Bigg Boss Yashmi: మణికంఠపై మనసు పడ్డ యష్మీ.. అతనితోనే ఓపెన్‌గా చెప్పిన ముకుంద.. కానీ, అది తెలిసి!
Bigg Boss Telugu 8 Yashmi Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో నాగ మణికంఠకు పడిపోయినట్లు యష్మీ చెప్పింది. నాగ మణికంఠ నవ్వితే బాగుంటాడని, ఆ స్మైల్‌కే తాను పడిపోయినట్లు అతనితోనే ఓపెన్‌గా చెప్పేసింది యష్మీ. దాంతో హౌజ్ మేట్స్ అంతా ఓ.. అంటూ ఆశ్చర్యపోయారు.
Bigg Boss 8 Telugu October 4th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఒక్కో క్యారెక్టర్ ఒక్కోలా ప్రవరిస్తోంది. అందుకు ఉదాహరణే బిగ్ బాస్ 8 తెలుగు అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో జరిగిన మణికంఠ, యష్మీ మధ్య సీన్. హౌజ్‌లో ఆదిత్య ఎలిమినేట్ అయ్యాక అంతా డిస్కషన్ పెట్టుకున్నారు.
మణికంఠ శర్మగా
తనను నామినేట్ చేసినందుకు ఆదిత్య ఎలా ఫీల్ అయ్యారో అని యష్మీ తెగ బాధపడిపోయింది. తర్వాత మరుసటి రోజు ఉదయం మార్నింగ్ మస్తీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో మణికంఠ అందరి జాతకాలు చెప్పే పంతులని, ఒక్కొక్కరు వచ్చి తన దగ్గర జాతకం చెప్పించుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో ఎర్ర కండువా వేసుకుని మణికంఠ శర్మగా అవతారం ఎత్తాడు నాగ మణికంఠ.
హాల్లో కూర్చుని ఒక్కొక్కరికి జాతకం చెప్పాడు మణికంఠ. ముందుగా నబీల్ వచ్చాడు. "నబీల్ నువ్ కూర్చున్నది ముళ్ల కిరీటం నాయనా.. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ రేఖలు బాగానే ఉన్నాయి. వచ్చే వైల్డ్ కార్డ్‌లో మంచి జోడీ దొరికే సూచనలు ఉన్నాయి. అడవిలో సింహాలు, పులుల, నక్కలు అన్ని ఉంటాయి. వాటిలో నువ్ ఒక షేర్‌వి" అని నాగ మణికంఠ చెప్పాడు.
క్రాక్ వచ్చే ఛాన్స్
ఆ నక్క తనకు ఎదురుగా ఉందా అని సీత పంచ్ వేసింది. అనంతరం విష్ణుప్రియ వచ్చింది. నేను హౌజ్‌లో ఒకరంటే ఇష్టపడుతున్న. నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అని తెగ నవ్వేసింది విష్ణుప్రియ. దానికి మణికంఠ కూడా నవ్వేశాడు. అమ్మా బిగ్ బాస్ పంజరంలో ప్రేమ చిలకలు అంటే మీరేనమ్మా. వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే మాత్రం క్రాక్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇలాగే ఉంటుంది. నీ అల్లరే నిన్ను కాపాడుతుంది అని మణికంఠ అన్నాడు.
అనంతరం లక్స్ పాప అంటూ యష్మీ వచ్చింది. నేను సింగిల్‌గానే ఉండిపోతానా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా హ్యాండ్సమ్ హంక్ వస్తారా అని యష్మీ అడిగింది. హంక్ అంటే వాడు బంక్ అవ్వాల్సిందే. నీ ముందు ఎవడైనా బంక్ అయిపోతాడు. నీ నోరు ముందు ఎవడు నిలవలేడు. ఎంగిలిపడిన విస్తరాకు కూడా నీ దెబ్బకు చిరిగిపోవాల్సిందే అని మణికంఠ పంచ్‌లు వేశాడు. దీనికి నీకైతే క్లారిటీ ఉందిగా అని తన జోలికి వస్తే ఎలా ఉంటుందో క్లారిటీ ఉందిగా అన్నట్లుగా కౌంటర్ వేసింది.
వెళ్లిపోతావేమో అని
అందరికీ జాతకాలు చెప్పి బాగా ఎంటర్టైన్ చేశాడు మణికంఠ. అనంతరం హౌజ్‌మేట్ ఒక్కొక్కరు వచ్చి మణికంఠ జాతకం చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అలా నబీల్ ముందు వచ్చి నువ్ ఈ వారమే బయటకు వెళ్లిపోతావేమో అని రేఖ కొడుతుంది. ఇలా అరగంటకు ఏడవకుండా నచ్చినట్లు ఉండమని నబీల్ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత యష్మీ వచ్చి మణికంఠకు జాతకం చెప్పింది.
"ఏదో స్పేస్ స్పేస్ అంటూ వెళ్తావ్. కానీ, ప్రతి నామినేషన్‌లో సేవ్ అయిపోతున్నావ్. ముందు ఏడవడం ఆపేయ్. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మొదట నీ నవ్వుకే పడ్డాను నేను. ఆ తర్వాతే తెలిసింది నీకు పెళ్లి అయిందని, పాప కూడా ఉందని. అందుకే సైలెంట్ అయిపోయాను" అని ఓపెన్‌గా మణికంఠతో యష్మీ చెప్పింది.
యష్మీ మాటలకు మిగతా హౌజ్‌మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఓహే.. అంటూ రాగం తీశారు. ఇక నాగ మణికంఠ అయితే గాల్లో తేలిపోయాడు. కానీ, మణికంఠపై నిజంగానే మనసు పారేసుకున్నట్లు యష్మీ చెప్పే మాటల్లో అర్థమైంది. చాలా జెన్యూన్‌గా ఎలాంటి బెరుకు లేకుండా మణికంఠ చేయి పట్టుకుని యష్మీ చెప్పింది. కాగా కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో లేడి విలన్ ముకుంద పాత్రలో యష్మీ చాలా బాగా పాపులర్ అయింది.
టాపిక్