Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో దంచికొడుతోన్న గంగవ్వ.. పడిపోయిన విష్ణుప్రియ క్రేజ్.. ఈవారం ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 8 Sixth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం ఓటింగ్‌లో గంగవ్వ దంచికొడుతోంది. అందరికంటే టాప్‌లో ముందంజలో కొనసాగుతోంది. ఇక ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న యాంకర్ విష్ణుప్రియ క్రేజ్ పడిపోయింది. అయితే, బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరని చూస్తే..
Bigg Boss 8 Telugu Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్ రెండు రోజుల పాటు సాగాయి. సోమవారం (అక్టోబర్ 7) నాడు ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు నామినేషన్స్ మంగళవారం (అక్టోబర్ 8) నాటికి ముగిశాయి. బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేట్ చేసే అధికారం ముందుగా రాయల్ క్లాన్స్‌కు ఇచ్చినప్పటికీ తర్వాత ఓజీ క్లాన్‌కు కూడా ఇచ్చాడు బిగ్ బాస్.
నామినేషన్స్‌లో ఆరుగురు
రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని నామినేట్ చేయాల్సిందిగా ఓజీకి చెప్పడంతో వారు గంగవ్వ, మెహబూబ్‌ను నామినేట్ చేశారు. ఇక మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ఈవారం నామినేషన్స్‌లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో నామినేషన్స్‌లో యష్మీ గౌడ, యాంకర్ విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, మెహబూబ్ దిల్ సే, గంగవ్వ ఉన్నారు.
దూసుకుపోతున్న గంగవ్వ
బిగ్ బాస్ తెలుగు ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు మంగళవారం అర్థరాత్రి నుంచే ఓటింగ్ మొదలు అయింది. నిన్న రాత్రి ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో గంగవ్వ దూసుకుపోతోంది. అందరికంటే టాప్ ప్లేసులో సత్తా చాటుతోంది. గంగవ్వ 22.15 శాతం (3,312 ఓట్లు) ఓటింగ్‌తో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
నాలుగో స్థానానికి విష్ణుప్రియ
ఆ తర్వాతి రెండో స్థానంలో మెహబూబ్ దిల్ సే నిలిచాడు. అతనికి 18.16 శాతం (2,715) ఓటింగ్ నమోదు అయింది. అలాగే, ఇరిటేటింగ్ బిహేవియర్‌తో రెచ్చగొట్టే యష్మీ మూడో స్థానాన్ని సంపాదించుకుంది. యష్మీకి 17.41 శాతం (2,603) ఓటింగ్ పోల్ అయింది. ఇక బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ మొదటి రెండు, మూడు వారాలు సూపర్ క్రేజ్‌తో ఓటింగ్ తెచ్చుకున్న విష్ణుప్రియ నాలుగో స్థానానికి పడిపోయింది.
యష్మీ కంటే తక్కువగా
టైటిల్ విన్నర్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన విష్ణుప్రియ టాప్ 5 ప్లేసులో కూడా నిలిచేలా గేమ్ ఆడట్లేదు. మొన్నటివరకు ఎంతగానో సపోర్ట్ చేసిన ఆమె ఫ్యాన్స్ కూడా విష్ణుప్రియ చేష్టలకు ఓట్లు వేయట్లేదని తెలుస్తోంది. విష్ణుప్రియకు 16.21 శాతం ఓటింగ్, 2,423 ఓట్లు నమోదు అయినట్లు సమాచారం. అందరికీ చిరాకు తెప్పించే యష్మీ కంటే తక్కువ ఓటింగ్‌ను విష్ణుప్రియ తెచ్చుకుందంటేనే తెలుస్తోంది ఆమె క్రేజ్ ఎంతగా పడిపోయిందో.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
ఇక పృథ్వీ 15.3 శాతం (2,288 ఓట్లు) ఓటింగ్‌తో ఐదో స్థానంలో, కిర్రాక్ సీత 10.76 శాతం (1,609 ఓట్లు) ఓటింగ్‌తో ఆరో స్థానంలో ఉన్నారు. ఈ లెక్కన వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే కిర్రాక్ సీతనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సీత ఐదో ప్లేసులోకి వెళ్లి, పృథ్వీ ఆరో స్థానంలోకి వచ్చినా కూడా హౌజ్‌లో లవ్ ట్రాక్‌లు నడిపించడానికి అతను అవసరం కాబట్టి పృథ్వీని ఎలిమినేట్ చేసే అవకాశం లేదు.
సీతకు కష్టమే
కాబట్టి ఎటు చూసిన సీతనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేకుంటే సీతకు కిర్రాక్ లాంటి ఎపిసోడ్ ఏదైనా పడితే తప్పా ఆమె బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవడం కష్టమే అని తెలుస్తోంది.
టాపిక్