తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jabardasth: జబర్దస్త్ నుంచి సుధీర్ ఎందుకు వెళ్లిపోయాడో చెప్పిన రామ్ ప్రసాద్...

jabardasth: జబర్దస్త్ నుంచి సుధీర్ ఎందుకు వెళ్లిపోయాడో చెప్పిన రామ్ ప్రసాద్...

HT Telugu Desk HT Telugu

14 June 2022, 6:57 IST

  • జ‌బ‌ర్ద‌స్త్ లో గ‌త కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను క‌నిపించ‌డం లేదు. వారు జ‌బ‌ర్ద‌స్త్ ను వీడి వెళ్లిపోయారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. వారు వెళ్లిపోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని టీమ్ లీడ‌ర్స్ ఆటో రామ‌ప్ర‌సాద్‌, బుల్లెట్ భాస్క‌ర్ వెల్ల‌డిస్తూ విడుద‌ల చేసిన తదుపరి ఎపిసోడ్ ప్రోమో ఆస‌క్తిని పంచుతోంది
సుడిగాలి సుధీర్‌
సుడిగాలి సుధీర్‌ (twitter)

సుడిగాలి సుధీర్‌

గ‌త కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో క‌నిపించ‌డం లేదు. దాంతో అత‌డికి ఏమైంది ఎందుకు క‌నిపించ‌డం లేదంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సుధీర్‌తోపాటు మ‌రో టీమ్ మెంబ‌ర్ గెట‌ప్ శీను కూడా జబర్దస్త్ ను వీడారు. వారిద్ద‌రూ త‌న‌ను ఒంట‌రి ని చేసి వెళ్లిపోయారంటూ ఇటీవ‌లే రామ్ ప్ర‌సాద్ ఓ స్కిట్ పూర్త‌యిన సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 8th Episode: అత్త కోసం కావ్య త్యాగం - రాజ్ బ‌దులు ఇంట్లో నుంచి వెళ్లిపోనున్న అప‌ర్ణ - ఇర‌కాటంలో రుద్రాణి

Asuraguru Review: అసుర గురు రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

జ‌బ‌ర్ద‌స్త్ నుంచి సుధీర్‌, గెట‌ప్ శీను వెళ్లిపోవ‌డానికి కార‌ణ‌మేమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జూన్ 17వ తేదీన ప్ర‌సారం కానున్న జ‌బ‌ర్ద‌స్త్ తదుపరి ఎపిసోడ్ తాలూకు ప్రోమో సోమ‌వారం విడుద‌లైంది. ఇందులో జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో జ‌డ్జ్ ఇంద్ర‌జ క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్స్ రౌండ్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రామ్ ప్ర‌సాద్‌, బుల్లెట్ భాస్క‌ర్‌ల‌ను సుధీర్ వెళ్లిపోవ‌డానికి గ‌ల కార‌ణాల్ని అడిగింది. మీకు ఓ కో టీమ్ లీడ‌ర్ ఉండేవాడు.

మీరు తొక్కేయ‌డం వ‌ల్లే ఆయ‌న జబర్దస్త్ ను వీడి వెళ్లిపోయాడ‌ని అంటున్నారు నిజ‌మేనా అంటూ బుల్లెట్ భాస్క‌ర్‌ను ఇంద్ర‌జ ప్ర‌శ్న అడిగింది. ఈ ప్ర‌శ్న‌కు నేను స్పందించ‌కూడ‌ద‌ని చాలా రోజులు అనుకున్నా...ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే వెళ్లిపోయిన ఆయ‌న చాలా పెద్దాయ‌న అంటూ బుల్లెట్ భాస్క‌ర్ అన్నాడు. ఆ త‌ర్వాత కూడా అత‌డు త‌న స‌మాధానాన్ని కొన‌సాగించాడు. అత‌డు ఏమ‌న్నాడో ప్రోమోలో చూపించ‌లేదు.

అలాగే మీరు స్క్రిప్ట్ లు స‌రిగా రాయ‌క‌పోవ‌డం వ‌ల్లే టీమ్ మెంబ‌ర్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా అది నిజ‌మా అంటూ రామ్ ప్ర‌సాద్ ను ఇంద్ర‌జ క్వ‌శ్వ‌న్ అడిగింది. సీరియ‌స్‌గా ఈ ప్రశ్న అడిగే వాళ్లకు ఇదే నా ఆన్సర్ అంటూ రామ్ ప్ర‌సాద్ స‌మాధానం చెప్పాడు. అదేమిటో వ‌చ్చే ఎపిపోడ్‌లోనే చూడాల్సిందే. చివ‌ర‌లో రోజా గారు మినిస్ట‌ర్ అవ్వ‌కూడ‌ద‌ని మీరు కోరుకున్నారంటా నిజ‌మేనా అంటూ ఇంద్ర‌జ‌ను రామ్ ప్ర‌సాద్ అడిగిన ప్ర‌శ్న న‌వ్వుల‌ను పూయించింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.