Bigg Boss Elimination: బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. టాప్ 4 నుంచి డేంజర్‌లో పడిపోయిన విష్ణుప్రియ.. ఎలిమినేట్ కానుందా?
Bigg Boss Telugu 8 Elimination Sixth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. టాప్ నాలుగో స్థానంలో ఉన్న విష్ణుప్రియ ఒక్కసారిగా డేంజర్ జోన్‌లోకి పడిపోయింది. అంటే దాదాపుగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం ఎలిమినేషన్ ఎవరని వేస్తే..
Bigg Boss 8 Telugu Elimination This Week: ఊహించని విధంగా జరిగే తెలుగు రియాలిటీ షోనే బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ జోరుగానే సాగుతోంది. గత రెండు రోజులుగా హౌజ్‌లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ నడుస్తోంది. వారిలో బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారినుంచి మెగా చీఫ్ కంటెండర్స్‌ను సెలెక్ట్ చేసి వచ్చే వారానికి మెగా చీఫ్‌ను సెలెక్ట్ చేస్తారు.
నామినేషన్స్‌లో ఆరుగురు
ఇదిలా ఉంటే, ఐదో వారం 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారు ఓజీ క్లాన్ మెంబర్స్‌ను నామినేట్ చేయగా.. రాయల్ సభ్యుల్లో ఇద్దరిని నామినేషన్‌లో ఉంచే అవకాశం పాత కంటెస్టెంట్స్‌కు లభించింది. దీంతో రెండు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం నామినేషన్స్‌లో టోటల్‌గా ఆరుగురు నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో యష్మీ, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో ఈ వారం మొదటి నుంచి గంగవ్వ టాప్ ప్లేసులో కొనసాగుతూ సత్తా చాటుతోంది. ఇప్పుడు కూడా టాప్ 1 స్థానంలో గంగవ్వనే అదరగొడుతోంది.
ఎగబాకిన యష్మీ
గంగవ్వకు 21.1 శాతం (9,632 ఓట్లు) ఓటింగ్ నమోదు అయింది. ఇక గత వారం బాగా నెగెటివిటీ తెచ్చుకున్న యష్మీ ఈ వారం బెటర్ అండ్ క్యూట్ పర్ఫామెన్స్‌తో ఓటింగ్‌పై పైకి వచ్చేసింది. దాంతో రెండో స్థానంలో యష్మీ కొనసాగుతోంది. ఆమెకు 17.24 శాతం (7,872) ఓటింగ్ వచ్చింది. ఇక మూడో ప్లేసులో వైల్డ్ కార్డ్ మెంబర్ మెహబూబ్ నిలిచాడు. అతనికి 17.23 శాతం ఓటింగ్ నమోదు కాగా, 7,869 ఓట్లు పడ్డాయి.
డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీరాజ్ నాలుగో ప్లేసుకు చేరుకున్నాడు. పృథ్వీరాజ్ స్థానంలోకి విష్ణుప్రియ వెళ్లిపోయింది. బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ లవ్ ట్రాక్‌ను నమ్ముకుని చేతులారా గేమ్ పాడు చేసుకుంది. అందుకే మొదట్లో మంచి ఓటింగ్ తెచ్చుకున్న విష్ణుప్రియ ఇప్పుడు డేంజర్ జోన్‌లోకి పడిపోయే పరిస్థితి వచ్చింది.
ఎలిమినేట్ ఎవరంటే?
పృథ్వీకి 15.18 శాతం ఓటింగ్ (6,932 ఓట్లు) నమోదు కాగా.. విష్ణుప్రియకు 15.03 శాతం ఓటింగ్, 6,863 ఓట్లు పడ్డాయి. స్వల్ప తేడాతోనే విష్ణుప్రియ ఐదో స్థానంలోకి వెళ్లి డేంజర్‌లో పడిపోయింది. ఇక ఆరో స్థానంలో కిర్రాక్ సీతనే కొనసాగుతోంది. ఆమెకు 14.22 శాతం ఓటింగ్, 6,492 ఓట్లు పడ్డాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్‌లో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
అయితే, ఎలిమినేషన్ అయ్యేంత డేంజర్‌లోకి విష్ణుప్రియ వచ్చింది. కానీ, ఆమెకంటే తక్కవగా అట్టడుగు స్థానంలో ఉన్న సీతనే దాదాపుగా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ విష్ణుప్రియ ఆరో స్థానంలోకి పడిపోయినా కూడా బిగ్ బాస్ తనను ఎలిమినేట్ చేయడు. ఎందుకంటే పృథ్వీతో విష్ణుప్రియ నడిపే లవ్ ట్రాక్ తనకు అవసరం కాబట్టి ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
టాపిక్