Bigg Boss Telugu 8: కొత్త మెగా చీఫ్‌గా మెహబూబ్.. హరితేజకు అన్యాయం.. 20 సెకన్లలో బైక్ గెలుచుకున్న నయని పావని
Bigg Boss Telugu 8 October 11th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌లో న్యూ మెగా చీఫ్‌గా మెహబూబ్ గెలిచాడు. హౌజ్‌లో మెగా చీఫ్ కంటెండర్స్ పోటీ నిర్వహించారు బిగ్ బాస్. ఈ టాస్కుల్లో చివరి వరకు ఆడి కొత్త మెగా చీఫ్‌గా మెహబూబ్ అయ్యాడు. బిగ్ బాస్ హైలెట్స్ చూస్తే..
Bigg Boss 8 Telugu New Mega Chief Mehaboob: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌లో బీబీ హోటల్ టాస్క్ పూర్తి అయిపోయింది. ఈ టాస్క్‌లో రాయల్ క్లాన్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఆరుగురి పేర్లు చెప్పాల్సిందిగా సభ్యులకు బిగ్ బాస్ చెప్పాడు. అలాగే, ఓజీ క్లాన్‌లో ఎవరికీ ఎన్ని స్టార్స్ వచ్చాయో చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు.
చర్చించుకుని చెప్పాలి
దాంతో నబీల్ దగ్గర రెండు, మణికంఠ వద్ద రెండు స్టార్స్ ఉండగా.. నిఖిల్, ప్రేరణ, యష్మీ వద్ద చెరో స్టార్ ఉందని చెప్పారు. నబీల్, మణికంఠ వద్ద సమానంగా స్టార్స్ ఉండటంతో వారిద్దరిలో ఒకరు మెగా చీఫ్ కంటెండర్ పోటీలో పాల్గొనే సభ్యుడి పేరు మెంబర్స్ అంతా చర్చించుకుని తాను అడిగినప్పుడు చెప్పమని బిగ్ బాస్ ఆదేశించాడు.
కాసేపటి తర్వాత ఓజీ క్లాన్ చర్చించుకున్న తర్వాత మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌కు నాగ మణికంఠను పంపిద్దామని అంతా సపోర్ట్ చేశారు. మరోవైపు రాయల్ క్లాన్ నుంచి గంగవ్వ, టేస్టీ తేజాను తప్పించాలని తమ సభ్యులు చర్చించుకున్నారు. బిగ్ బాస్ అడగ్గానే వాళ్లు చెప్పారు. దాంతో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌ల్లో మొత్తం ఏడుగురు పాల్గొన్నారు.
కిందపడితే ముందుకెళ్లలేవు
ఓజీ నుంచి మణికంఠ, రాయల్ క్లాన్ నుంచి అవినాష్, నయని, హరితేజ, గౌతమ్, మెహబూబ్, రోహిణి పాల్గొన్నారు. మొదట బాల్ టాస్క్ ఇచ్చారు. మూడు రౌండ్లుగా జరిగిన ఈ టాస్క్‌లో గౌతమ్, నయని, రోహిణి వరుసగా ఔట్ అయ్యారు. తర్వాత మిగిలిన వారికి "కిందపడితే ముందుకెళ్లలేవు" అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో చేతిలో పట్టుకున్న ఓ ప్లాట్‌ఫామ్‌పై డిఫరెంట్ షేప్ ఉన్న వస్తువులు పెట్టుకుంటూ నడవాలి.
అలా బ్యాలెన్స్ చేస్తూ వస్తువు కిందపడకుండా చివరి వరకు ఉన్న వాళ్లే గెలుస్తారు. ఈ క్రమంలో త్వరగానే మణికంఠ ఔట్ అయ్యాడు. తర్వాత అవినాష్ అవుట్ అయ్యాడు. హరితేజ, మెహబూబ్ చాలా వరకు బ్యాలెన్స్ చేస్తూ ఆడారు. అయితే, ఓ వస్తువు చెప్పినప్పుడు హరితేజది పడిపోయింది. అయితే, ఆ వస్తువును మెహబూబ్ పెట్టడానికి ట్రై చేశాడు. కానీ, అది పెట్టడానికి ముందే మెహబూబ్ అన్ని వస్తువులు పడిపోయాయి.
సంచాలక్ రాంగ్ డెసిషియన్
చివరి వరకు మెహబూబ్ ఉన్నందువల్ల సంచాలక్‌గా ఉన్న నబీల్ తనను మెగా చీఫ్‌గా ప్రకటించాడు. అయితే, మెహబూబ్ చివరి వరకు ఉన్న పూర్తి వరకు వస్తువులు పెట్టలేదు. కానీ, హరితేజ మాత్రం చివరి వస్తువు వరకు పెట్టింది. ఈ లెక్కన హరితేజ కంటే తక్కువ వస్తువులను మెహబూబ్ క్యారీ చేశాడు. కానీ, చివరి వరకు మెహబూబ్ ఉన్నాడని, హరితేజ రెండుసార్లు ఫౌల్ ఆడిందని నబీల్ చెప్పాడు.
హరితేజ మాత్రం మొదట్లో వస్తువు పెట్టాకా ఒక్కసారి మాత్రమే జరిపాను అని, రెండోసారి ఏది రివర్స్‌లో పెట్టలేదని హరితేజ చెప్పింది. కానీ, నబీల్ మాత్రం మెగా చీఫ్‌గా మెహబూబ్‌ను ప్రకటించి తన దగ్గర ఉన్న గౌల్డెన్ రింగ్ తొడిగాడు. ఈ గేమ్‌లో హరితేజకు అన్యాయం జరిగిదంటూ రివ్యూవర్స్, నెటిజన్స్ అంటున్నారు. నబీల్ రాంగ్ డెసిషియన్ తీసుకున్నాడని చెబుతున్నారు.
బైక్ గెలుచుకున్న నయని
ఆ తర్వాత థమ్స్ అప్‌కు సంబంధించిన టాస్క్‌లో హర్డిల్స్ దాటి బైక్‌పై కూర్చుని థమ్స్ అప్ పట్టుకుని క్యూ ఆర్ కోడ్ చూపిస్తూ దమ్ముంటే స్కాన్ చేయి అని చెప్పాలి. ఈ టాస్క్‌లో నయని, విష్ణుప్రియ పోటీ పడ్డారు. టాస్క్ ప్రారంభమైన 20 సెకన్లలోనే చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్లిన నయని అన్ని హర్డిల్స్ దాటి గెమ్ రూల్ ప్రకారం చేసింది. దాంతో నయని పావని థండర్ బైక్ గెలుచుకుంది.