Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. హరితేజకు పెద్ద షాక్.. దెబ్బేసిన సొంత టీమ్
16 October 2024, 6:34 IST
Bigg Boss Telugu 8 Seventh Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అది హరితేజకే పెద్ద షాక్‌గా మారింది. అప్పటివరకు కాపాడుకొచ్చిన తన సొంత టీమే హరితేజకు ఘోరంగా దెబ్బేసింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ హైలెట్స్‌లోకి వెళితే..
ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. హరితేజకు పెద్ద షాక్.. దెబ్బేసిన సొంత టీమ్
Bigg Boss 8 Telugu Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ కూడా రెండురోజుల పాటు జరిగాయి. సోమవారం (అక్టోబర్ 14) ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు ఏడో వారం నామినేషన్స్ మంగళవారం (అక్టోబర్ 15) ముగిసాయి. కానీ, రెండు రోజుల పాటు హోరా హోరీగా ఈ వారం నామినేషన్స్ జరిగాయి.
కౌ గర్ల్స్ స్టైల్‌లో
కంటెస్టెంట్ల మధ్య తీవ్వ వాగ్వాదం, అరుచుకోవడాలు, సారీ చెప్పుకోవడాలు, ఏడుపులు, కక్ష సాధింపులు వంటివి చాలానే జరిగాయి. అయితే, కౌ గర్ల్స్ స్టైల్‌లో ఈ వారం నామినేషన్స్ నిర్వహించారు. గుర్రం సౌండ్ వచ్చినప్పుడు కిల్లర్ గర్ల్స్‌గా ఉన్న ప్రేరణ, హరితేజలో హ్యాట్ తీసుకున్న వారు ఎవరిని నామినేట్ చేయాలనే పవర్ దక్కుతుంది.
ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చిన తాము నామినేట్ చేయాలనుకున్న వారి పేరు, పాయింట్స్ చెబుతారు. వారిలో ఎవరి పాయింట్స్ వాలిడ్ అనిపిస్తుందో వారు చెప్పిన కంటెస్టెంట్‌ను నామినేషన్స్‌లో ఉంచుతారు. అలాగే, కిల్లర్ గర్ల్స్‌లో తక్కవసార్లు హ్యాట్ తీసుకున్న వాళ్లు కూడా నామినేషన్స్‌లో ఉంటారనే మెలిక పెట్టాడు బిగ్ బాస్.
అయితే, తనను నామినేషన్స్‌లో పెట్టిందన్న కోపంతో ప్రేరణకు హ్యాట్ దక్కకుండా ప్రతిసారి అడ్డుగా వచ్చాడు పృథ్వీ. అతనికి నయని పావని కూడా హెల్ప్ చేసింది. ప్రేరణను ఇద్దరు టార్గెట్ చేయడంతో తనకు యష్మీ హెల్ప్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నించింది. కానీ, ఎక్కువగా సార్లు హరితేజనే హ్యాట్ అందుకుంది. దాంతో తన రాయల్ క్లాన్ సభ్యులు ఎక్కువ నామినేషన్స్‌లో పడకుండా ఓజీ గ్యాంగ్‌నే నామినేట్ చేసింది హరితేజ.
ముందుగా నామినేట్ అయింది
పృథ్వీ కోపంతో చేసిన పని వల్ల నామినేషన్స్‌లో తన టీమ్ సభ్యులే ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్‌లో ముందుగా 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో గౌతమ్ కృష్ణ, నిఖిల్, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, నబీల్, యష్మీ గౌడ, టేస్టీ తేజ, అవినాష్‌తోపాటు తక్కువ సార్లు హ్యాట్ అందుకున్న ప్రేరణ ఉన్నారు.
అయితే, బిగ్ బాస్ తెలుగు 8 రీలోడ్ లాంచ్ అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ రోజున అవినాష్, గంగవ్వ కలిసి ఆడి ఇమ్యూనిటీ షీల్డ్ సాధించుకున్నారు. దానిని ఒక్కసారే ఉపయోగించుకోవచ్చు అని, ఇప్పుడు వాడుకోవాలని అనుకుంటున్నారా అని బిగ్ బాస్ అడిగాడు. దాంతో ఆ షీల్డ్‌ను తాను నామినేషన్స్‌లో ఉన్నందున వాడుకుంటున్నట్లు అవినాష్ చెప్పాడు.
అలాగే, ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకోవడంతో పాటు తనకు బదులు ఇంకొకరిని నామినేషన్స్‌లో ఉంచాలి అని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో రాయల్ క్లాన్ అంతా డిస్కస్ చేసిన తర్వాత హరితేజను తనకు బదులు నామినేషన్స్‌లో పెడుతున్నట్లు బిగ్ బాస్‌కు చెప్పారు. అప్పటివరకు కిల్లర్ గర్ల్‌గా ఉన్న హరితేజ రాయల్ క్లాన్స్ మెంబర్స్ ఎక్కువ మంది నామినేషన్స్‌లో పడకుండా హరితేజ పక్షపాతం చూపించింది.
మార్చుకోవడంతో ట్విస్ట్
విష్ణుప్రియను తప్పా ఓజీలో అందరిని నామినేషన్స్‌లో పెట్టింది హరితేజ. రాయల్ క్లాన్‌లో నయని పావని-టేస్టీ తేజ, అవినాష్-నయని పావని మధ్య నామినేషన్స్ పాయంట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా నయనినే కాపాడింది హరితేజ. దాంతో టేస్టీ తేజ, అవినాష్ నామినేషన్స్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇమ్యూనిటీ షీల్డ్ ద్వారా అవినాష్ బయట పడి హరితేజను స్వాప్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు.
అలా అప్పటివరకు తన క్లాన్‌ను దాదాపుగా కాపాడిన హరితేజను తన సొంత టీమ్ మెంబర్సే దెబ్బేశారు. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, నబీల్, యష్మీ, టేస్టీ తేజ, ప్రేరణ, హరితేజ తొమ్మిది మంది ఉన్నారు.
టాపిక్