Pushpa 2 Collection: పుష్ప 2కి వరల్డ్ వైడ్‌గా 1469, ఇండియాలో 1000 కోట్లు! సగానికిపైగా హిందీలోనే ఎక్కువ- లాభాలు ఎంతంటే?
18 December 2024, 11:32 IST
- Pushpa 2 The Rule 13 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీకి 13వ రోజున 10 శాతం వరకు నెట్ కలెక్షన్స్ పడిపోయాయి. కానీ, ఇండియాలో మాత్రం రూ. వెయ్యి కోట్ల కలెక్షన్స్ వైపుకు పుష్ప 2 ది రూల్ మూవీ దూసుకుపోతోంది. మరి 13 రోజుల్లో పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ 13 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
Pushpa 2 Box Office Collection Day 13: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప 2 ది రూల్. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మరింత హైప్ వచ్చింది. అయితే, తాజాగా 13వ రోజున ఇండియాలో మాత్రం పుష్ప 2 కలెక్షన్స్ పది శాతం మేర పడిపోయాయి.
13వ రోజున 24 కోట్లు
పుష్ప 2 సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 24.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు నుంచి 4.35 కోట్లు, హిందీ ద్వారా రూ. 18.5 కోట్లు, తమిళం నుంచి రూ. 1. 1 కోట్లు, కన్నడ ద్వారా 15 లక్షలు, మలయాళం నుంచి 15 లక్షలు వసూలు అయ్యాయి. అయితే, 12వ రోజు వచ్చిన రూ. 26.95 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో పోలిస్తే 13వ రోజున 10.02 శాతం పుష్ప 2 ది రూల్ వసూల్లు తగ్గాయి.
ఇండియాలో వెయ్యి కోట్లు
ఇక భారతదేశంలో 13 రోజుల్లో పుష్ప 2 మూవీకి రూ. 953.3 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే, సుమారుగా రూ. వెయ్యి కోట్ల వైపుగా ఇండియాలో పుష్ప 2 దూసుకుపోతోంది. అంతేకాకుండా 14వ రోజు అయిన ఇవాళ (డిసెంబర్ 18) వెయ్యి కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనిలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
సగానికిపైగా ఎక్కువగా హిందీలో
ఇకపోతే ఇప్పటికీ వచ్చిన 953.3 కోట్ల నెట్ కలెక్షన్స్‌లో తెలుగులో 290.9 కోట్లు, హిందీ నుంచి 591.1 కోట్లు, తమిళం ద్వారా 50.65 కోట్లు, కన్నడలో 6.87 కోట్లు, మలయాళం నుంచి 13.78 కోట్లుగా వసూళ్లు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే 13 రోజుల్లో ఇండియాలో వచ్చిన కలెక్షన్స్‌లో సగానికి పైగా ఎక్కువగా హిందీ కలెక్షన్సే ఉండటం విశేషంగా మారింది.
పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక వరల్డ్ వైడ్‌గా 12 రోజుల్లో రూ. 1409 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పుష్ప 2 ది రూల్ 13 రోజుల్లో రూ. 1469 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ సంస్థలు అంచనా వేసినట్లు బాలీవుడ్ మీడియా మీడియా పేర్కొంది. అలాగే, 13వ రోజున తెలుగులో పుష్ప 2 మూవీకి 21.78 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కాగా.. హిందీలో 18.08 శాతం ప్రేక్షకులు వచ్చినట్లుగా సక్నిల్క్ సంస్థం తెలిపింది.
పుష్ప 2 లాభాలు
ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 మూవీ రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు చేసుకోగా.. దాన్ని 12 రోజుల్లో పూర్తి చేసి హిట్ వైపుగా దూసుకెళ్తోంది. అంతేకాకుండా రూ. 39 కోట్లకుపైగా లాభాలు అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్ మూవీ పుష్ప 2 ది రూల్ హిట్ టాక్ తెచ్చుకుంది.