Pindam SIIMA 2024: సైమా 2024కు నామినేట్ అయిన ఓటీటీ తెలుగు హారర్ మూవీ పిండం.. ఏ విభాగంలో అంటే?-telugu ott horror movie pindam nominated to siima 2024 awards in best debut movie producer yeshwanth daggumati ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pindam Siima 2024: సైమా 2024కు నామినేట్ అయిన ఓటీటీ తెలుగు హారర్ మూవీ పిండం.. ఏ విభాగంలో అంటే?

Pindam SIIMA 2024: సైమా 2024కు నామినేట్ అయిన ఓటీటీ తెలుగు హారర్ మూవీ పిండం.. ఏ విభాగంలో అంటే?

Sanjiv Kumar HT Telugu
Jul 20, 2024 01:05 PM IST

Pindam Movie Nominated To SIIMA 2024 Awards: సైమా 2024 అవార్డ్స్‌కు తెలుగు హారర్ మూవీ పిండం నామినేట్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న పిండం సినిమా నిర్మాత బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌ కేటగిరీలో నామినేట్ అయ్యారు.

సైమా 2024కు నామినేట్ అయిన ఓటీటీ తెలుగు హారర్ మూవీ పిండం.. ఏ విభాగంలో  అంటే?
సైమా 2024కు నామినేట్ అయిన ఓటీటీ తెలుగు హారర్ మూవీ పిండం.. ఏ విభాగంలో అంటే?

Pindam Nominated To SIIMA Awards 2024: శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ పిండం. ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. గత సంవత్సరం విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ సినిమా. కథాకథనాలు, సాంకేతిక నిపుణుల పనితీరు, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

అలాగే పిండం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. దర్శకుడు సాయికిరణ్ దైదాతో పాటు, ఈ చిత్రంతో కళాహి మీడియా వ్యవస్థాపకుడు యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, వాణిజ్య పరంగా మంచి విజయం సాధించిన 'పిండం' చిత్రం అవార్డు వేడుకలలో కూడా సత్తా చాటుతోంది.

తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు వేడుక 'సైమా 2024'లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందింది. సైమా 2024 అవార్డ్స్‌కు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ కేటగిరీలో పిండం సినిమా ఎంపిక కావడంపై మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కమర్షియల్ చట్రానికి దూరంగా, మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో 'పిండం' వంటి వైవిధ్యమైన చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు యశ్వంత్ దగ్గుమాటి.

సినిమా పట్ల ఆయనకున్న ఈ తపనే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో నామినేషన్ పొందేలా చేసిందని మేకర్స్ తెలిపారు. ఈ వార్త చిత్ర బృందంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ అవార్డును గెలుచుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత యశ్వంత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమా విడుదలకు ముందు బిజినెస్‌ పూర్తి చేయడమే కాకుండా, థియేటర్‌లలో ఎక్కువ కాలం చిత్ర ప్రదర్శన ఉండేలా చూసుకున్నారు.

యశ్వంత్ అమెరికాలోని కార్పొరేట్ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అక్కడే దర్శకుడు సాయికిరణ్‌ను కలిసిన యశ్వంత్, ఆయనలోని ప్రతిభను గుర్తించి 'పిండం' సినిమాతో నిర్మాతగా మారారు. కార్పొరేట్ రంగంలో తను అలవరచుకున్న నాయకత్వ, పాలనా నైపుణ్యాలతో.. 'పిండం' చిత్రీకరణ సమయంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ఎటువంటి తడబాటు లేకుండా ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా తెలిపారు.

అలాగే సినిమాని ప్రేక్షకులకు విస్తృతంగా చేరువయ్యేలా ప్రణాళికను రూపొందించారు. సైమా నామినేషన్ అనేది 'పిండం' చిత్ర బృందానికి కచ్చితంగా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వేడుకలో సినిమా సందడి చేయడానికి ముందే, 'పిండం' దర్శకుడు సాయికిరణ్‌తో మరో కొత్త సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు కళాహి మీడియా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2024 చివరి నాటికి సెట్స్‌ పైకి తీసుకెళ్లాని భావిస్తున్నారు.

కథ ఇప్పటికే లాక్ చేశారు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో అధికారిక ప్రకటన ద్వారా చెప్పనున్నారు. కళాహి మీడియా కోసం యశ్వంత్‌కు పెద్ద ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డు నామినేషన్ యశ్వంత్‌ను మరింత ఉత్తేజపరిచినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తెలుగు హారర్ మూవీ పిండం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి రెండు ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.7 రేటింగ్ రావడం విశేషం.

 సైమా 2024కు నామినేట్ అయిన పిండం మూవీ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి
సైమా 2024కు నామినేట్ అయిన పిండం మూవీ నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి
Whats_app_banner