తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya: జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ

Anasuya: జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ

HT Telugu Desk HT Telugu

29 June 2022, 16:55 IST

    • Anasuya: అనసూయ.. తెలుగు వాళ్లందరికీ ఈ పేరు పరిచయం చేసేలా చేసిన టీవీ షో జబర్దస్త్‌. అప్పటి వరకూ ఓ న్యూస్‌ యాంకర్‌గా ఉన్న ఆమె కెరీర్‌ ఈ షో ద్వారా ఎక్కడికో వెళ్లిపోయింది.
అనసూయ
అనసూయ (Photo Credit: @itsme_anasuya)

అనసూయ

జబర్దస్త్‌లాంటి కామెడీ షోకు గ్లామర్‌ మెరుగులు అద్దిన యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. ఈ షో ఎంత హిట్‌ అయిందో అంతకుమించిన పేరు అనసూయకు వచ్చింది. దాదాపు ఈ కామెడీ షో ప్రారంభమైనప్పటి నుంచీ ఆమె ఈ షోతోనే ఉంది. ఆమె కోసమే ఈ షోను ఫాలో అయ్యే అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి జబర్దస్త్‌ షోకి ఆమె గుడ్‌బై చెప్పిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Laapataa Ladies OTT Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ

Kamakshi Bhaskarla: నాగ‌చైత‌న్య‌తో వెబ్‌సిరీస్ చేయ‌నున్న పొలిమేర 2 హీరోయిన్ - దూత‌కు మించి థ్రిల్లింగ్‌!

The Boys 4 OTT: సూపర్ హీరోలపై సెటైరికల్‌, వయెలెంట్ సిరీస్- ఓటీటీలోకి ది బాయ్స్ 4- 6 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Vijay Deverakonda: ఫ్యామిలీస్టార్ డిజాస్ట‌ర్...అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో దిల్‌రాజు మ‌రో మూవీ - ఈ సారి మాస్ క‌థ‌

మంగళవారం (జూన్‌ 28) తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆమె చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇందులో నేరుగా తాను జబర్దస్త్‌ షోను వదిలేస్తున్నట్లు అనసూయ చెప్పలేదు కానీ.. కెరీర్‌లో పెద్ద నిర్ణయం తీసుకున్నానని, దానిని ఇప్పటికే అమలు చేసినట్లు కూడా చెప్పింది. "నా కెరీర్‌లో పెద్ద నిర్ణయం తీసుకొని ఇవాళే అమలు చేశాను. నాతోపాటు ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. అందులో చాలా మంచి జ్ఞాపకాలు, కొన్ని చెడు, మరికొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. మీరు నాతో పాటు ఉండి ఎప్పటిలాగే నన్ను ఇష్టపడతారని ఆశిస్తున్నాను" అన్నది అనసూయ పోస్ట్‌ సారాంశం.

ఇది చూసి ఆమె జబర్దస్త్‌ షోకి గుడ్‌బై చెప్పిందని అభిమానులు ఫిక్సయిపోయారు. ఆమెకు క్రమంగా సినిమా అవకాశాలు పెరుగుతుండటం, ఇతర ఛానెళ్ల నుంచి కూడా షోలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జబర్దస్త్‌ కంటే ముందు అనసూయ పేరు ఎవరికీ తెలియదు. అంతకుముందు సాక్షి టీవీలాంటి న్యూస్‌ ఛానెల్స్‌లో న్యూస్‌ రీడర్‌గా పని చేసింది. అయితే జబర్దస్త్‌ షో ద్వారా ప్రతి తెలుగు ఇంటికీ సుపరిచితమైన ఆమె.. క్రమంగా సినిమాల్లోనూ అవకాశాలు అందుకునే స్థాయికి చేరింది.

<p>అనసూయ పోస్ట్ ఇదే</p>

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.