Malayalam OTT Movie Review: భార్య శవంతో బిర్యానీ వండిన పోలీస్- ఓటీటీ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Ela Veezha Poonchira Movie Review In Telugu: ఓటీటీలోకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇలవీజ పూంచిరా. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో ఇలవీజ పూంచిరా రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఇలవీజ పూంచిరా
నటీనటులు: సౌబిన్ షాహీర్, అఖిల నాథ్, సుధి కొప్పా, జూడ్ ఆంథోనీ జోసెఫ్ తదితరులు
కథ: నిధిష్ జీ, షాజీ మరాద్
దర్శకత్వం: షాహి కబీర్
సినిమాటోగ్రఫీ: మనేష్ మాధవన్
సంగీతం: అనిల్ జాన్సన్
నిర్మాణ బ్యానర్: కదాస్ అన్‌టోల్డ్
నిర్మాత: విష్ణు వేణు
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
Ela Veezha Poonchira Review Telugu: మలయాళ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆ క్రేజ్ ఊరికనే రాలేదు. మాలీవుడ్‌లోని దాదాపుగా ప్రతి సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తుంటుంది. అందుకే ఆదరణ పొందుతున్నాయి ఆ సినిమాలు. అందుకు మరో ఉదాహరణే ఇలవీజ పూంచిరా మూవీ. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను స్లో నెరేషన్‌తో కూడా ఎంగేజ్ చేయొచ్చని చూపించిన సినిమా ఈ ఇలవీజ పూంచిరా.
పాపులర్ మలయాళ యాక్టర్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సోబిన్ షాహిర్ నటించిన ఇలవీజ పూంచిరా సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. షాహి కబీర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఐమ్‌డీబీ 10కి ఏకంగా 7.3 రేటింగ్ ఇచ్చింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీలో ఉన్న కంటెంట్ ఏంటో. క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ఓటీటీ మలయాళ మూవీ ఎలా ఉందో ఇలవీజ పూంచిరా రివ్యూలో చూద్దాం.
కథ:
మధు (సౌబిన్ షాహిర్) ఒక ఏఆర్ పోలీస్. కేరళలోలని కొట్టాయం జిల్లాలో ఉన్న ఇలవీజ పూంచిరా అనే కొండపైన విధులు నిర్వహిస్తుంటాడు. అతనితోపాటు ప్రభు (జూడ్ ఆంథోనీ జోసెఫ్), సుధి (సుధి కొప్పా) కూడా డ్యూటీ చేస్తుంటారు. అయితే కొన్ని రోజుల లెక్కన షిఫ్ట్స్ మారుతుంటారు. సొంతింటి నుంచి మళ్లీ డ్యూటికి వెళ్తాడు మధు. అప్పుడు అక్కడ మిస్టర్ వెజిటేబుల్ అలియాస్ ప్రభు డ్యూటీలో ఉంటాడు. అతని తర్వాత సుధి డ్యూటికి వస్తాడు.
హైలెట్స్
ఇలవీజ పూంచిరా కొండపై మధు, సుధి విధులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో మరోవైపు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒక యువతి బాడీ పార్ట్స్ ఒక్కో చోట కనిపిస్తుంటాయి. దానికి సంబంధించిన విచారణ జరుగుతుంటుంది. ఆ సమయంలో పూంచిరా ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా మారాయి? మధు, సుధి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? ఆ యువతి ఎవరు ఆమెను ఎవరు హత్య చేశారు? చివరికీ ఏమైంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఇలవీజ పూంచిరా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇలవీజ పూంచిరా అనేది ఒక హిల్ స్టేషన్. ఇలవీజ పూంచిరా అంటే ఆకులు రాలని చెరువు ప్రాంతం అని అర్థం వస్తుంది. అంటే చెట్లు కూడా పెరగనటువంటి ప్రాంతం అని. అయితే ఆ పేరు రావడానికి పురాణంలో ఓ స్టోరీ ఉంటుంది. దాదాపుగా సినిమా స్టోరీ కూడా అలాగే ఉంటుంది. కానీ, అది క్లైమాక్స్ వరకు తెలియకుండా చాలా సస్పెన్సింగ్‌గా తెరకెక్కించారు డైరెక్టర్.
స్లో నెరేషన్‌లో సమ్‌థింగ్ ఫీలింగ్
ఒక కొండపై ఓ కుక్కకు ముక్కలు చేసిన యువతి పాదం కనిపించడంతో సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత మధు డ్యూటిలో చేరడం, కొండ ప్రాంతానికి వెళ్లడం సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే తర్వాత గంట వరకు సినిమా అంతా స్లోగా, కథ ఉన్న చోటే కదలకుండా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ, మరోవైపు అక్కడ ఏదో సమ్‌థింగ్ కూడా జరుగుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా స్లో నెరేషన్‌లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా సీన్స్ తెరకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం.
బాడీ పార్ట్స్‌తో కథలో వేగం
సినిమా గంట తర్వాత పోలీసులకు యువతి బాడీ పార్ట్స్ ముక్కలుగా చేసి కనిపించడంతో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ ఊహించలేం. అయితే, కిల్లర్ మనకు తెలిసిపోయిందని అనుకుంటాం. కానీ, చివరి వరకు నిందితుడు ఎవరు, బాధితులు ఎవరు అనే సస్పెన్స్ రివీల్ కాదు. ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఇదొక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ తెలిసిపోతుంది.
చాలా కన్విన్సింగ్‌గా రివేంజ్
భార్య శవాన్ని బిర్యాని వండి రివేంజ్ తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఆ రివేంజ్‌ను చాలా కన్విన్సింగ్‌గా చూపించాడు డైరెక్టర్. అందుకు వాడిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడే సుధి చెప్పిన స్టోరీ రెఫ్లెక్ట్ అవుతుంది. అది గుర్తుకు వచ్చిన ప్రేక్షకుడికి మంచి థ్రిల్‌గా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక సీన్‌తో చాలా బాగా ఎంగేజ్ చేశారు. ప్రతి సీన్ క్లైమాక్స్‌కు సూట్ అయ్యేలా ఉంటుంది.
బీజీఎమ్-విజవల్స్ హైలెట్
చివరి 40 నిమిషాల నుంచి వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని గెస్ చేసేలా ఉంటాయి. ఇక సినిమాకు మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. మంచి సస్పెన్స్ ఫీల్ వస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇలవీజ పూంచిరా కొండ ప్రాంత అందాలకు సంబంధించిన విజువల్స్ చాలా బాగున్నాయి.
యూనిక్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
ఇక సౌబిన్ షాహిర్, సుధి కొప్పా, జూడ్ ఆంథోనీ జోసెఫ్ యాక్టింగ్ చాలా బాగుంది. వారి పాత్రలను పర్ఫెక్ట్‌గా చేశారు. సౌబిన్ షాహిర్ పాత్ర చాలా కామ్‌గా ఉంటుంది. కానీ, సీరియస్ టైమ్‌లో వచ్చే కోపం భయపెడుతుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీని మెచ్చుకోక తప్పదు. గంట 40 నిమిషాలతో ఒక యూనిక్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇలవీజ పూంచిరా పర్ఫెక్ట్ ఛాయిస్. ఎలాంటి ఇబ్బందిలేకుండా ఫ్యామిలీతో కూడా చూసేయొచ్చు.
టాపిక్