SIIMA 2024: దుబాయ్‌లో సైమా 2024 అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఔట్.. పోటీలో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు-siima 2024 awards nominations announcement dasara jailer katera 2018 movies nominated to siima 2024 event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siima 2024: దుబాయ్‌లో సైమా 2024 అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఔట్.. పోటీలో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు

SIIMA 2024: దుబాయ్‌లో సైమా 2024 అవార్డ్స్.. నామినేషన్స్ లిస్ట్ ఔట్.. పోటీలో 4 బ్లాక్ బస్టర్ సినిమాలు

Sanjiv Kumar HT Telugu
Jul 17, 2024 06:14 AM IST

SIIMA 2024 Awards Nominations Announcement: దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుకలు జరగనున్నాయి. ఈ 12వ ఎడిషన్ సైమా వేడుకల్లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను తాజాగా ప్రకటించారు. వాటిలో ఒక్కో భాష నుంచి ఒక్కో బ్లాక్ బస్టర్ మూవీ నామినేట్ అయింది.

సైమా 2024 అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్
సైమా 2024 అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్

SIIMA 2024 Awards Nominations: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్‌‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధం కానుంది. సైమా వేడుకలు సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం లాంటింది. గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్‌ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌కి కనెక్ట్ చేస్తుంది.

సైమా 2024 ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15 తేదీల్లో దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 2024, 2023 క్యాలెండర్ ఇయర్‌లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేశారు సైమా నిర్వాహకులు. సైమా చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో విడుదలైన చిత్రాలకు ఈ నామినేషన్‌లను అనౌన్స్ చేశారు.

నామినేషన్ల గురించి బృందా ప్రసాద్ మాట్లాడుతూ "గత రెండు సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లాంగ్వేజ్ బారియర్‌ని అధిగమించి జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించారు. SIIMA 2024 స్ట్రాంగ్ కంటెడర్స్ లిస్టు ని కలిగి ఉంటుంది" అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ నామినేషన్లో నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పోటీ పడుతున్నాయి.

దసరా (తెలుగు), జైలర్ (తమిళం), కాటేరా (కన్నడ), 2018 (మలయాళం) సినిమాలు మోస్ట్ పాపులరిటీ కేటగిరీలలో సైమా నామినేషన్‌లలో ముందున్నాయి. ఈ నాలుగు చిత్రాలు ఆయా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. తెలుగులో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా 11 నామినేషన్లలో ముందంజలో ఉంది. అలాగే నాని, మృణాల్ ఠాకూర్ జోడీగా తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ 10 నామినేషన్లతో క్లోజ్‌గా ఉంది.

ఇక దసరా సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించగా హాయ్ నాన్న సైతం న్యూ డైరెక్టర్‌గా పరిచయమైన శౌర్యువ్ దర్శకత్వం వహించారు. అలాగే తమిళంలో తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్‌ సినిమా 11 నామినేషన్లతో ముందంజలో ఉంది. దీంతోపాటు ఉదయనిధి స్టాలిన్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘మామన్నన్‌’ 9 నామినేషన్‌లతో దగ్గరగా ఉంది.

కన్నడలో, స్టార్ హీరో, ఇటీవల వివాదాస్పద పాలైన దర్శన్ నటించిన కాటెరా సినిమా 8 నామినేషన్లతో ముందంజలో ఉంది. ఈ సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. అలాగే రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ’ 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది.

మలయాళంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ నటించిన 2018 సినిమా 8 నామినేషన్లతో ముందంజలో ఉంది. ఈ సర్వైవల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. దీని తర్వాత మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జ్యోతిక నటించిన 'కాథల్ - ది కోర్' 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది.

అయితే, ఈ సినిమాల్లో ఆన్‌లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. అభిమానులు, ప్రేక్షకులు తమ అభిమాన స్టార్స్ సినిమాలకు www.siima.in, SIIMA Facebook పేజీలో ఓటు వేసి గెలిపించుకోవచ్చు.

Whats_app_banner