యష్మీని నామినేట్ చేసింది రోహిణి.

అది గ్రడ్జ్ కాదా మరి

అనంతరం నాగ మణికంఠను తేజ నామినేట్ చేస్తుంటే ఎస్ అని సంతోషపడుతూ యష్మీ చేయడాన్ని తప్పు పట్టాడు అవినాష్. "అలా చేసి ఉండకూడదు అనిపించింది. పదిమంది ముందు దెప్పి పొడిచినట్లు అనిపించింది" అని అవినాష్ అన్నాడు. "తేజ గారు ఆ పేరు తీయగానే, ఆ పాయింట్స్ చెప్పగానే నేను ఇంప్రెస్ అయ్యాను" అని యష్మీ వివరణ ఇచ్చుకుంది.

"మణి గురించి ఎవరు చెబుతున్నారో వాళ్లకు ఇస్తున్నావంటే అది గ్రడ్జ్ కాదా మరి" అని అవినాష్ అడిగాడు. దాంతో యష్మీ ఏం మాట్లాడలేకపోయింది. అనంతరం రాయల్ క్లాన్ సభ్యులలో ఇద్దరిని మీరందరూ నిర్ణయించుకుని నామినేట్ చేయాల్సి ఉంటుందని ఓజీ క్లాన్‌కు చెప్పిన బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

Whats_app_banner