Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌లో మళ్లీ విష్ణుప్రియ టాప్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు.. మూడోవారం ఎలిమినేట్ అయ్యేది అతనే!
18 September 2024, 6:17 IST
Bigg Boss Telugu 8 Third Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్ ఓటింగ్‌లో యాంకర్ విష్ణుప్రియ మళ్లీ టాప్‌లో ఉంది. అయితే, ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిలో 8వ స్థానంలో ఉన్న కంటెస్టెంట్ కాకుండా 7వ స్థానంలో ఉన్న ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ బాస్ ఓటింగ్‌లో మళ్లీ విష్ణుప్రియ టాప్.. డేంజర్ జోన్‌లో ఇద్దరు.. మూడో వారం ఎలిమినేట్ అయ్యేది అతనే!
Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మూడో వారం నామినేషన్స్ కూడా రసవత్తరమైన గొడవలతో బాగానే సాగాయి. అయితే, గత రెండు వారాల నామినేషన్స్‌తో పోలిస్తే.. థర్డ్ వీక్ నామినేషన్స్ కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగాయి. సోమవారం (సెప్టెంబర్ 16) నాడు జరిగిన బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు.
నామినేషన్స్‌లో 8 మంది
దాంతో ప్రస్తుతం మిగిలి ఉన్న 12 మంది కంటెస్టెంట్స్‌లలో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారు నాగ మణికంఠ, యష్మీ గౌడ, ప్రేరణ, నైనిక, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్. వీరిలో చీఫ్ అయిన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. నామినేషన్స్ అనంతరం ఇద్దరు క్లాన్ చీఫ్స్ ఉన్నారు. వారిని ఎవరు నామినేట్ చేయొద్దని, కానీ.. వారిలో ఒకరు నామినేషన్స్‌లో ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు.
దాంతో ఇదివరకు నిఖిల్ నామినేట్ అయ్యాడని, తానెప్పుడు కాలేదని, తనపై ఆడియెన్స్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. దాంతో నామినేషన్స్‌లోకి 8 మంది వచ్చారు. ఇక వీరందరికి సోమవారం నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.
విష్ణుప్రియ టాప్
ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో విష్ణుప్రియ మళ్లీ టాప్‌లో ఉంది. మొదటి వీక్‌లో విష్ణుప్రియ మొదటి స్థానంలో ఉండగా.. రెండో వారంలో సెకండ్ ప్లేస్‌లో టాప్‌లో ఉంది. ఇప్పుడు మూడో వారంలో విష్ణుప్రియ 23.91 శాతం (2,555 ఓట్లు) ఓటింగ్‌తో మొదటి ప్లేస్ దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో నాగ మణికంఠ 19.14 శాతంతో (2,045 ఓట్లు) నిలిచాడు.
వరుసగా.. కిర్రాక్ సీత 11.37 శాతం (1215 ఓట్లు) మూడో స్థానంలో, నాలుగో స్థానంలో 10.71 శాతం (1145 ఓట్లు)తో యష్మీ గౌడ, ఐదో స్థానంలో 9.7 శాతం (1037 ఓట్లు)తో నైనిక ఉన్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో అంటే ఆరో ప్లేసులో అభయ్ నవీన్ 7.41 శాతం (792 ఓట్లు), ఏడో స్థానంలో పృథ్వీరాజ్ 6.84 శాతం (731 ఓట్లు)తో నిలిచారు.
డేంజర్ జోన్‌లో ఇద్దరు
ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం ఎలిమినేషన్‌తో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం ఎలిమినేట్ కానున్నారు. అయితే, బిగ్ బాస్ హౌజ్‌కి పృథ్వీరాజ్ అవసరం అనే టాక్ వినిపిస్తోంది. ఎప్పటిలాగే తనకు అవసరమయ్యే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్న అలా చేయకుండా బిగ్ బాస్ కాపాడుతుంటాడు.
అలా పృథ్వీరాజ్‌ను బిగ్ బాస్ సేవ్ చేసి.. అభయ్ నవీన్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇలాగే, ఓటింగ్ కొనసాగితే.. పృథ్వీ చివరిలో ఉన్నప్పటికీ తనకంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ ఉన్న అభయ్ నవీన్‌నే ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. లేదా శుక్రవారం ముగిసేవరకు ఓటింగ్‌లో మార్పులు జరిగితే.. ఎలిమినేట్ కంటెస్టెంట్ మారే అవకాశం కూడా ఉంది.
టాపిక్